Robbery : ఒడిశా (Odisha) వేదికగా హాకీ వరల్డ్ కప్ 2023 (Hockey World Cup 2023) జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఒడిశాలో కట్టుదిట్టమైన భద్రత ఉంది. ఇంత భద్రత నడుమ కూడా ఒడిశా రాజధాని భువనేశ్వర్ (Bhuvneshwar )లో చోరీ జరిగింది. ఏకంగా భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్ ఇంట్లోనే చోరీ జరగడం గమనార్హం. 2007లో భారత పురుషుల హాకీ జట్టుకు ప్రబోద్ టిర్కీ నాయకత్వం వహించాడు. అతడి ఇంట్లో శుక్రవారం రాత్రి చోరీ జరిగింది. తన ఇంట్లో చోరీ జరిగిందని ప్రబోద్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వార్త వెలుగులోకి వచ్చింది. ప్రబోద్ భువనేశ్వర్ లోని అత్యంత కట్టుదిట్టమైన యూనిట్ 4లో నివాసం ఉంటున్నారు. ఇక్కడ ప్రభుత్వ ఉన్నతాధికారులతో పాటు రాజకీయ నాయకులు కూడా నివాసం ఉంటారు. అయితే ఇటువంటి చోట చోరీ జరగడం అందరిలోనూ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
2001లో ఆస్ట్రేలియా వేదికగా జరిగిన జూనియర్ హాకీ వరల్డ్ కప్ లో భారత్ జూనియర్ జట్టు చాంపియన్ గా నిలిచింది. ఇందుకు సంబంధిచిన గోల్డ్ మెడల్ తో పాటు 2010 ఆసియా గేమ్స్ లో సీనియర్ జట్టుతో గెలిచిన కాంస్య పతం.. న్యూఢిల్లీ వేదికగా జరిగిన కామన్వెల్త్ గేమ్స్ రజత పతకాలను కూడా దొంగలు పట్టుకెళ్లారు. దీంతో పాటు ఇంట్లో ఉన్న 55 ఇంచ్ ల స్మార్ట్ టీవీతో పాటు రూ. లక్ష రూపాయలు విలువ చేసే బంగారు ఆభరణాలను చోరీ చేసినట్లు తన ఫిర్యాదులు ప్రబోద్ పేర్కొన్నాడు. సీసీ టీవీ కెమెరాల నుంచి ఫుటేజ్ ను కలెక్ట్ చేయడంలో పోలీసులు విఫలం అయ్యారు. అస్సలు అతడి క్వార్టర్స్ లో సీసీ కెమెరాలు పని చేస్తున్నాయో లేదో కూడా తెలియని పరిస్థితి. తాను టీవీ, బంగారు అభరణాల గురించి ఆలోచించడం లేదని.. దేశం తరఫున గెలిచిన పతకాల గురించి ఆందోళన చెందుతున్నట్లు ప్రబోద్ పేర్కొన్నారు. దొంగలను పట్టుకుని వాటిని తిరిగి తనకు దక్కేలా చేయాలంటూ పోలీసులకు రిక్వెస్ట్ చేశాడు. దేశం తరఫున గెలిచిన మెడల్స్ తనకు ఆస్తి లాంటిదంటూ పేర్కొన్నాడు.
ఇక హాకీ ప్రపంచకప్ లో టీమిండియా కథ ముగిసింది. 1975లో చివరి సారిగా ప్రపంచకప్ ను గెలిచిన భారత్ ఆ తర్వాత ఏనాడు కూడా సెమీస్ కు చేరలేదు. అయితే ఈ ఏడాది 48 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు భారత్ తెరదించుతుందని అభిమానులు ఆశించారు. ఒడిశాలోని కళింగ స్టేడియంలో జరిగిన క్రాస్ ఓవర్ మ్యాచ్ లో ఆతిథ్య భారత్ పెనాల్టీ షూటౌట్ లో 4-5 తేడాతో న్యూజిలాండ్ చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hockey, Hockey World Cup 2023, Odisha, Robbery