news18-telugu
Updated: November 24, 2020, 2:07 PM IST
Indian skipper
ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కు మెుదలవకముందే టీమిండియాకు భారీ షాక్ తగులుతున్నాయి. రోహిత్ శర్మ, ఇషాంత్ శర్మ ఆసీస్ పర్యటనకు వస్తారా?..లేదా..? అనేది అనుమానంగా మారింది. డిసెంబర్ 19 నుంచి వచ్చే ఏడాది జనవరి 19 వరకు జరిగే జరిగే బోర్డర్ గావస్కర్ ట్రోఫీ జరగనుంది. ఈ సిరీస్‌కు రోహిత్, ఇషాంత్ శర్మ ఆడడంపై అనుమానలు ఉన్నాయి. ప్రస్తుతం వీరిద్దరూ బెంగళూరులోని ఎన్సీఏలో ఫిట్నెస్ ట్రైనింగ్ పొందుతున్నారు. అక్కడ వీరు ఫిట్నెస్ సాధిస్తేనే సెలక్టర్లు ఆసీస్ టూర్‌కు పంపిస్తారు.
అయితే ఇప్పటివరకు రోహిత్,ఇషాంత్ శర్మల నుంచి ఆశించిన స్థాయిలో ఫిట్నెస్ సాధించకపోవడంపై బోర్డును కొంత ఆందోళనకు గురిచేస్తుంది. పరిస్థితి ఇలానే ఉంటే రోహిత్, ఇషాంత్ టెస్టు సిరీస్ ఆడే అవకాశం ఉండదు. ఇటివలే సమావేశమైన ఎన్సీఏలో నిపుణులు వీరిద్దరి ఫీట్నెస్ రిపోర్ట్‌పై ఆసంతృప్తిని వ్యక్తం చేశారు. దాదాపు వీరు ఆస్ట్రేలియాతో జరిగే టెస్టు సిరీస్‌లో బరిలో దిగే అవకాశాలు లేవని చెప్పాలి. త్వరలోనే ఈ విషయమై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
ఆస్ట్రేలియాతో నవంబరు 27 నుంచి మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టులను భారత జట్టు ఆడనుంది. ఇక రెండు నెలలపాటు ఈ సుదీర్ఘ పర్యటన కొనసాగునుంది. తొలి టెస్టు అడిలైడ్‌లో డిసెంబర్ 17 నుంచి 21 వరకు జరగుతుంది. ఈ టెస్ట్ తర్వాత కోహ్లి భారత్‌కు తిరిగి వస్తాడు. ఇక ఈ పర్యటన విషయానికి వస్తే మూడు వన్డే మ్యాచ్‌లు,మూడు టి20 మ్యాచ్‌లు,ఐదు టెస్టు మ్యాచ్‌లు జరగనున్నాయి. వీటిలో కోహ్లి సిడ్నీ (జనవరి 7 నుంచి 11), బ్రిస్బేన్ (15 నుంచి 19)లలో జరిగే మూడో, నాలుగో టెస్టులకు దూరంమవుతాడు.
ఆస్ట్రేలియా పర్యటన మధ్యలోనే కెప్టెన్ విరాట్ కోహ్లి ఇండియాకు తిరిగి రానున్నారు. ఆసీస్‌తో తొలి టెస్ట్ ముగిశాక అతను స్వదేశానికి పయనమవుతాడు. విరాట్ సతిమణి అనుష్క శర్మ ప్రస్తుతం గర్భవతి. ఆమెకు జనవరిలో డెలివరీ టైం ఉంది.ఈ సమయంలో అనుష్క పక్కనే ఉండాలని భావించిన కోహ్లి ఆసీస్ పర్యటన మధ్యలోనే ఇండియాకు తిరిగి రానున్నారు. ఈ కోహ్లి నిర్ణయంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కూడా అంగీకారం తెలిపింది. స్వదేశానికి తిరిగి వచ్చేందుకు కోహ్లికి అనుమతి ఇచ్చింది.
Published by:
Rekulapally Saichand
First published:
November 24, 2020, 2:07 PM IST