టీమిండియా సంచలనం...పేస్ బౌలర్ బుమ్రాకు మరో ప్రతిష్టాత్మక అవార్డు..

టెస్టుల్లో, పరిమిత ఓవర్ల క్రికెట్‌లో తనదైన పెర్ఫార్మన్స్‌తో రికార్డులు సృష్టిస్తున్న బుమ్రాకు ఈ అవార్డును అందించాలని నిర్వాహకులు నిర్ణయించారు.

news18-telugu
Updated: October 25, 2019, 10:23 PM IST
టీమిండియా సంచలనం...పేస్ బౌలర్ బుమ్రాకు మరో ప్రతిష్టాత్మక అవార్డు..
బుమ్రా (ఫైల్ చిత్రం)
  • Share this:
ప్రతిష్టాత్మకమైన విజ్డెన్ ఇండియా అల్మానక్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ పురస్కారాలకు బుమ్రా, మంధానలు ఎంపికయ్యారు. 2019 సంవత్సరానికి గాను వీరిద్దరికి ఈ ప్రతిష్టాత్మకమైన పురస్కారం వరించింది. అంతర్జాతీయ క్రికెట్‌లో వీరిద్దరి ప్రదర్శనకు గుర్తింపుగా ఈ అవార్డులు దక్కాయి. ఈసారి మొత్తం ఐదుగురిని ఈ అవార్డు కోసం ఎంపిక చేశారు. టెస్టుల్లో, పరిమిత ఓవర్ల క్రికెట్‌లో తనదైన పెర్ఫార్మన్స్‌తో రికార్డులు సృష్టిస్తున్న బుమ్రాకు ఈ అవార్డును అందించాలని నిర్వాహకులు నిర్ణయించారు. బుమ్రా అంతర్జాతీయ క్రికెట్‌లో మెరుగైన బౌలర్‌గా పేరు తెచ్చుకున్నాడు. అన్ని ఫార్మాట్లలో  బుమ్రా వికెట్ల పంట పండిస్తున్నాడు. భారత్ సాధిస్తున్న విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. అతని ప్రతిభకు గుర్తింపుగా ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డు దక్కింది. ఇక, మహిళల క్రికెట్‌లో బ్యాటింగ్ ద్వారా రికార్డులు సృష్టిస్తున్న ఓపెనర్‌గా పేరు తెచ్చుకున్న మంధానకు కూడా ఈ అవార్డు లభించింది.
Published by: Krishna Adithya
First published: October 25, 2019, 10:23 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading