హోమ్ /వార్తలు /క్రీడలు /

BCCI: బీసీసీఐకి షాక్ ఇచ్చిన తాలిబన్లు.. భారీగా ఆదాయాన్ని నష్టపోనున్న క్రికెట్ బోర్డు

BCCI: బీసీసీఐకి షాక్ ఇచ్చిన తాలిబన్లు.. భారీగా ఆదాయాన్ని నష్టపోనున్న క్రికెట్ బోర్డు

బీసీసీఐకి షాకిచ్చిన తాలిబన్ ప్రభుత్వం.. భారీగా ఆదాయానికి నష్టం (PC: BCCI)

బీసీసీఐకి షాకిచ్చిన తాలిబన్ ప్రభుత్వం.. భారీగా ఆదాయానికి నష్టం (PC: BCCI)

అఫ్గానిస్తాన్‌లో రాజ్యాధికారం చేపట్టిన తాలిబన్లు తాజాగా తీసుకున్న నిర్ణయం బీసీసీఐని షాక్‌కు గురిచేసింది. ఐపీఎల్ 2021 రెండో దశ ప్రసారాలను అఫ్గానిస్తాన్‌లో నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నది.

  ప్రపంచంలోనే సుసంపన్నమైన క్రికెట్ బోర్డుగా పేరున్న బీసీసీఐకి (BCCI) అఫ్గానిస్తాన్‌లో (Afghanistan) అధికారం చేపట్టిన తాలిబన్స్ (Taliban) పెద్ద షాక్ ఇచ్చారు. తమ దేశంలో ఐపీఎల్ 2021 (IPL 2021) రెండో దశ ప్రసారాలను నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. క్రికెట్ మ్యాచ్‌ల ప్రసార సమయంలో వచ్చే యాడ్స్, మైదానంలో ఆడవాళ్ల నృత్యాలు వంటివి ముస్లిం మత విధానాలకు విరుద్దమని.. వాటిని చూడటం వల్ల మనసులో చెడు భావాలు వస్తాయనే ఉద్దేశంతోనే టీవీ, మొబైల్స్‌లో ఐపీఎల్ ప్రసారాలు బ్యాన్ చేసినట్లు తెలుస్తున్నది. అఫ్గానిస్తాన్‌లో క్రికెట్‌ను అభివృద్ది చేసింది తాలిబన్లే అయినా.. మొదటి నుంచి మహిళలను మాత్రం స్టేడియంలలోకి అనుమతించడంపై నిషేధం ఉన్నది. రెండో సారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అఫ్గానిస్తాన్‌లో అన్ని రకాల వినోద కార్యక్రమాలపై నిషేధం విధించారు. క్రీడా ప్రసారాలతో పాటు మహిళల ఆటలు ఆడటంపై కూడా ఆంక్షలు ఉన్నాయి.

  యూఏఈ వేదికగా ఐపీఎల్ 2021 రెండో దశ ఆదివారం నుంచి ప్రారంభమైంది. ఈ లీగ్‌లో అఫ్గానిస్తాన్‌కు చెందిన ప్రముఖ క్రికెటర్లు రషీద్ ఖాన్, మహ్మద్ నబీ, ముజీబుర్ రెహ్మాన్ కూడా ఆడుతున్నారు. విదేశీ పర్యటనలకు, విదేశీ క్రికెట్‌లకు పురుష క్రికెటర్లు వెళ్లడంపై తాలిబన్స్ ఎలాంటి ఆంక్షలు పెట్టలేదు. కానీ మహిళలు ఆటలు ఆడటంపై నిషేధం విధించారు. ఇక యూఏఈలో జరుగుతున్న ఐపీఎల్‌కు ప్రేక్షకులను అనుమతిస్తున్నారు. ఆ స్టేడియంలలోకి జుట్టు కత్తరించుకున్న మహిళల మ్యాచ్ చూడటానికి వస్తారని.. వాళ్లు టీవీలో కనిపించే అవకాశం ఉంటుందని తాలిబన్లు అంటున్నారు. వాళ్లను చూడటం వల్ల అఫ్గాన్ మహిళలు కూడా వారిని అనుసరిస్తారు కాబట్టే టీవీ, మొబైల్‌లలో ప్రసారాలు నిషేధిస్తున్నట్లు తెలుస్తున్నది.

  BCCI: క్రికెటర్లకు గుడ్ న్యూస్ చెప్పిన బీసీసీఐ.. వారికి ఇకపై భారీగా జీతాలు.. పాత డిమాండ్లకు ఓకే


   తాలిబన్స్ ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల బీసీసీఐకి భారీగా నష్టం వాటిల్లనున్నది. అఫ్గానిస్తాన్‌లో ఐపీఎల్ ప్రసారాలు చేసేందుకు 'ఆర్టీఏ టీవీ' హక్కులు కలిగి ఉన్నది. స్టార్ గ్రూప్ నుంచి సదరు బ్రాడ్‌కాస్టర్ హక్కులు పొందాడు. ఇప్పుడు తాలిబన్స్ నిషేధం విధించడంతో వారికి భారీగా నష్టం రానున్నది. అది స్టార్ గ్రూప్, బీసీసీఐల ఆదాయంపై ప్రభావం చూపనున్నది. కచ్చితంగా ఎంత నష్టం వస్తుందని వెల్లడించకపోయినా.. అఫ్గానిస్తాన్ ద్వారా వచ్చే ఆదాయానికి గండి పడినట్లు అని తెలుస్తున్నది.  తాలిబన్ తీసుకున్న నిర్ణయాన్ని అఫ్గానిస్తాన్ క్రికెట్ మీడియా మాజీ మేనేజర్, జర్నలిస్ట్ ఇబ్రహీం మహ్మద్ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించాడు. ముస్లిం మత విధానాలు, పద్దతులకు వ్యతిరేకమైన కంటెంట్ ప్రసారం అవుతుందనే అనుమానంతోనే ఐపీఎల్ 2021 ప్రసారాలు నిషేధించినట్లు ఆ ట్వీట్‌లో పేర్కొన్నాడు.

  Published by:John Kora
  First published:

  Tags: IPL 2021, Taliban

  ఉత్తమ కథలు