Choose Municipal Ward
    CLICK HERE FOR DETAILED RESULTS

    బాయ్‌కాట్ సాధ్యమా... సింధుకు చైనా కంపెనీ ఎంత స్పాన్సర్ చెస్తుందో తెలుసా!

    Rekulapally Saichand
    Updated: June 26, 2020, 1:36 PM IST
    బాయ్‌కాట్ సాధ్యమా... సింధుకు చైనా కంపెనీ ఎంత స్పాన్సర్ చెస్తుందో తెలుసా!
    పీవీ సింధు, విరాట్ కొహ్లీ
    • Share this:
    చైనా,భారత్ మధ్య సరిహద్దు వివాదం నెలకొన్న నేపథ్యంలో ఆ ప్రభావం చైనా ఉత్పత్తి చేస్తున్న బ్రాండ్స్‌పై పడింది. ఇండియాలో జరిగే మేగా ఇవెంట్స్‌ అన్నింటికి ఆ దేశానికి సంబంధించిన బ్రాండ్స్ స్పాన్సర్‌షిప్‌ చేస్తున్నాయి. అయితే చైనా కంపెనీల భాగ‌స్వామ్యానికి పలు సంస్ధలు ముగింపు పలకాలని భావిస్తున్నాయి. ముఖ్యంగా ఐపీఎల్‌కు స్పాన్సర్‌షిప్‌ చేస్తున్న ‘వివో’ ఒప్పందాన్ని సమీక్షించాలని బీసీసీఐ నిర్ణయించింది. దీని కోసం ప్రత్యేక సమావేశానికి సిద్ధమైంది. వివో ఐపీఎల్‌కు అక్షరాలా రూ. 2,199 కోట్లు స్పాన్సర్‌షిప్‌ చెస్తోంది. బీసీసీఐ బాటలోనే భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ) కూడా నడవాలని నిర్ణయం తీసుకుంది. వెయిట్‌ లిఫ్టింగ్‌ సమాఖ్య ఇప్పటికే చైనా ఎక్విప్‌మెంట్‌ను బ్యాన్ చేసినట్లు ప్రకటించింది.

    అయితే ఇలాంటి నిర్ణయాలు ఆచరణ సాధ్యమైనా అంటే నిపుణులు మాత్రం అంతా సులువు కాదు అంటున్నారు. బ్యాడ్మింటన్, టెన్నిస్, ఫిట్‌నెస్‌ అథ్లెటిక్స్, టేబుల్‌ టెన్నిస్, జిమ్నాస్టిక్స్.ఇతర క్రీడాలకు కావాల్సిన సుమారు రూ. 919 కోట్ల క్రీడా సామాగ్రి చైనా నుంచి దిగుమతి అవుతున్నాయి. దాదాపు 80 శాతం క్రీడా పరికరాలు డ్రాగన్ దేశం నుంచే వస్తున్నాయి. అలాగే భారతీయ క్రీడాకారులకు కూడా చైనాకు చెందిన కంసెనీలు స్పాన్సర్‌ చేస్తున్నాయి. బ్యాడ్మింటన్‌ ప్లేయర్లులైన పీవీ సింధుకు నాలుగేళ్లకు రూ. 48 కోట్లు, కిడాంబి శ్రీకాంత్‌తో రూ. 35 కోట్ల ఒప్పందాలు కుదుర్చుకుంది చైనా చెందిన లీ–నింగ్‌ సంస్ధ. భారత క్రీడా రంగంతో చైనా బ్రాండ్స్‌కు ముడిపడిపోయిన బంధాన్ని రద్దు చేసుకోవడం సాధ్యం కాని పని క్రీడా ప్రముఖులు భావిస్తున్నారు.

    కేంద్రం అధికారికంగా నిషేధం విధించకుండా క్రీడా సంస్ధలు బాయ్‌కాట్‌’కు సాహసించడం అసలు సాధ్యమేనా... వారు స్పాన్సర్‌షిప్‌ లేకుండా
    ఆ సంస్ధల మనగడ కొనసాగిస్తాయా.. అందరిలో నెలకొన్న ప్రశ్న.
    First published: June 26, 2020, 1:36 PM IST
    మరిన్ని చదవండి
    తదుపరి వార్తలు

    Top Stories

    corona virus btn
    corona virus btn
    Loading