బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా (Urvashi Rautela) అటు బీ టౌన్‌లోనూ ఇటు క్రికెట్ అభిమానుల నోటిలో ప్రస్తుతం నానే ఏకైక పేరు. అందుకు కారణం రిషబ్ పంత్ (Rishabh Pant). గతంలో రిషబ్ పంత్, ఊర్వశి రౌతేలా కొంతకాలంగా డేటింగ్లో ఉన్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత వారిద్దరి మధ్య సోషల్ మీడియాలో వాడివేడిగా వార్ కొనసాగిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకుంటూ నెటింట్లో హాట్‌టాపిక్‌గా మారారు. ముఖ్యంగా ఊర్వశి.. పంత్ పేరు ప్రస్తావించకుండానే అతడి గురించి ఏదో ఒకటి పరోక్షంగా పోస్ట్‌లు పెడుతూనే ఉంటుంది. దీంతో.. ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంది ఈ ముద్దుగుమ్మ.
ఇక, లేటెస్ట్ గా ఓ వీడియో కారణంగా ఊర్వశి దారుణంగా ట్రోల్ చేయబడింది. వాస్తవంగానెటిజన్లు ఈ బ్యూటీ ప్రతి పోస్ట్‌లను ఏదో ఒక విధంగా క్రికెటర్ రిషబ్ పంత్‌తో అనుసంధానిస్తూ చూస్తున్నారు. ఊర్వశి కొన్ని రోజుల క్రితం ఒక వీడియోను పంచుకుంది. అందులో ఆమె 'ఐ లవ్ యూ' అని చెప్పడం మనం గమనించవచ్చు. అయితే ఆ వీడియోలో ఆమె పదే పదే ఎవరికో ఐ లవ్ యూ చెబుతోంది. ఇంకేముంది అభిమానులు ఈ వీడియో పంత్ ను ఉద్దేశించే చేసిందని కామెంట్ల వర్షం కురిపించారు. ఇప్పుడు ఆ వీడియోపై ఊర్వశి క్లారిటీ ఇచ్చింది.
తన వీడియోను రిషబ్ పంత్‌తో లింక్ చేయడంపై ఊర్వశి స్పష్టం చేసింది. ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేసిన పోస్ట్‌లో ఆమె ఇలా రాసింది, 'ఈ రోజుల్లో చెలామణి అవుతున్న నా 'ఐ లవ్ యూ వీడియో' గురించి నేను స్పష్టం చేయాలనుకుంటున్నాను. ఈ వీడియోకు ఏ వ్యక్తితో సంబంధం లేదు. ఇది కేవలం నటన కోసం మాత్రమే చేసింది. అలాగే, ఇది వీడియో కాల్ కాదు ' అంటూ రాసుకొచ్చింది.
ఊర్వశి రౌతేలా చేసిన ఈ ఐ లవ్ యు వీడియో బయటకు వచ్చిన వెంటనే, నెటిజన్లు ఆ వీడియోకి క్రికెటర్ రిషబ్ పంత్‌తో లింకు పెడుతూ కామెంట్స్ చేయడం ప్రారంభించారు. ఈ వీడియో రిషబ్ కోసమే అని కొందరు సోషల్ మీడియా నెటిజన్లు భావిస్తూ కామెంట్లు చేస్తున్నారు.
Bollywood Actress Urvashi Rautela Valentine Day drama viral on the social media and captioned This Valentine Week Delhi girls be like: Aap bolo I LOVE YOU bas ek baar bol do ???????? #UrvashiRautela #valentine #day #valentineday #bollywood #actress pic.twitter.com/c78TvrHJX9
— Hungama Bollywood (@mirchi_blog) February 13, 2020
ఊర్వశి చాలా కాలం నుంచి రిషబ్ పంత్ తో రిలేషన్షిప్లో ఉందని చాలా కాలంగా చర్చ జరుగుతోంది. అయితే, ఊర్వశి రౌతేలా తన సోషల్ మీడియా పోస్ట్ ద్వారా, ఈ వీడియో కేవలం ఒక డైలాగ్ గురించి మాత్రమే ఉందని స్పష్టం చేసింది. ఇక ఊర్వశి టీమ్ ఇండియాను ఉత్సాహపరిచేందుకు ఊర్వశి ఆస్ట్రేలియా వెళ్లినట్లు కొన్ని కథనాలు వైరల్ అవుతున్నాయి. ఆ విషయంలో ఈ ముద్దుగుమ్మను ఫ్యాన్స్ ఓ ఆటాడుకున్నారు. అదే సమయంలో, ఊర్వశి ఏదో ఒక సినిమా ప్రాజెక్ట్‌కు సంబంధించి ఆస్ట్రేలియాకు వెళ్లినట్లు కూడా ప్రచారం జరుగుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bollywood news, Cricket, Rishabh Pant, T20 World Cup 2022, Urvashi Rautela