హోమ్ /వార్తలు /క్రీడలు /

Team India : ఆసీస్ గడ్డపై టీమిండియా చిరస్మరణీయ విజయంపై డాక్యుమెంటరీ.. ట్రైలర్ విడుదల.. రిలీజ్ ఎప్పుడంటే?

Team India : ఆసీస్ గడ్డపై టీమిండియా చిరస్మరణీయ విజయంపై డాక్యుమెంటరీ.. ట్రైలర్ విడుదల.. రిలీజ్ ఎప్పుడంటే?

Team India ( PC : BCCI)

Team India ( PC : BCCI)

Team India : భారత క్రికెట్ జట్టు తన క్రికెట్ ప్రస్థానంలో అనేక విజయాలను అందుకుంది. అదే సమయంలో అనేక సిరీస్ లను గెలిచింది. కానీ, 2020-21లో ఆస్ట్రేలియాను వారి దేశంలోనే ఓడించి చరిత్ర సృష్టించింది.

Team India : భారత క్రికెట్ జట్టు తన క్రికెట్ ప్రస్థానంలో అనేక విజయాలను అందుకుంది. అదే సమయంలో అనేక సిరీస్ లను గెలిచింది. కానీ, 2020-21లో ఆస్ట్రేలియాను వారి దేశంలోనే ఓడించి చరిత్ర సృష్టించింది. 2020 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ముగిసిన అనంతరం భారత జట్టు ఆస్ట్రేలియా (Australia) పర్యటనకు వెళ్లింది. అక్కడ నాలుగు మ్యాచ్ ల టెస్టు సిరీస్ ను 2-1తో సొంతం చేసుకుని చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ టెస్టు సిరీస్ విజయాన్ని ప్రపంచకప్ గెలిచినంత గొప్పగా భారత్ (India) సెలెబ్రేట్ చేసుకుంది. ఆస్ట్రేలియాను వారి దేశంలోనే మట్టి కరిపించడమంటే ఎంతటి గొప్ప జట్టుకైనా కష్టమే. కానీ, భారత్ మాత్రం ఆ ఘనతను సాధించి అద్భుతం చేసింది. అందులోనే తొలి టెస్టులో ఘోర పరాజయం తర్వాత పుంజుకున్న భారత్ సిరీస్ గెలిచుకోవడమంటే మాటలు కాదు.

ఇప్పుడు ఆ సిరీస్ విజయాన్ని సినిమా స్టయిల్ లో మరోసారి భారత అభిమానుల ముందుకు తీసుకొస్తున్నాడు బాలీవుడ్ దర్శకుడు నీరజ్ పాండే. డాక్యుమెంటరీగా దీనిని రూపొందించారు. అంతేకాకుండా ఈ డాక్యుమెంటరీకి ’ బంధన్ మే తా ధమ్‘ అని పేరు కూడా పెట్టారు. ఈ డాక్యుమెంటరీ ట్రైలర్ ను ఆ సిరీస్ విజయంలో భాగంగా ఉన్న అజింక్యా రహానే, మొహమ్మద్ సిరాజ్, రవిచంద్రన్ అశ్విన్, హనుమ విహారీ, చతేశ్వర్ పుజారా చేతుల మీదుగా విడుదల చేశారు. మ్యాచ్ జరిగిన తీరును, డ్రెస్సింగ్స్ రూంలో భారత ఆటగాళ్లు ఏ విధంగా ఉన్నారు వంటి అంశాలను రహానే, సిరాజ్ తమ మాటల్లో వివరిస్తారు. వీటిని మ్యాచ్ మధ్యలో చూపిస్తూ డాక్యుమెంటరీని పూర్తి చేశారు. ఈ డాక్యుమెంటరీ ఈ నెల 16 నుంచి ఓటీటీ ప్లాట్ ఫామ్ వూట్ సెలెక్ట్ లో స్ట్రీమ్ చేయనున్నారు.


సిరీస్ లో భాగంగా తొలుత జరిగిన పింక్ బాల్ టెస్టులో భారత్ దారుణ ఓటమిని మూటగట్టుకుంటుంది. రెండో ఇన్నింగ్స్ లో అయితే కేవలం 36 పరుగులకే ఆలౌటై అభిమానులతో చివాట్లు కూడా తింటుంది. అనంతరం సతీమణి అనుష్క శర్మ బిడ్డకు జన్మనిస్తుండటంతో విరాట్ కోహ్లీ సిరీస్ నుంచి తప్పుకుంటాడు. ఆ క్రమంలో కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన రహానే.. టీంను అద్భుతంగా నిడిపిస్తాడు. ఈ క్రమంలో తర్వాత జరిగిన మూడు టెస్టుల్లో రెండింటిలో గెలిచి భారత్ సిరీస్ ను కైవసం చేసుకుంటుంది.

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Cheteswar Pujara, India vs australia, India vs Australia 2020, Mohammed Shami, Mohammed Siraj, Ravichandran Ashwin, Rohit sharma, Team India, Virat kohli

ఉత్తమ కథలు