హోమ్ /వార్తలు /క్రీడలు /

Copa America: దుమ్మురేపిన అర్జెంటినా... బ్రెజిల్‌కు షాక్... మరోసారి అద్భుత విజయం

Copa America: దుమ్మురేపిన అర్జెంటినా... బ్రెజిల్‌కు షాక్... మరోసారి అద్భుత విజయం

దుమ్మురేపిన అర్జెంటినా (image credit - twitter)

దుమ్మురేపిన అర్జెంటినా (image credit - twitter)

Copa America: ప్రపంచమంతా ఎదురుచూసిన... కోపా అమెరికా కప్ ఫైనల్ మ్యాచ్ మంచి కిక్ ఇచ్చింది. ఎవరు గోల్ సాధిస్తారా అని ఎదురుచూసిన ఫ్యాన్స్‌కు అర్జెంటినా గోల్ సాధించి... చిరస్మరణీయమైన విజయాన్ని సొంతం చేసుకుంది.

Brazil vs Argentina: బ్రెజిల్‌లోని... రియో డీ జనీరోలో జరిగిన కోపా అమెరికా కప్ ఫైనల్ మ్యాచ్ అత్యంత ఉత్కంఠ కలిగించింది. ఈ మ్యాచ్‌లో అర్జెంటినా అద్భుత ఆటతీరుతో బ్రెజిల్‌ ఆశలపై నీళ్లు చల్లింది. రెండు టీమ్‌లలో ఎవరైనా గోల్ చేస్తారా... చెయ్యరా... అని అభిమానులు ఆశగా ఎదురుచూస్తూ... అత్యంత టెన్షన్ పడుతున్న సమయంలో.... అర్జెంటినా మెరుపు వేగంతో... గోల్ చేసింది. దాంతో... ఈ మ్యాచ్‌లో అర్జెంటినా 1-0 గోల్ తేడాతో బ్రెజిల్‌ను ఓడించి... టైటిల్ దక్కించుకుంది.

ఏంజెల్ డీ మారియా సాధించిన చిరస్మరణీయమైన గోల్... అర్జెంటీనాను విజయతీరాలకు పంపింది. అందువల్ల 15వ కోపా టైటిల్‌ అర్జెంటినా సొంతమైంది. 28 ఏళ్లుగా ఈ టైటిల్ కోసం ఆ దేశ జట్టు ఎదురుచూస్తోంది. ప్రతిసారీ అవకాశం చేజారిపోతూనే ఉంది. ఇప్పుడు కూడా మెరుపు గోల్ వల్లే ఇది సాధ్యమైంది.

ఓ మేజర్ టోర్నీ టైటిల్ అందించాడు మెస్సీ. ఇదే మెస్సీకి మొదటి కోపా టైటిల్. అంతేగాదు... మెస్సీ కెరీర్‌లోనే ఇదే మొదటి ఇంటర్నేషనల్ టైటిల్ కూడా. ఆ దేశానికి చెందిన తిరుగులేని దిగ్గజ ప్లేయర్ మారడోనా సారధ్యంలో కూడా అర్జెంటినా కోపా టైటిల్ ఏనాడూ గెలవలేకపోయింది. 1937లో అర్జెంటినా మొదటిసారి కోపా కప్ గెలిచింది. మళ్లీ ఇప్పుడు అది మరోసారి సాధించింది.

First published:

Tags: Breaking news, Sports