బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్: ఫైనల్ చేరిన పీవీ సింధు... ఒకుహారతో ఢీకి సై...

సెమీస్‌లో రత్నాచాక్ ఇంటనాన్‌ను 21-16, 25-23 తేడాతో ఓడించిన పీవీ సింధు... ఫైనల్‌లో జపాన్ ప్లేయర్ నోజోమి ఒకుహారతో ఢీ...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: December 15, 2018, 12:33 PM IST
బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్: ఫైనల్ చేరిన పీవీ సింధు... ఒకుహారతో ఢీకి సై...
పీవీ సింధు (photo: twitter)
  • Share this:
బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఫైనల్ చేరింది. సెమీస్‌లో రత్నాచాక్ ఇంటనాన్‌తో పోటీపడిన పీవీ సింధు 21-16, 25-23 తేడాతో వరుస సెట్లతో విజయం సాధించింది. భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ దూకుడికి థాయ్ ప్లేయర్, మాజీ వరల్డ్ నెం. 1 రత్నాచాక్ ఇంటనాన్... మొదటి సెట్‌ను తేలిగ్గా కోల్పోయింది. అయితే రెండో సెట్‌లో వీరిద్దరి మధ్య హోరాహోరీ పోరు జరిగింది. రెండో సెట్ ఆరంభం నుంచి మంచి ఆటతీరు కనబర్చిన ఇంటనాన్... 4-0 స్కోర్‌తో మంచి ఆధిక్యంలోకి ఉన్న పీవీ సింధుని వెనక్కినెట్టి 10-11తో లీడ్‌లోకి వచ్చింది.

అయితే ఆ తర్వాత వీరిద్దరి మధ్య హోరాహోరీ పోరు జరిగింది. ఇద్దరు ప్లేయర్లు చెరో పాయింట్ సాధిస్తూ ఉండడంతో మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. అయితే 23-23 స్కోర్ తర్వాత అద్భుత ఆటతీరుతో వరుసగా రెండు పాయింట్లు సాధించి... సెట్‌నూ, మ్యాచ్‌నూ కైవసం చేసుకుంది పీవీ సింధు. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్‌ గ్రూప్-ఎ తొలి రౌండ్‌ మ్యాచ్‌లో అంచనాలకు మించి రాణించిన పీవీ సింధు... రెండో రౌండ్ మ్యాచ్‌లో మరో సంచలనాత్మక విజయం సాధించింది. తైవాన్‌ స్టార్ ప్లేయర్ తై జు యింగ్‌ను ఓడించి అందరినీ ఆశ్చర్యపరచిన పీవీ సింధు... ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకర్‌కు షాకిచ్చి సెమీఫైనల్‌‌కు అర్హత సాధించింది. తొలి రౌండ్ పోటీలో జపనీస్ బ్యాడ్మింటన్ స్టార్ అకానే యమగుచికి షాకిచ్చి... పీవీ సింధు పెద్ద సంచలనమే సృష్టించిన సంగతి తెలిసిందే. ఫైనల్ మ్యాచ్‌లో జపాన్ ప్లేయర్ నోజోమి ఒకుహారతో ఢీకొనబోతోంది సింధు. ఇంతకుముందు వీరిద్దరి మధ్య జరిగిన మ్యాచ్‌లను చూస్తే ఇద్దరూ చెరో ఆరు మ్యాచుల్లో విజయం సాధించారు. అయితే ఈ మధ్యకాలంలో ఒకుహారకే మంచి రికార్డు ఉంది. ఆగస్టులో జరిగిన మ్యాచ్‌లో పీవీ సింధును ఓడించిన ఒకుహార టోటల్ బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్ 2018 టైటిల్‌ను గెలుచుకుంది.
Published by: Ramu Chinthakindhi
First published: December 15, 2018, 12:33 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading