స్టోక్స్ బ్యాట్‌కు ఆ బంతికి తగలకపోయి ఉండి ఉంటే!

తొలిత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. 50 ఓవర్లలో 241/8 రన్స్ సాధించింది. స్కోర్ చూడడానికి తక్కువగా ఉన్న ఛేదనలోకి దిగిన ఇంగ్లాండ్ బ్యాటింగ్ అంత సాఫీగా సాగలేదు. కివీస్ బౌలర్లు చేలరేగడంతో ఇంగ్లీష్ బ్యాట్‌మెన్స్ నిలవలేకపోయారు.

Rekulapally Saichand
Updated: July 14, 2020, 4:52 PM IST
స్టోక్స్ బ్యాట్‌కు ఆ బంతికి తగలకపోయి ఉండి ఉంటే!
Ben Stokes
  • Share this:


ప్రపంచ కప్ గెలవాలన్నా ఇంగ్లాండ్ నాలుగు దశాబ్ధాల కల నేరవేర్చుకుంది ఈ రోజే. లార్డ్స్‌ మైదానంలో పైనల్లో న్యూజిలాండ్‌తో తలపడిన ఇంగ్లాండ్ జట్టు అనూహ్య రీతిలో విజేతగా నిలిచింది. ఉత్కంఠ భరితంగా జరిగిన పైనల్లో తొలిసారి విశ్వవిజేతగా అవతరించింది అతిథ్య జట్టు. మ్యాచ్ టై అవ్వడంతో సూపర్‌ ఓవర్‌కు దారి తీసింది. చివరికి ఆ ఓవర్‌లో కూడా స్కోర్లు సమమయ్యాయి. దీంతో బౌండరీల సంఖ్య ఆధారంగా ఇంగ్లాండ్‌ను విజేతగా ప్రకటించారు. ఆ మ్యాచ్‌కు నేటితో ఏడాది.

కివీస్ స్వల్ప స్కోర్

తొలిత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. 50 ఓవర్లలో 241/8 రన్స్ సాధించింది. స్కోర్ చూడడానికి తక్కువగా ఉన్న ఛేదనలోకి దిగిన ఇంగ్లాండ్ బ్యాటింగ్ అంత సాఫీగా సాగలేదు. కివీస్ బౌలర్లు చేలరేగడంతో ఇంగ్లీష్ బ్యాట్‌మెన్స్ నిలవలేకపోయారు. చివరలో బెన్‌స్ట్రోక్స్ పోరాటం అందర్నీ టీవీలకు కట్టిపడేలా చేసింది. మూడో బంతికి వచ్చిన అదనపు పరుగులు ఇంగ్లాండ్‌ను ఓటమి నుంచి బయటపడేసింది. డీన్ మిడ్ మీదిగా షాట్ ఆడి ఒక్క పరుగు తీసిన స్ట్రోక్ వేగంగా రెండో పరుగు తీసే క్రమంలో ఫీల్డర్ త్రో విసిరిన బంతి అతను బ్యాట్ తగిలి బౌండరీ లైన్ దాటింది. ఇదే ఇంగ్లాండ్ స్కోర్ సమమం చేయడానికి తోర్పడింది. ఆ అదనపు పరుగులే మ్యాచ్ సూపర్‌ కావడానికి దారి తీసింది.

టైగా సూపర్ ఓవర్

మెుదటిగా బ్యాటింగ్ దిగిన ఇంగ్లాండ్, న్యూజిలాండ్‌కు 15 పరుగుల టార్గెట్‌ను ఇచ్చింది. అనంతరం ఛేదినకు దిగిన కివీస్ కూడా 15 పరుగులే చేయడంతో సూపర్ ఓవర్ కూడా సమంగానే ముగిసింది. దీంతో బౌండరీల అధారంగా ఇంగ్లాండ్‌ను విజేతగా నిలిచింది.
Published by: Rekulapally Saichand
First published: July 14, 2020, 4:52 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading