Breaking News: క్రికెట్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఆ 8 మంది క్రికెటర్లకు నెగిటివ్ రిపోర్ట్..

8 మంది క్రికెటర్లకు నెగిటివ్ రిపోర్ట్

కోట్లాది క్రికెట్ అభిమానులకు గుగ్ న్యూస్.. టీడిమిండియాకు భారీ ఊరట లభించింది. కృనాల్ పాండ్యాతో అత్యంత సాన్నిహిత్యంగా ఉన్న 8 మంది క్రికెటర్లకు నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది..

  • Share this:
    క్రికెటర్లను.. భారత్ -శ్రీలంక అభిమానులను భయపెట్టిన కరోనా వైరస్ కాస్త రిలీఫ్ ఇచ్చింది. ఇప్పటికే కృనాల్ పాండ్యాకు కరోనా పాజిటివ్ రావడంతో మ్యాచ్ ఒకరోజు వాయిదా పడింది. అయితే అతడు మరో ఎనిమిది మంది క్రికెటర్లను కలవడంతో.. వారందరి పరిస్థితి ఏంటని అంతా ఆందోళన చెందారు. జట్టులో 8 మార్పులతో రెండో టీ20 భారత్ ఆడుతుందని ప్రచారం జరిగింది. ముఖ్యంగా ఇంగ్లండ్ టెస్ట్ టూర్ కు ఎంపికైన పృథ్వీషా, సూర్యకుమార్ లు ఛాన్స్ మిస్సావుతారని అంతా భావించారు. కానీ తాజాగా వారికి నిర్వహించిన పరీక్షల్లో అందరికీ నెగిటివ్ రిపోర్ట్ వచ్చినట్టు తెలుస్తోంది. పృథ్వీషా, సూర్యకుమార్ తో పాటు.. కృనాల్ పాండ్యాను కలిసిని 8 మంది క్రికెటర్లకు నెగిటివ్ రిపోర్ట్ వచ్చినట్టు సమాచారం. దీంతో బుధవారం మ్యాచ్ కు కృనాల్ పాండ్యా మినహా అంతా అందుబాటులో ఉండే అవకాశం ఉంది. అయితే టీ20 అంతర్జాతీయ అరంగేట్రం కోసం ఎదురు చూస్తున్న దేవ్‌దత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్ లు తుది జట్టులో ఉంటారనే ప్రచారం జరుగుతోంది. కరోనా కాకొరణంగా కృనాల్ పాండ్యా దూరం కావడంతో.. అతడి స్థానంలో పడిక్కల్, రుతురాజ్ ల్లో ఒకరికి తుది జట్టులో చోటు ఖాయమైనట్టే...

    అంతకుముందు మ్యాచ్ జరిగే కొద్ది సమయం ముందే కృనాల్ పాండ్యా కరోనా బారిన పడినట్టు తెలియడంతో మ్యాచ్ ను వాయిదా వేశారు. అయితే అంతకుముందే అతడితో 8 మంది క్రికెటర్లు చాలా దగ్గరగా ఉండడంతో వారి పరిస్థితి ఏంటన్నదానిపైనే అనుమానాలు నెలకొన్నాయి. అయినా జట్టులో మార్పులతో రెండో టీ20ని బుధవారం నిర్వహించాలని ఇరు దేశాల బోర్డులు అంగీకరించాయి. ఈ వార్త క్రికెటర్లతో పాటు అభిమానులను తీవ్ర కలవరపాటుకు గురి చేసింది. కానీ ప్రస్తుతం కృనాల్ పాండ్యా ను కలిసిన 8 మంది క్రికెటర్లకు నెగిటివ్ రిపోర్ట్ వచ్చిందని తెలియడంతో అంతా ఊపిరి పీల్చుకుంటున్నారు.. ఈ వార్తపై నెటిజన్లు సైతం హ్యాపీగా ఫీలవుతున్నారు. ఆ వార్త తెలిసిన వెంటనే హ్యీపీ అంటూ కామెంట్లు చేస్తున్నారు. http://



    ప్రస్తుతం కృనాల్ పాండ్యాను క్వారంటైన్‌కి తరలించిన అధికారులు, అతనితో సంబంధం ఉన్న 8మంది భారత క్రికెటర్లకు నెగిటివ్ రావడంతో వారిని మ్యాచ్ కు అనుమతించేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రెండో టీ 20 ఒకరోజు వాయిదా పడగా.. మూడో టీ20 అనుకున్న షెడ్యూల్ ప్రకారం జులై 29నే జరగనుంది. అయితే విరామం లేకుండా వరుస రోజుల్లో ఇరు జట్లు టీ20 ఆడాల్సి వస్తోంది. గతంలో లంక బ్యాటింగ్ కోచ్, సహాయక సిబ్బందికి కరోనా సోకడంతో జూలై 13న ప్రారంభం కావాల్సిన వన్డే సిరీస్‌, 18కి వాయిదాపడింది. ఇప్పుడు టీ20 ఒకరోజు ఆలస్యంగా జరుగుతోంది..

    మరోవైపు ఇప్పటికే వన్డే సీరీస్ ను 2-1 తేడాతో భారత జట్టు వన్డే సిరీస్ ను నెగ్గింది. టీ20 సిరీస్ లో ఇఫ్పటికే తొలి మ్యాచ్ లో బోణీ చేసింది. వరుసగా రెండో మ్యాచ్ లో నెగ్గి టీ20 సిరీస్ ను కూడా సొంతం చేసుకోవాలి అనుకుంటోంది.
    Published by:Nagesh Paina
    First published: