ప్రఖ్యాత ఫుట్‌బాల్ ప్లేయర్ పీలే(Pele)కన్నుమూశారు. ప్రాణాంతక క్యాన్సర్ (Cancer)వ్యాధితో బాధపడుతున్న లెజండరీ ప్లేయర్ మృత్యువుతో పోరాడి తుది శ్వాస విడిచారు. 82సంవత్సరాల ఛాంపియన్ ఇకలేరన్న వార్తను ఆయన కుమార్తె స్వయంగా ఇన్‌స్టాగ్రామ్(Instagram)ద్వారా క్రీడాభిమానులకు తెలియజేశారు. పెద్ద పేగు క్యాన్సర్‌తో చాలా రోజులుగా ఆసుపత్రిలో ట్రీట్‌మెంట్ పొందుతున్న పీలే శుక్రవారం(Friday)డిసెంబర్( December)30వ తేదిన మృతి చెందారు. పీలే మరణం ఫుట్‌బాల్ క్రీడకు తీరని లోటని క్రీడాభిమానులు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి ఫుట్‌బాల్ ప్రేమికులు సోషల్ మీడియా(Social media) వేదికగా నివాళులర్పిస్తున్నారు. తాజాగా ఫీఫా వరల్డ్ కప్‌లో బ్రెజిల్ ఫైనల్‌ల ఓటమి పాలైనప్పటికి మ్యాచ్‌ని చిరస్మరణీయం చేసిన ఫ్రెంచ్ ఫుట్‌బాల్ ప్లేయర్ కైలియన్ ఎంబాస్పే ట్వీట్ చేసి పీలేకు నివాళులర్పించారు.
లెజండరీ ప్లేయర్ మృతి..
ఫుట్‌బాల్ చరిత్రలో పీలే పేరు చిరస్థాయిగా గుర్తుండిపోతుంది. బ్రెజిల్ తరపును 1958,1962,1970 టోర్నీలో పీలే నేతృత్వంలోనే బ్రెజిల్ ప్రపంచ కప్‌ను గెలుచుకుంది. దిగ్గజ ఫుట్‌బాల్ ప్లేయర్ మొత్తం నాలుగు ప్రపంచ ఫుట్‌బాల్ పోటీల్లో పాల్గొనగా అందులో మూడు గెలిచారు. మూడు ఫుట్‌బాల్ ప్రపంచ కప్‌లు గెలిచిన ఆటగాడిగా పీలే క్రీడారంగంలో తన పేరును సుస్థిరం చేసుకున్నారు. 1971లో పీలే బ్రెజిల్ జాతీయ జట్టు నుంచి రిటైర్ అయ్యారు.
View this post on Instagram
దిగ్గజ ఫుట్‌బాల్ ప్లేయర్ ఇకలేరు..
లెజండరీ ఫుట్‌బాల్ ప్లేయర్ పీలే కెరియర్ మొత్తంలో 1363 మ్యాచ్‌లు ఆడారు. 1281గోల్ఫ్‌లు చేశాడు. బ్రెజిల్ తరపున ఆడిన 91మ్యాచ్‌లలో 77గోల్ఫ్‌లు చేశాడు. మైదానంలో ఫుట్‌బాల్ కంటే వేగంగా పరుగులు పెట్టిన దిగ్గజ ఆటగాడి రికార్డులు తలుచుకొని అభిమానులు హర్షిస్తున్నారు.
సరిలేరు పీలేకు ఎవ్వరూ..
1999లో ఇంటర్‌నేషనల్ ఒలింపిక్ కమిటీలో పీలే శతాబ్ధపు అథ్లెట్‌గా ఎంపికయ్యారు.1363మ్యాచ్‌లో 1279 గోల్ప్‌లు చేసి రికార్డు నెలకోల్పారు. ఫుట్‌బాల్ ప్రపంచంలో మూడు వరల్డ్ కప్‌లు గెలిచిన ఏకైక ఆటగాడిగా తన పేరును సార్ధకం చేసుకున్నారు. పీలే మరణం ఫుట్‌బాల్ ప్రేమికుల్ని తీవ్రంగా బాధిస్తోంది. సోషల్ మీడియా వేదికగా ట్వీట్‌లు చేస్తున్నారు. లెజండరీ ప్లేయర్‌కు నివాళులర్పిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Foot ball, International news, Sports