Cricket Viral Catch : క్రికెట్ (Cricket) లో అప్పుడుప్పుడు నేరుగా చేతుల్లోకి వచ్చే అత్యంత సులభమైన క్యాచ్ లను కూడా వదిలేస్తుంటారు. అదే సమయంలో బౌండరీ లైన్ దగ్గర అసాధ్యం అనుకున్న క్యాచ్ ను అత్యంత చాకచక్యంగా అందుకుని ఫ్యాన్స్ చేత శభాష్ అనిపించుకుంటారు. అయితే తాజాగా క్రికెట్ చరిత్రలో మన ఊహకైనా అందనటువంటి క్యాచ్ ను ఓ ప్లేయర్ అందుకున్నాడు. విలేజ్ లీగ్ గేమ్‌లో భాగంగా.. ఆల్డ్ విక్ క్రికెట్ క్లబ్, లింగ్ ఫీల్డ్ క్రికెట్ క్లబ్ మధ్య మ్యాచ్ జరిగింది. లింగ్ ఫీల్డ్ క్రికెట్ క్లబ్ బ్యాటింగ్ సమయంలో 16 ఏళ్ల అలెక్స్ రైడర్ బౌలింగ్‌కు వచ్చాడు. అతడు వేసిన బంతిన భారీ షాట్ ఆడేందుకు బ్యాటర్ ప్రయత్నించాడు. అయితే బ్యాట్ ఎడ్జ్ కు తగిలిన బంతి అమాంతం గాల్లోకి లేచింది.
ఇది కూడా చదవండి : కీలక పోరులో స్టార్ పేసర్ అవుట్.. డూ ఆర్ డై మ్యాచ్ లో భారత తుది జట్టు ఇదే..
అయితే బంతి బౌలర్ నెత్తిపైనే గాల్లోకి లేవడంతో కాట్ అండ్ బౌల్ ఖాయం అని అంతా అనుకున్నారు. అలెక్స్ ఈజీగా క్యాచ్ ను అందుకుంటాడని అంతా అనుకన్నారు. అయితే బంతి అలెక్స్ చేతిలో పడి బౌన్స్ కాగా.. అలెక్స్ నేల మీద కిందపడ్డాడు. దాంతో క్యాచ్ డ్రాప్ అని అంతా అనుకున్నారు. అయితే ఇక్కడే ఊహించని ట్విస్ట్ జరిగింది
View this post on Instagram
The greatest dropped catch ever!? ????
Brilliant clip from @AldwickCC's stump cam! pic.twitter.com/Cpmd80QdGP
— That’s so Village (@ThatsSoVillage) June 16, 2022
క్యాచ్ అందుకునే క్రమంలో అప్పటికే కింద పడిపోయిన రైడర్ తన కాలును పైకి లేపడం.. అదే సమయంలో బంతి అతని కాలుపై పడి మళ్లీ గాల్లోకి బౌన్స్ అవడం చకచకా జరిగిపోయాయి. అయితే అలెక్స్ ఈసారి ఎటువంటి తప్పు చేయకుండా క్యాచ్ అందుకున్నాడు. లెక్స్ క్యాచ్ అందుకోవడాన్ని సహచర ప్లేయర్లతో పాటు ప్రత్యర్థి బ్యాటర్లు కూడా నోరెళ్లబెట్టి చూడడం విశేషం. ఫైనల్ గా అలెక్స్ క్యాచ్ అందుకోవడం.. బ్యాటర్ పెవిలియన్ చేరడం జరిగిపోయింది. దీనికి సంబంధించిందంతా స్టంప్ కెమెరాలో రికార్డవ్వడం మరో విశేషం.
First of All its no ball pic.twitter.com/iQJSrnE04n
— Badar Bajwa (@BadarBajwa786) June 16, 2022
తాజాగా ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యింది. మరికొంత మంది అయితే అది నోబాల్ అంటూ కామెంట్స్ కూడా చేస్తున్నారు. దానికి సంబంధించిన ఫోటోను కూడా షేర్ చేస్తున్నారు. సిల్లీ క్రికెట్ అంటూ వారు పేర్కొనడం విశేషం
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cricket, Hardik Pandya, India vs South Africa, South Africa, Team India, Viral, VIRAL NEWS