India vs New Zealand: బౌలర్ బుమ్రాపై సంచలన వ్యాఖ్యలు చేసిన షోయబ్ అఖ్తర్...

India vs New Zealand| కివీస్ బ్యాట్స్ మెన్ దూకుడు చూసి న్యూజిలాండ్ బౌలర్ గెలుస్తుందని అనుకున్నట్లు తెలిపాడు. అయితే జస్‌ప్రీత్‌ బుమ్రా(Jasprit Bumrah) ఒక ఎక్స్ ఫ్యాక్టర్ అని షోయబ్ అన్నాడు. బుమ్రా ఓవర్‌ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసిందని తెలిపాడు.

news18-telugu
Updated: February 3, 2020, 6:35 PM IST
India vs New Zealand: బౌలర్ బుమ్రాపై సంచలన వ్యాఖ్యలు చేసిన షోయబ్ అఖ్తర్...
(ఫైల్ చిత్రం)
  • Share this:
India vs New Zealand | కివీస్ తో జరిగిన ఆఖరి టీ20 (India vs New Zealand)పై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ పేసర్ రావల్సిండి ఎక్స్‌ప్రెస్ సోయబ్ అక్తర్ (Shoaib Akhtar) సంచలన వ్యాఖ్యలు చేశారు. చివరి వన్డే మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధిస్తుందని తాను ఊహించలేదని షోయబ్‌ అక్తర్‌ ఈ సందర్భంగా తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చాడు. అంతేకాదు మొదటి 10 ఓవర్లలో కివీస్ బ్యాట్స్ మెన్ దూకుడు చూసి న్యూజిలాండ్ బౌలర్ గెలుస్తుందని అనుకున్నట్లు తెలిపాడు. అయితే జస్‌ప్రీత్‌ బుమ్రా(Jasprit Bumrah) ఒక ఎక్స్ ఫ్యాక్టర్ అని షోయబ్ అన్నాడు. బుమ్రా ఓవర్‌ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసిందని తెలిపాడు. 5వ టీ20 మ్యాచ్ గెలుపు వెనుక క్రెడిట్ మొత్తం బుమ్రాకే దక్కుతుందని షోయబ్ అన్నాడు. నవదీప్ సైనీ, శార్దూల్‌ ఠాకూర్ తో పోల్చి చూస్తే బుమ్రానే మరింత మెరుగైన బౌలర్ అంటూ అక్తర్ పొగడ్తలతో ముంచెత్తాడు. గాయం తర్వాత బుమ్రా (Jasprit Bumrah) తొందరగా అందిపుచ్చుకున్నాడన్నాడని షోయబ్ చెప్పుకొచ్చాడు. న్యూజిలాండ్‌తో జరిగిన ఆఖరి టీ20లో బుమ్రా 12 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. ఆఖరి స్పెల్ లో బుమ్రా భారీగా పరుగులు ఇచ్చినట్లు ఎక్కడా లేదని అక్తర్ తెలిపాడు. అంతేకాదు నాలుగు నెలలుగా గాయం కారణంగా జట్టుకు దూరమైన టీమిండియా స్పీడ్ స్టార్, యార్కర్ స్పెషలిస్ట్ జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) శ్రీలంకతో సిరీస్ సమయంలో రీఎంట్రీ ఇచ్చాడు. ఆ సిరీస్ లో సత్తా చాటిన బుమ్రా తన బౌలింగ్ లో ఏమాత్రం వేడి తగ్గలేదని తన ప్రత్యర్థులకు డేంజర్ సిగ్నల్స్ పంపాడు.

26 ఏళ్ల బుమ్రా గత కొన్నాళ్లుగా జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. నవదీప్ సైనీ, శార్దుల్ ఠాకూర్‌లు సైతం బుమ్రా(Jasprit Bumrah)తో పేస్ బౌలింగ్‌ను పంచుకోవడంతో భారత్ పేస్ దళం గాడిన పడిందనే చెప్పవచ్చు. ఈ దెబ్బతో కోహ్లీ సేన మరిన్ని అప్రతిహత విజయాలు దక్కించుకున్న ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

బుమ్రా ప్రపంచ రికార్డు...

టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. టీ20ల్లో ఏడు మెయిడెన్ ఓవర్లు వేసిన తొలి బౌలర్‌గా బుమ్రా కొత్త చరిత్ర సృష్టించాడు. అంతకు ముందు ఈ రికార్డు శ్రీలంక బౌలర్ నువాన్ కులశేఖర పేరిట ఉండేది. అతడు 58 టీ20లు ఆడిన కులశేఖర ఆరు మెయిడెన్లు వేశాడు. అయితే సూపర్ ఫామ్ లో ఉన్న బుమ్రా(Jasprit Bumrah) నెలకొల్పిన ప్రపంచ రికార్డును బద్దలుగొట్టాడు. ఇప్పుడు ఏడు మెయిడెన్లతో బుమ్రా ఆ రికార్డును తిరగరాశాడు. ఇదిలా ఉంటే న్యూజిలాండ్ తో జరుగుతున్న చివరి టీ20లో నాలుగు ఓవర్లు వేసిన బుమ్రా ఓ మెయిడెన్ వేయడం ద్వారా ఈ రికార్డును సాధించాడు. కాగా ఈ మ్యాచులో బుమ్రా (Jasprit Bumrah) కేవలం 12 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు నేల కూల్చడం విశేషం. ఇదిలా ఉంటే గత కొంత కాలంగా గాయాలతో సతమతమై జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చి బుమ్రా, అదరగొట్టే రేంజులో తన సత్తాచాటాడు. బుమ్రా ధాటికి బ్యాట్స్ మెన్ ముప్పు తిప్పలు పడ్డారని టీమిండియా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ప్రపంచంలోనే నెంబర్ వన్ బౌలర్ గా పేరొందిన బుమ్రా ఆ స్థానానికి తగిన పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టడం విశేషం.

First published: February 3, 2020, 6:35 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading