• HOME
  • »
  • NEWS
  • »
  • SPORTS
  • »
  • BOLLYWOOD KANGANA RANAUT COMMENT ROHIT SHARMA STANCE ON FARMERS PROTEST LATER TWITTER TAKES DOWN SRD

Rohit - Kangana : క్రికెటర్లు కుక్కల్లా మొరుగుతున్నారు..రోహిత్ శర్మ ట్వీట్ పై కంగనా కామెంట్

Rohit - Kangana : క్రికెటర్లు కుక్కల్లా మొరుగుతున్నారు..రోహిత్ శర్మ ట్వీట్ పై కంగనా కామెంట్

Rohit - Kangana

Rohit - Kangana : భారత్‌లో జరుగుతున్న రైతుల ఆందోళనలపై అమెరికా పాప్‌ గాయని రిహానా, యువ పర్యావరణవేత్త గ్రెటా థన్‌బర్గ్‌ సహా పలువురు అంతర్జాతీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా స్పందించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వారికి కౌంటర్‌గా భారతీయ ప్రముఖులు కామెంట్ చేస్తున్నారు.

  • Share this:
    భారత్‌లో జరుగుతున్న రైతుల ఆందోళనలపై అమెరికా పాప్‌ గాయని రిహానా, యువ పర్యావరణవేత్త గ్రెటా థన్‌బర్గ్‌ సహా పలువురు అంతర్జాతీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా స్పందించిన విషయం తెలిసిందే. రెండు నెలలకు పైగా ఆందోళనలు చేస్తున్న రైతులకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఢిల్లీ సరిహద్దుల్లో 70 రోజులుగా రైతులు ఆందోళనలు చేస్తున్నారు. సాగుచట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వీరికి విపక్షాలు మద్దతు తెలుపుతున్నాయి. రైతుల గోస పట్టదా..? అని కేంద్రంపై మండిపడుతున్నాయి. ఐతే ఇన్నాళ్లు మన దేశంలోనే దీని గురించి చర్చ జరిగింది. కానీ ఇప్పుడు అంతర్జాతీయంగానూ హాట్ టాపిక్‌గా మారింది. విదేశాలకు చెందిన పలువురు ప్రముఖులు రైతుల ఉద్యమంపై స్పందిస్తున్నారు. ఈ క్రమంలో వారికి కౌంటర్‌గా భారతీయ ప్రముఖులు కామెంట్ చేస్తున్నారు. ఇది మా దేశ అంతర్గత విషయం.. ఇందులో మీరు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు. లేటెస్ట్ గా ఈ జాబితాలోకి హిట్ మ్యాన్ రోహిత్ శర్మ కూడా చేరిపోయాడు.

    " మనమంతా కలిసికట్టుగా ఉన్నప్పుడు భారత్ బలంగా ఉంటుంది. (రైతుల) సమస్యకు పరిష్కారం కనుగొనాల్సిన తరుణం ఇది. దేశ ప్రగతిలో రైతులు కీలక భూమిక పోషిస్తున్నారు. కలిసికట్టుగా పరిష్కారం కనుగొనడంలో ప్రతి ఒక్కరూ తమ తమ పాత్రలను పోషిస్తారని ఆశిస్తున్నా. ఐక్య భారత్" అని రోహిత్ శర్మ ట్వీట్ చేశారు.

    టీమిండియా పరిమిత ఓవర్ల వైస్ కెప్టెన్ చేసిన ట్వీట్‌కు బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఘాటుగా బదులిచ్చారు. ఈ క్రికెటర్లందరూ దోబీ దగ్గర కుక్కల్లా ఎందుకు మొరుగుతున్నారు. అటు ఇంటికి కాకుండా.. ఇటు ఘాట్‌కు కాకుండా.. అంటూ కంగన ట్వీట్ చేశారు. రైతు సంక్షేమం కోసం తీసుకొచ్చిన విప్లవాత్మక చట్టాలకు రైతులే ఎందుకు వ్యతిరేకంగా ఉన్నారు? అని ఆమె ప్రశ్నించారు. ఈ ఘర్షణలకు కారణమైన వారిని ఆమె మరోసారి ఉగ్రవాదులుగా అభివర్ణించారు. ఈ వివాదాస్పద ట్వీట్ చేసిన కాసేపటికే దీన్ని ట్విట్టర్ తొలగించింది.

    kangana tweet


    ఇప్పటికే ఈ వ్యవహరంలో కేంద్రానికి మద్దతుగా పలువురు భారత సెలబ్రిటీలు నిలిచారు. క్రికెటర్ సచిన్ టెండూల్కర్, బాలీవుడ్ నటులు అక్షయ్ కుమార్, అజయ్ దేవగణ్, లతా మంగేశ్కర్ సహా పలువురు సెలబ్రిటీలు కేంద్రం వాదనను సమర్థించారు. మా దేశ అంతర్గత విషయంలో మీరు కలగజేసుకోవాల్సిన అవసరం లేదని విదేశీ ప్రముఖులపై మండిపడ్డారు. ఈ క్రమంలోనే టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ కూడా స్పందించారు. అందరం ఐక్యమత్యంగా ఉందామని పిలుపునిచ్చారు.
    Published by:Sridhar Reddy
    First published:

    అగ్ర కథనాలు