BWF World Championship 2022 : గత కొన్నేళ్లుగా గాయాలు, ఫిట్ నెస్ సమస్యలతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ (Saina Nehwal) సూపర్ షోతో అదరగొట్టింది. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ (BWF World Championship)లో సైనా నెహ్వాల్ అద్భుత ఆటతీరుతో శుభారంభం చేసింది. మంగళవారం ఉదయం జరిగిన మహిళల విభాగంలో జరిగిన తొలి రౌండ్ పోరులో సైనా 21-19, 21-9తో హాంకాంగ్‌కు చెందిన చెయుంగ్ న్గన్ యి (CHEUNG Ngan Yi)ను ఓడించింది. కేవలం 38 నిమిషాల పాటే సాగిన ఈ మ్యాచ్ లో ప్రత్యర్థికి సైనా ఎటువంటి అవకాశాన్ని ఇవ్వలేదు. కాగా రెండో రౌండ్‌లో జపాన్‌కు చెందిన ఆరవ సీడ్ ఒకుహరా (nozomi okuhara)తో తలపడాల్సి ఉండగా.. ఆఖరి నిమిషంలో ఒకుహరా గాయం కారణంగా టోర్నీ నుంచి తప్పుకోవడంతో సైనాకు థర్డ్ రౌండ్‌కు బై లభించింది. దీంతో మూడో రౌండ్‌లో సైనా నెహ్వాల్.. థాయ్‌లాండ్‌కు చెందిన బుసానన్ ఒంగ్‌బమ్రుంగ్‌ఫాన్, జర్మనీకి చెందిన వైవోన్ లీ మధ్య విజేతతో తలపడనుంది.
లక్ష్యసేన్, శ్రీకాంత్ ముందంజ
ఇటీవలె ముగిసిన కామన్వెల్త్ గేమ్స్ లో గోల్డ్ మెడల్ సాధించిన లక్ష్యసేన్, కాంస్యం నెగ్గిన కిడాంబి శ్రీకాంత్ లు ముందంజ వేశారు. లక్ష్యసేన్ 21-12, 21-11తో క్రిస్టియాన్ (డెన్మార్క్)పై నెగ్గాడు. కేవలం 35 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్ లో ప్రత్యర్థిని ముప్పుతిప్పలు పెట్టిన లక్ష్యసేన్ సులభమైన విక్టరీని అందుకున్నాడు. తద్వారా రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. గతేడాది జరిగిన ప్రపంచ చాంపియన్ షిప్ లో లక్ష్యసేన్ కాంస్య పతకం నెగ్గిన సంగతి తెలిసిందే. ఇక మరో మ్యాచ్ లో శ్రీకాంత్ 22-20, 21-19తో గ్యూయెన్ (ఐర్లాండ్)పై గెలుపొందాడు. 51 నిమిషాల్లో ముగిసిన ఈ పోరులో శ్రీకాంత్ కు ప్రత్యర్థి నుంచి గట్టిపోటే ఎదురైంది. అయితే కీలక సమయాల్లో పాయింట్లను సాధించిన అతడు ఘనవిజయం సాధించి రెండో రౌండ్లో ప్రవేశించాడు.
Badminton World Championships:
Saina Nehwal advances into Pre-QF with 21-19, 21-9 win over WR 50 Cheung Ngan Yi in 1st round.
???? Saina's 2nd round opponent Nozomi Okuhara had already withdrawn from the tournament; So Saina is into R16. #BWFWorldChampionships pic.twitter.com/8CG4TaCakR
— India_AllSports (@India_AllSports) August 23, 2022
మరో స్టార్ షట్లర్ హెచ్ ఎస్ ప్రణయ్ 21-12, 21-11తో లుకా వ్రెబెర్ (ఆస్ట్రియా)పై ఈజీ విక్టరీ నమోదు చేశాడు.కామన్వెల్త్ గేమ్స్ లో ఆడుతూ 2019 మహిళల ప్రపంచ చాంపియన్ పీవీ సింధు గాయపడ్డంతో ఆమె ఈ టోర్నీ నుంచి తప్పుకుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Badminton, India, Japan, Pv sindhu, Saina Nehwal, Team India, Tokyo, World Badminton Championship