Home /News /sports /

BREAKDANCING GETS OLYMPIC STATUS TO DEBUT AT PARIS IN 2024 NK

Breakdancing: ఒలింపిక్స్‌లో ఇక బ్రేక్‌డాన్సింగ్... టాలెంటీర్స్ దుమ్మురేపండి

Breakdancing: ఒలింపిక్స్‌లో ఇక బ్రేక్‌డాన్సింగ్... టాలెంటీర్స్ దుమ్మురేపండి (image credit - twitter - reuters sports)

Breakdancing: ఒలింపిక్స్‌లో ఇక బ్రేక్‌డాన్సింగ్... టాలెంటీర్స్ దుమ్మురేపండి (image credit - twitter - reuters sports)

Breakdancing gets Olympic status: డాన్స్ అంటే ఇష్టపడని వారు చాలా తక్కువ. ఎవరైనా డాన్స్ వేస్తుంటే... మన చేతులు, కాళ్లు కూడా కదులుతాయి. మరి డాన్స్‌ ఎలా ఒలింపిక్స్‌లోకి వెళ్తోందో తెలుసుకుందాం.

    Breakdancing gets Olympic status: ఈ సోమవారం బ్రేక్ డాన్స్‌ చరిత్రలో ఓ సువర్ణ అధ్యాయం అనుకోవచ్చు. ఎందుకంటే... ఒలింపిక్ గేమ్స్‌లో బ్రేక్‌డాన్స్‌ కూడా అధికారికంగా చేరింది. అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ (IOC)... రెగ్యులర్ ఆలోచనలకు కాస్త భిన్నంగా ఆలోచించింది. ప్రపంచవ్యాప్తంగా డాన్స్‌కి ఉన్న గుర్తింపు, యూత్‌లో ఉన్న క్రేజ్ అన్నీ గమనించింది. స్ట్రీట్ డాన్సుల్లో యువతీ, యువకులు ఎంత ఉత్సాహంగా పాల్గొంటున్నారో, ఎలా తమ టాలెంట్‌తో ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తున్నారో... అన్నీ గమనించింది ఆ కమిటీ. అందుకే... కోట్లమంది అభిమానాన్ని, ఆదరణనూ పొందుతున్న బ్రేక్ డాన్సింగ్‌కి అఫీషియల్ స్పోర్ట్ గుర్తింపు ఇస్తూ... 224లో ప్యారిస్‌లో జరగబోయే మెడల్ ఈవెంట్స్‌లో చేర్చింది. 2020 కొన్ని రోజుల్లో ముగిసిపోతుంది. ఆ తర్వాత మరో 3 ఏళ్ల లోపే ప్యారిస్ ఒలింపిక్స్ ఉంటాయి. అప్పటి లోగా టాలెంటీర్లు బాగా ప్రిపేర్ అయ్యి... గోల్డ్ మెడల్ కొట్టొచ్చు.


    2024లో జరిగే ఈవెంట్‌లో స్కేట్ బోర్డింగ్, స్పోర్ట్ క్లైంబింగ్, సర్ఫింగ్ కూడా ఉండనున్నట్లు IOC తెలిపింది. ఐతే... ఈ మూడూ... జపాన్ రాజధాని టోక్యోలో జరిగే ఒలింపిక్స్‌ నుంచే ప్రారంభమవుతాయి. నిజానికి ఈ ఒలింపిక్స్ ఈ సంవత్సరం జరగాల్సి ఉన్నా... కరోనా వల్ల... 2021 జులై 23కి వాయిదాపడ్డాయి. ప్యారిస్ ఒలింపిక్ నిర్వాహకులు... 2024లో ఏయే స్పోర్ట్స్ ఉంటాయో ఇప్పుడే చెప్పమని కోరారు. తద్వారా తాము అందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుందని అన్నారు. దాంతో... 2021తోపాటూ... 2024లో ఉండబోయే కొత్త ఆటల గురించి ఐఓసీ ఇప్పుడే చెప్పేసింది.


    బ్రేక్ డాన్సింగ్‌ని ఒలింపిక్స్‌లో బ్రేకింగ్ అని పిలవబోతున్నారు. అలా ఎందుకు అంటే... 1970లో ఇది తొలిసారి మొదలైనప్పుడు అమెరికాలో దీన్ని హిప్-హాప్ అనేవారు. ఇప్పుడు హిప్-హాప్ అంటే యూత్‌కి ట్రెండీగా ఉండదన్న ఉద్దేశంతో.. బ్రేకింగ్ అని పిలవాలని డిసైడయ్యారు. ఏ పేరైతేనేం... దుమ్మురేపడమేగా కావాల్సింది.

    నిజానికి కరోనాకి మందే... 2 ఏళ్ల కిందటే... బ్రేక్ డాన్సును ఒలింపిక్స్‌లో చేర్చాలని ప్యారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు ప్రతిపాదించారు. 2018లో బ్యూనస్ ఎయిర్స్‌లో జరిగిన యూత్ ఒలింపిక్స్‌లో బ్రేక్ డాన్స్‌కి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఐతే... 2019లో ఈ ఆటను పెడదామా వద్దా అనే అంశం చర్చకు వచ్చినప్పుడు IOC పెద్దలు కూడా పాజిటివ్‌గా స్పందించారు. ప్యారిస్‌లో డె లె కాంకార్డ్ దగ్గర... క్లైంబింగ్, బాస్కెట్‌బాల్‌తోపాటూ... ప్రెస్టీజ్ డౌన్‌టౌన్ వెన్యూలో ఈ బ్రేకింగ్ ఉండబోతోంది.

    ఇది కూడా చదవండి:Aliens: గ్రహాంతరవాసులతో అమెరికా, ఇజ్రాయెల్‌కు సంబంధాలు?... సంచలన రిపోర్ట్

    సర్ఫింగ్ మాత్రం ఫ్రాన్స్‌కి 15,000 కిలోమీటర్ల దూరంలో... పసిఫిక్ మహా సముద్రంలో ఉండనుంది. తాహితీ బీచ్ దగ్గర దీన్ని నిర్వహించనున్నారు. ఈ ప్లేస్‌ని మార్చిలో ఓకే చేసింది IOC. ఎందుకంటే... అక్కడ సర్ఫింగ్ చేయడానికి వీలయ్యేలా కాస్త పెద్ద అలలు వస్తాయట.
    Published by:Krishna Kumar N
    First published:

    Tags: IOC, Olympics

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు