BWF Championship 2022 : ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ (BWF Championship ) 2022లో భారత (India) షట్లర్ల ప్రస్థానం ముగిసింది. గత రెండు పర్యాయాలు రెండేసి పతకాలు నెగ్గిన భారత్ ఈసారి కేవలం ఒక్క పతకంతోనే ఇంటిదారి పట్టింది. పురుషుల, మహిళల సింగిల్స్ విభాగాల్లో భారత్ కు ఈసారి నిరాశే మిగిలింది. స్టార్ షట్లర్ పీవీ సింధు (PV Sindhu) గాయంతో ఈ టోర్నీకి దూరం కాగా.. గతేడాది జరిగిన చాంపియన్ షిప్ లో రజతం నెగ్గిన కిడాంబి శ్రీకాంత్ (Kidambi Srikant).. కాంస్యం నెగ్గిన లక్ష్యసేన్ (Lakshya Sen)లు అదే ప్రదర్శనను రిపీట్ చేయలేకపోయారు. ఎటువంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన హెచ్ ఎస్ ప్రణయ్ (HS Pranoy) క్వార్టర్ ఫైనల్లో పోరాడి ఓడిపోయాడు. అయితే గత కొన్నేళ్లుగా అద్భుత ప్రదర్శన చేస్తోన్న భారత జోడి సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి జంట సెమీస్ కు చేరి సత్తా చాటింది.
పురుషుల డబుల్స్ లో సెమీ ఫైనల్ కు చేరడం ద్వారా సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి జంట కాంస్య పతకాన్ని శుక్రవారమే ఖాయం చేసుకుంది. అయితే ఫైనల్ చేరే క్రమంలో మాత్రం ఈ భారత జంటకు చుక్కెదురైంది. శనివారం జరిగిన సెమీస్ పోరులో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి జంట 22-20, 18-21, 16-21తో మలేషియాకు చెందిన ఆరోన్ చియా-వూయి యిక్ సోహ్ల జోడీ చేతిలో ఓడిపోయింది. తొలి గేమ్ ను పోరాడి గెలిచిన భారత జంట మ్యాచ్ లో శుభారంభం చేసింది.
రెండో గేమ్ లోనూ రెండు జంటలు ప్రతి పాయింట్ కోసం తుది వరకు పోరాడాయి. హోరాహోరీగా సాగిన ఈ గేమ్ లో చివరి దశలో అనవసర తప్పిదాలు చేసిన సాత్విక్, చిరాగ్ శెట్టి ద్వయం గేమ్ ను కోల్పోయింది. ఇక కీలకమైన మూడో గేమ్ లో అద్భుతంగా ఆడిన మలేసియా జంట సాత్విక్, చిరాగ్ జోడీపై విజయం సాధించి ఫైనల్లో ప్రవేశించింది.
BWF World Championships 2022
Men's Doubles - Semi Finals
Aaron Chia/Soh Wooi Yik ???????? vs Satwiksairaj Rankireddy/Chirag Shetty ????????
20-22, 21-18, 21-16
Alhamdulillah they finally break the SF curse! ????
Huge congrats for advancing to the FINAL ChiaSoh ???????? #BWC2022 pic.twitter.com/uCWsJtBo3p
— レディディラ (@ladydyla__) August 27, 2022
ఈ క్రమంలో సాత్విక్-చిరాగ్ శెట్టి జంట అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. భారత బ్యాడ్మింటన్ చరిత్రలో పురుషుల డబుల్స్ విభాగంలో తొలి పతకం సాధించిన జంటగా నిలిచింది. 2011లో జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ లో మహిళల డబుల్స్ లో గుత్తాజ్వాలా-అశ్విని పొన్నప్ప ద్వయం కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Badminton, Pv sindhu, Tokyo, World Badminton Championship