హోమ్ /వార్తలు /క్రీడలు /

విజేతను నిర్ణయించేది ఇలానా..? దుమారం రేపుతున్న వరల్డ్‌కప్ ఫైనల్ వివాదం..

విజేతను నిర్ణయించేది ఇలానా..? దుమారం రేపుతున్న వరల్డ్‌కప్ ఫైనల్ వివాదం..

వరల్డ్‌కప్ చేజారిన బాధలో న్యూజిలాండ్ టీమ్ సభ్యులు

వరల్డ్‌కప్ చేజారిన బాధలో న్యూజిలాండ్ టీమ్ సభ్యులు

ICC WorldCup Final : బౌండరీల ఆధారంగా విజేతను ప్రకటించడం కాకుండా.. ఇంగ్లాండ్-న్యూజిలాండ్‌లను సంయుక్త విజేతలుగా ప్రకటించి ఉంటే హుందాగా ఉండేదని మరికొంతమంది నెటిజెన్స్ అభిప్రాయపడుతున్నారు.

ఇంగ్లాండ్-న్యూజిలాండ్ మధ్య నరాలు తెగే ఉత్కంఠను తలపించిన మ్యాచ్‌లో చివరకు ఇంగ్లీష్ జట్టు విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే బౌండరీల ఆధారంగా విజేతను నిర్ణయించడంపై చాలామంది పెదవి విరుస్తున్నారు. బౌండరీలకు బదులు వికెట్లను కౌంట్ చేసి ఉండాల్సింది కదా

అని ప్రశ్నిస్తున్నారు. వికెట్లను కౌంట్ చేస్తే గనుక.. ఇంగ్లాండ్ 241-ఆలౌట్, న్యూజిలాండ్ 241-8 పరుగులను పరిగణలోకి తీసుకోవాల్సి వచ్చేది. ఆ లెక్కన ఎక్కువ వికెట్లు తీసిన న్యూజిలాండ్‌ను విన్నర్‌గా ప్రకటించాల్సి ఉండేది. కానీ బౌండరీ కౌంట్‌ను పరిగణలోకి తీసుకోవడంతో ఇంగ్లాండ్ జట్టు గెలిచింది. అయితే ఏ ప్రాతిపదికన బౌండరీ కౌంట్‌తో విజేతను నిర్ణయించారంటూ మాజీ క్రికెటర్లు సైతం ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఇక ఇది బ్యాట్స్‌మెన్ గేమ్ కాకపోతే మరేంటి? అని నిలదీస్తున్నారు. ఇంత పక్షపాతంగా కేవలం బౌండరీల ఆధారంగా విజేతను నిర్ణయించడం సరికాదని చాలామంది నెటిజెన్స్ కామెంట్ చేస్తున్నారు. ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ బ్రెట్‌లీ కూడా ఇదే అభిప్రాయాన్ని వెల్లడించాడు. విజేతను నిర్ణయించడానికి ఇలాంటి పద్దతిని ఎంచుకోవడం చాలా దారుణమని ట్విట్టర్ వేదికగా అతను అభిప్రాయపడ్డాడు.ఇప్పటికైనా ఈ పద్దతిని మార్చాల్సిన అవసరం ఉందని అన్నాడు.

బౌండరీల ఆధారంగా విజేతను ప్రకటించడం కాకుండా.. ఇంగ్లాండ్-న్యూజిలాండ్‌లను సంయుక్త విజేతలుగా ప్రకటించి ఉంటే హుందాగా ఉండేదని మరికొంతమంది నెటిజెన్స్ అభిప్రాయపడుతున్నారు. కేవలం బౌండరీలు ఎక్కువగా బాదారన్న కారణంగా 'ప్రపంచకప్' అందించడం ఎంత సిల్లీ అని అంటున్నారు. మొత్తం వరల్డ్ కప్ ఫైనల్ ఎంత ఉత్కంఠను రేపిందో.. బౌండరీ కౌంట్ నిర్ణయం అంత వివాదాన్ని రేపుతోంది. చూడాలి మరి.. ఐసీసీ ఈ నిర్ణయాన్ని ఎలా సమర్థించుకుంటుందో..!

First published:

Tags: England, England vs newzealand, ICC Cricket World Cup 2019, Newzealand, World cup final winner

ఉత్తమ కథలు