Mohammad Siraj : నాన్నకు ప్రేమతో...సొంత గడ్డపై అడుగుపెట్టగానే తండ్రి సమాధి దగ్గరకు సిరాజ్

తల్లిదండ్రులతో మహ్మద్ సిరాజ్ (ఫొటో-PTI)

Mohammad Siraj : ఆస్ట్రేలియా సిరీస్ లో నిప్పులు చెలరేగే బంతులతో ప్రత్యర్థికి చుక్కలు చూపించిన మన హైదరాబాదీ మహ్మద్ సిరాజ్ సొంత గడ్డపై అడుగుపెట్టాడు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో సిరాజ్ కు ఘనస్వాగతం లభించింది. అయితే, భాగ్యనగరంలో అడుగుపెట్టగానే డైరక్ట్ గా ఖైరతాబాద్‌ వెళ్లి..

  • Share this:
    ఆస్ట్రేలియా సిరీస్ లో నిప్పులు చెలరేగే బంతులతో ప్రత్యర్థికి చుక్కలు చూపించిన మన హైదరాబాదీ మహ్మద్ సిరాజ్ సొంత గడ్డపై అడుగుపెట్టాడు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో సిరాజ్ కు ఘనస్వాగతం లభించింది. అయితే, భాగ్యనగరంలో అడుగుపెట్టగానే డైరక్ట్ గా ఖైరతాబాద్‌ వెళ్లి.. తండ్రి మహ్మద్ గౌస్ సమాధిని దర్శించుకున్నాడు. నాన్న సమాధి వద్ద పుష్పాలతో నివాళులు అర్పించి.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించాడు. సిరాజ్ ఆస్ట్రేలియా టూర్‌లో ఉన్న స‌మ‌యంలోనే అత‌ని తండ్రి మొహ్మద్ గౌస్ మ‌ర‌ణించిన విష‌యం తెలిసిందే. తండ్రి అంత్య‌క్రియ‌ల్లో పాల్గొన‌డం కోసం తిరిగి ఇండియాకు వెళ్లిపోవ‌చ్చ‌ని బీసీసీఐ మహ్మద్ సిరాజ్‌కు అవకాశం క‌ల్పించింది. కానీ సిరాజ్ మాత్రం అంత‌టి విషాదంలోనూ టీమ్‌తోనే ఉండాల‌ని నిర్ణ‌యించుకున్నాడు. తండ్రి కలను నెరవేర్చాలనే ఆశయంతో ఆస్ట్రేలియాలోనే ఉండిపోయాడు. తండ్రి ఈ లోకాన్ని వ‌దిలి వెళ్లాడ‌న్న దుఃఖాన్ని దిగ‌మింగుకొని టెస్ట్ సిరీస్‌లో అద్భుతంగా రాణించాడు. చివ‌రి టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసి సిరీస్ విజ‌యంలో కీల‌క‌పాత్ర పోషించాడు. ఈరోజు హైదరాబాద్ చేరుకొని.. ‌తన తండ్రి స‌మాధి ద‌గ్గ‌రికి వెళ్లి ప్రార్థించాడు.

    సిరాజ్ ఈ ఉదయం 9 గంటలకు శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్నాడు. ఈ సందర్భంగా అతడికి ఘన స్వాగతం లభించింది. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లి స్వాగతం పలికారు. పుష్ప గుచ్చాలు ఇచ్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు. విమానాశ్రయం నుంచి సిరాజ్ టోలిచౌక్‌లోని తన ఇంటికి చేరుకున్నాడు. అక్కడ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, అభిమానులతో సందడి వాతావరణం నెలకొంది.



    మొహ్మద్ సిరాజ్ 2019లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో వన్డేల్లో అరంగేట్రం చేశాడు. దేశీవాళీ క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌ 2020లోనూ మెరుగ్గా రాణించిన సిరాజ్‌.. ఆసీస్‌ సిరీస్‌కు ఎంపికయ్యాడు. సిరాజ్‌ ఇప్పటివరకు భారత్ తరఫున ఒక వన్డే, మూడు టీ20లు, మూడు టెస్టులు ఆడాడు. టెస్టుల్లో 13, టీ20ల్లో 3 వికెట్లు పడగొట్టాడు. వీవీఎస్‌ లక్ష్మణ్‌ తర్వాత హైదరాబాద్‌లో పుట్టి, టెస్టు జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న తొలి క్రికెటర్‌ మొహ్మద్ సిరాజే కావడం విశేషం.
    Published by:Sridhar Reddy
    First published: