టోక్యో ఒలింపిక్స్ 2020లో (Tokyo Olympics) వెయిట్ లిఫ్టింగ్ (Weight Lifting) విభాగంలో భారత్‌కు రజత పతకం (Silver Medal) అందించిన మీరాబాయి చానుపై (Mirabai Chanu) ప్రశంసల జల్లులు ఇంకా కురుస్తూనే ఉన్నాయి. ఇప్పటికే అనేక అవార్డులు, నగదు పురస్కారాలు ఆమెకు ప్రకటించారు. జీవితాంతం పిజ్జాని ఫ్రీగా ఇస్తామంటూ డోమినోస్ ప్రకటించింది. తాజాగా మీరాబాయి పని చేస్తున్న రైల్వే శాఖ బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఆమెకు రూ. 2 కోట్ల నగదుతో పాటు ప్రమోషన్ కూడా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. మీరాబాయి చాను ప్రస్తుతం ఈశాన్య రైల్వేలో పని చేస్తుండగా ఆమెను ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (స్పోర్ట్స్) గా ప్రమోట్ చేశారు. ఈ మేరకు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. టోక్యో ఒలింపిక్స్ నుంచి తిరిగి రాగానే ఆమె రైల్వే శాఖ మంత్రిని కలిసింది. 2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో కరణం మల్లీశ్వరి తర్వాత దేశానికి ఆమె పతకం అందించింది. 49 కిలోల పోటీల్లో చైనా అథ్లెట్ హు జిహుయి 210 కిలోలు ఎత్తి పసిడి పతకం కైవసం చేసుకుంది. స్నాచ్‌లో 94 కిలోలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 116 కిలోలు ఎత్తి ఘన విజయం సాదిందింది. మరోవైపు మీరాబాయి స్నాచ్‌లో 87కి, క్లీన్ అండ్ జెర్క్‌లో 115కి.. మొత్తంగా 202 కిలోలు ఎత్తి రజతం కైవసం చేసుకుంది.
It was great to meet and congratulate the pride of India and honour of Indian Rly, @mirabai_chanu. Also felicitated her & announced Rs. 2 Cr , a promotion and more. She has inspired billions around the world with her talent, handwork and grit.
Keep winning for India! pic.twitter.com/gYRftarOrr
కాగా, మీరాబాయితో పాటు 49 కేజీల విభాగంలో పాల్గొని స్వర్ణం గెలిచిన హు జిహూయిని నిర్వాహకులు ఒలింపిక్ గ్రామంలోనే ఉండాల్సిందిగా ఆదేశించారు. ఆమెపై డోపింగ్ ఆరోపణలు ఉన్నాయి. సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి డోప్ పరీక్షలు చేయనున్నారని తెలిసింది. ఒకవేళ జిహూయి డోపింగ్ పరీక్షల్లో విఫలమైతే.. మీరాబాయి రజతాన్ని స్వర్ణానికి ప్రమోట్ చేయనున్నారు.
Published by:John Naveen Kora
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.