BWF World Championships 2022 : ప్రతిష్టాత్మక బ్యాడ్మింటన్ (Badminton) టోర్నమెంట్ బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ చాంపియన్ షిప్ (BWF World Championships ) 2022లో తొలి రోజే భారత్ (India) ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. 2019లో జరిగిన ప్రపంచ చాంపియన్ షిప్ లో కాంస్య పతకం నెగ్గిన భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ సాయి ప్రణీత్ (Sai Praneet) తొలి రౌండ్లోనే ఓడిపోయాడు. గత కొన్ని రోజులుగా ఫామ్ లో లేని సాయి ప్రణీత్.. మరో టోర్నమెంట్ లో విఫలం అయ్యాడు. పురుషుల విభాగంలో జరిగిన తొలి రౌండ్ పోరులో సాయి ప్రణీత్ 15-21, 21-15, 15-21తో చౌ టియెన్ చెన్ (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయాడు. ర్యాంక్ పరంగా.. ఫామ్ పరంగా చూస్తూ చౌ ప్రస్తుతం సాయి ప్రణీత్ కంటే ఎంతో మెరుగ్గా ఉన్నాడు. 64 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్ లో సాయి ప్రణీత్ పోరాడి ఓడిపోయాడు.
లక్ష్యసేన్, శ్రీకాంత్ ముందంజ
ఇటీవలె ముగిసిన కామన్వెల్త్ గేమ్స్ లో గోల్డ్ మెడల్ సాధించిన లక్ష్యసేన్, కాంస్యం నెగ్గిన కిడాంబి శ్రీకాంత్ లు ముందంజ వేశారు. లక్ష్యసేన్ 21-12, 21-11తో క్రిస్టియాన్ (డెన్మార్క్)పై నెగ్గాడు. కేవలం 35 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్ లో ప్రత్యర్థిని ముప్పుతిప్పలు పెట్టిన లక్ష్యసేన్ సులభమైన విక్టరీని అందుకున్నాడు. తద్వారా రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. గతేడాది జరిగిన ప్రపంచ చాంపియన్ షిప్ లో లక్ష్యసేన్ కాంస్య పతకం నెగ్గిన సంగతి తెలిసిందే. ఇక మరో మ్యాచ్ లో శ్రీకాంత్ 22-20, 21-19తో గ్యూయెన్ (ఐర్లాండ్)పై గెలుపొందాడు. 51 నిమిషాల్లో ముగిసిన ఈ పోరులో శ్రీకాంత్ కు ప్రత్యర్థి నుంచి గట్టిపోటే ఎదురైంది. అయితే కీలక సమయాల్లో పాయింట్లను సాధించిన అతడు ఘనవిజయం సాధించి రెండో రౌండ్లో ప్రవేశించాడు. మరో స్టార్ షట్లర్ హెచ్ ఎస్ ప్రణయ్ 21-12, 21-11తో లుకా వ్రెబెర్ (ఆస్ట్రియా)పై ఈజీ విక్టరీ నమోదు చేశాడు.
Badminton World Championships:
Kidambi Srikanth advances into R32 with 22-20, 21-19 win over WR 39 Nhat Nguyen in 1st round.
???? The Irish shuttler had defeated Srikanth in their last meeting in 1st round of All England Championships last year. #BWFWorldChampionships pic.twitter.com/A8Lb4vpqLw
— India_AllSports (@India_AllSports) August 22, 2022
కామన్వెల్త్ గేమ్స్ లో ఆడుతూ 2019 మహిళల ప్రపంచ చాంపియన్ పీవీ సింధు గాయపడ్డంతో ఆమె ఈ టోర్నీ నుంచి తప్పుకుంది. మహిళల విభాగంలో సైనా నెహ్వాల్ బరిలో ఉంది. అయితే ఆమె ఫామ్ ప్రకారం సెమీస్ చేరడం కష్టంగానే ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Badminton, KL Rahul, Pv sindhu, Saina Nehwal, Sanju Samson, Shikhar Dhawan, Team India, World Badminton Championship