Chirag Shetty and Satwiksairaj Rankireddy: గాయంతో పీవీ సింధు (PV Sindhu) అవుట్.. ఫామ్ లో ఉన్న లక్ష్యసేన్ (Lakshya Sen), కిడాంబి శ్రీకాంత్ (Kidambi Srikant)లకు ఊహించని ఓటములు.. 2019లో కాంస్యం నెగ్గిన సాయి ప్రణీత్ తొలి రౌండ్లోనే ఓటమి. మహిళల సింగిల్స్ తొలి రౌండ్ లో మురిపించిన సైనా నెహ్వాల్ (Sania Nehwal)కు మూడో రౌండ్లో చుక్కెదురు. టోర్నీ ఆరంభమై నాలుగు రోజులు ముగిశాక చాంపియన్ షిప్ బరిలో కేవలం పురుషుల డబుల్స్.. సింగిల్స్ లో మాత్రమే భారత ప్లేయర్లు మిగిలారు. ఇది ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ (BWF World ChampionShip) 2022లో భారత్ ప్రస్థానం. గురువారం తర్వాత పురుషుల డబుల్స్ లో సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి, ధ్రువ్ కపిల-అర్జున్ జంట.. పురుషుల సింగిల్స్ లో హెచ్ ఎస్ ప్రణయ్ లు మాత్రమే మిగిలారు.
అయితే శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ పోరులో భారత స్టార్ బ్యాడ్మింటన్ జోడీ చిరాగ్ శెట్టి- సాత్విక్‌సాయిరాజ్ సరికొత్త చరిత్ర సృష్టించింది. పురుషుల డబుల్స్ విభాగంలో ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పతకం ఖరారు చేసుకుని ఈ ఘనత సాధించిన తొలి భారత పురుషుల జంటగా నిలిచింది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో సాత్విక్ - చిరాగ్ శెట్టి ద్వయం 24- 22, 15- 21, 21- 14తో రెండో సీడ్ టకురో హోకి- యుగో కొబయాషి(జపాన్)పై అద్భుత విజయాన్ని నమోదు చేసింది. సెమీఫైనల్ కు చేరుకోవడం ద్వారా సాత్విక్ - చిరాగ్ శెట్టి జంట కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది. ఈ క్రమంలో డబుల్స్ విభాగంలో పతకం ఖాయం చేసుకున్న రెండో భారత జంటగా కూడా ఈ ద్వయం నిలిచింది. 2011లో అశ్విని పొన్నప్ప - గుత్తా జ్వాల జంట మహిళల డబుల్స్ లో కాంస్య పతకం నెగ్గింది.
✅ First ???????? MD pair to secure a #BWFWorldChampionships medal
✅ Only 2nd #WorldChampionships medal from ???????? doubles pair
✅ 13th medal for ???????? at World's@satwiksairaj & @Shettychirag04 script history yet again ????#BWFWorldChampionships2022#BWC2022#Tokyo2022#IndiaontheRise pic.twitter.com/POW0uYt7KC
— BAI Media (@BAI_Media) August 26, 2022
పురుషుల సింగిల్స్ విభాగంలో సంచలన విజయాలతో దూసుకొచ్చిన హెచ్ ఎస్ ప్రణయ్ పోరాటం క్వార్టర్ ఫైనల్లోనే ముగిసింది. ప్రణయ్ 21-19, 6-21. 18-21తో జావో జున్ పెంగ్ (చైనా) చేతిలో పోరాడి ఓడాడు. తొలి గేమ్ ను సొంతం చేసుకున్న ప్రణయ్.. రెండో గేమ్ లో పేలవ ఆట ప్రదర్శించాడు. ఇక మూడో గేమ్ లో చివరి వరకు పోరాడిన ఓటమి మాత్రం తప్పలేదు. ఇక మరో పురుషుల సింగిల్స్ లో అర్జున్-ధ్రువ్ కపిల జంట 8-21, 14-21తో మొహమ్మద్ హసన్, హెడ్రా సెటియావన్ (ఇండోనేసియా) జోడీ చేతిలో ఓడింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Badminton, Pv sindhu, Saina Nehwal, World Badminton Championship