బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్: పీవీ సింధు చరిత్ర... ఒకుహారను చిత్తుచేసి టైటిల్ కైవసం...

వరల్డ్ టూర్ ఫైనల్ గెలిచిన మొట్టమొదటి భారతీయురాలిగా రికార్డు... ఈ విజయంతో వరల్డ్ నెం. 1 ర్యాంకు సాధించే అద్భుత అవకాశం...

Chinthakindhi.Ramu
Updated: December 16, 2018, 3:12 PM IST
బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్: పీవీ సింధు చరిత్ర... ఒకుహారను చిత్తుచేసి టైటిల్ కైవసం...
పీవీ సింధు (Twitter/BAI Media)
  • Share this:
బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు సరికొత్త చరిత్ర సృష్టించింది. ఫైనల్ మ్యాచ్‌లో జపాన్ ప్లేయర్ నోజోమి ఒకుహారను 21-19,21-17 తేడాతో వరుస సెట్లలో ఓడించి టైటిల్ కైవసం చేసుకుంది. ఈ సీజన్‌కు ఫైనల్‌లో ఓడుతూ వస్తున్న తెలుగు తేజానికి ఇదే తొలి టైటిల్ విజయం కావడం విశేషం. వరల్డ్ టూర్ ఫైనల్ గెలిచిన మొట్టమొదటి భారతీయురాలిగా రికార్డు కూడా క్రియేట్ చేసింది పీవీ సింధు. ఈ విజయంతో వరల్డ్ నెం. 1 ర్యాంకు సాధించే అద్భుత అవకాశాన్ని కూడా సొంతం చేసుకుంది పీవీ సింధు.

ఫైనల్ మ్యాచ్ ప్రారంభం నుంచి ఒకుహారపై పూర్తి ఆధిక్యం కనబర్చిన పీవీ సింధు... 14-6 స్కోర్‌తో మంచి ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే ఆ తర్వాత మెల్లిగా పుంజుకున్న ఒకుహార 16-16 తేడాతో స్కోర్ సమం చేసింది. అయితే ఆ తర్వాత దూకుడు పెంచిన పీవీ సింధు వరుసగా పాయింట్లు సాధించి 21-19 తేడాతో సెట్ కైవసం చేసుకుంది. రెండో సెట్ మొదటి నుంచి మంచి రసవత్తర పోరు సాగింది. 7-7 తేడాతో ఇద్దరూ సమఉజ్జీలుగా ఉన్నారు. సెమీస్‌లో రత్నాచాక్ ఇంటనాన్‌తో పోటీపడిన పీవీ సింధు 21-16, 25-23 తేడాతో వరుస సెట్లతో విజయం సాధించింది. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్‌ గ్రూప్-ఎ తొలి రౌండ్‌ మ్యాచ్‌లో అంచనాలకు మించి రాణించిన పీవీ సింధు... రెండో రౌండ్ మ్యాచ్‌లో మరో సంచలనాత్మక విజయం సాధించింది. తైవాన్‌ స్టార్ ప్లేయర్ తై జు యింగ్‌ను ఓడించి అందరినీ ఆశ్చర్యపరచిన పీవీ సింధు... ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకర్‌కు షాకిచ్చి సెమీఫైనల్‌‌కు అర్హత సాధించింది. తొలి రౌండ్ పోటీలో జపనీస్ బ్యాడ్మింటన్ స్టార్ అకానే యమగుచికి షాకిచ్చి... పీవీ సింధు పెద్ద సంచలనమే సృష్టించిన సంగతి తెలిసిందే.

టైటిల్‌తో పీవీ సింధు అభివాదం...
BWF World Tour Finals: PV Sindhu beats Nozomi Okuhara to win season-ending title బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్: పీవీ సింధు సరికొత్త చరిత్ర... ఒకుహారను చిత్తుచేసి టైటిల్ కైవసం...

బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్‌ టైటిల్ గెలిచిన పీవీసింధుని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అభినందించారు.


Published by: Ramu Chinthakindhi
First published: December 16, 2018, 11:59 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading