• HOME
  • »
  • NEWS
  • »
  • SPORTS
  • »
  • BOXING WORLD CUP AMIT PANGHAL WINS GOLD IN 52 KG CATEGORY AND SIMRANJEET AND MANISHA WON GOLD SRD

Boxing World cup : బాక్సింగ్ ప్రపంచకప్ లో భారత్ హవా..ఖాతాలో ఎన్ని పతకాలంటే..

Boxing World cup : బాక్సింగ్ ప్రపంచకప్ లో భారత్ హవా..ఖాతాలో ఎన్ని పతకాలంటే..

Indian Boxers (photo credit : twitter)

Boxing World cup : జర్మనీలోని కొలోన్‌లో జరుగుతున్న బాక్సింగ్ ప్రపంచ కప్‌లో భారత హవా కొనసాగుతుంది. భారత బాక్సర్లు సిమ్రన్‌జిత్ కౌర్, మనీషా బంగారు పతకాలు కైవసం చేసుకున్నారు. వీరి పతకాలతో మెడల్ ట్యాలీలో భారత్ దూసుకుపోతోంది.

  • Share this:
    జర్మనీలోని కొలోన్‌లో జరుగుతున్న బాక్సింగ్ ప్రపంచ కప్‌లో భారత హవా కొనసాగుతుంది. భారత బాక్సర్లు సిమ్రన్‌జిత్ కౌర్, మనీషా బంగారు పతకాలు కైవసం చేసుకున్నారు. వీరి పతకాలతో మెడల్ ట్యాలీలో భారత్ దూసుకుపోతోంది. ఈ టోర్నమెంట్‌లో ఇప్పటివరకు భారత్ 9 పతకాలు సాధించింది. ఆదివారం జరిగిన మహిళల 57 కేజీల ఫైనల్లో మనీషా 3-2తో మన దేశానికే చెందిన సాక్షిని ఓడించింది. సిమ్రన్‌జిత్ కౌర్ 4–1తో జర్మనీకి చెందిన మాయ కాలిన్‌హాన్స్‌పై విజయం సాధించి బంగారు పతకాన్ని ఒడిసిపట్టుకున్నది. మూడు బంగారు, రెండు రజిత, నాలుగు కాంస్య పతకాలతో మొత్తం 9 పతకాలు సాధించిన భారత్.. టోర్నమెంట్‌లో రెండవ స్థానంలో నిలిచింది. ఫైనల్స్‌లో వాకోవర్‌ లభించడంతో తొలి బంగారు పతకాన్ని అమిత్ పంగల్ సొంతమైంది.

    పురుషుల 91 కిలోల విభాగంలో సతీష్ కుమార్ రజత పతకాన్ని అందుకున్నాడు. గాయం కారణంగా అతను ఫైనల్లో రాణించలేకపోయాడు. సెమీస్‌లో ఫ్రాన్స్‌కు చెందిన జామిల్లె డిని మొయిజేను ఓడించి సతీష్ శుక్రవారం ఫైనల్‌కు చేరుకున్నాడు. ఫైనల్‌లో జర్మనీకి చెందిన నెల్వి టైఫాక్‌తో తలపడ్డాడు. అయితే, గాయం కారణంగా, అతను వాక్‌ఓవర్ ఇవ్వాల్సి వచ్చింది.

    మహిళల 57 కిలోల విభాగంలో సోనియా లాథర్, 75 కిలోల విభాగంలో పూజా రాణితోపాటు గౌరవ్ సోలంకి, మహ్మద్ హసముద్దీన్ కాంస్య పతకాలు గెలుచుకున్నారు. ఈ టోర్నమెంట్‌లో జర్మనీతో పాటు బెల్జియం, క్రొయేషియా, బెల్జియం, డెన్మార్క్, ఫ్రాన్స్, నెదర్లాండ్స్, మోల్డోవా, పోలాండ్, ఉక్రెయిన్‌ దేశాల ఆటగాళ్లు పాల్గొన్నారు.
    Published by:Sridhar Reddy
    First published: