BJP MP AND FORMER TEAM INDIA PLAYER GAUTAM GAMBHIR TESTS COVID 19 POSITIVE AND LUCKNOW SUPERGIANTS ARE FEELING TENSION DUE TO THIS REASON SRD
Gautam Gambhir : గౌతమ్ గంభీర్ కు కరోనా పాజిటివ్.. టెన్షన్ లో ఆ ఐపీఎల్ జట్టు..!
Gautam Gambhir
Gautam Gambhir : కరోనా.. కరోనా.. కరోనా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మరోసారి బాగా విన్పిస్తోన్న పేరు. మరోసారి ఈ పిశాచి.. ప్రజల్ని భయాందోళనలకు గురి చేస్తోంది. ఇప్పుడు ఈ మహమ్మారి కన్ను క్రీడా రంగంపై పడింది.
మానవాళి నుదుటి మీద కరోనా(Corona) రాస్తున్న మృత్యు శాసనానికి ఇప్పట్లో ఫుల్ స్టాప్ పడేలా లేదు. ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి మరోసారి ప్రభావం చూపుతోంది. ఈ మహమ్మారి ప్రభావం ఇప్పుడు అన్ని రంగాలపై పడింది. క్రీడారంగంపై కూడా తన కన్ను వేసినట్టుంది. లేటెస్ట్ గా టీమిండియా మాజీ క్రికెటర్, లక్నో ఫ్రాంచైజీకి మెంటార్ గా వ్యవహరిస్తున్న గౌతం గంభీర్ (Gautam Gambhir) కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని స్వయంగా అతడే ట్విట్టర్ వేదికగా వెల్లడించాడు. ట్విట్టర్ వేదికగా స్పందించిన గంభీర్.. "తేలికపాటి లక్షణాలతో ఇబ్బందిపడ్డ నాకు ఈరోజు కరోనా పాజిటివ్ అని తేలింది. నా కాంటాక్టులోకి వచ్చిన వాళ్లు పరీక్షలు చేసుకోవాలని కోరుతున్నాను. " అని ట్వీట్ లో పేర్కొన్నాడు.
భారత్ లో విజృంభిస్తున్న కరోనా కేసులు టీమిండియా తాజా, మాజీ క్రికెటర్లను కూడా వదలడం లేదు. థర్డ్ వేవ్ మొదలైన వెంటనే భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కరోనా బారిన పడ్డాడు. ఆ తర్వాత బీసీసీఐ లోని పలు అధికారులకు కూడా కరోనా సోకింది.
మరోవైపు, కరోనాతో భారత్‌లో అనేక క్రికెట్ టోర్నీలు వాయిదా పడ్డాయి. ఈ నెల 13 నుంచి జరగాల్సిన రంజీ ట్రోఫీని వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. అలాగే కల్నల్ సీకే నాయుడు ట్రోఫీ, మహిళల టీ20 ట్రోఫి కూడా వాయిదా వేసింది.దక్షిణాఫ్రికాలో పర్యటించిన భారత వన్డే జట్టుకు ఎంపికైన వాషింగ్టన్ సుందర్ కు కూడా కరోనా సోకడంతో అతడు ఏకంగా సిరీస్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.
After experiencing mild symptoms, I tested positive for COVID today. Requesting everyone who came into my contact to get themselves tested. #StaySafe
నాలుగు రోజుల క్రితం దుబాయ్ లో లెజెండ్స్ లీగ్ క్రికెట్ ఆడటానికి వెళ్లిన హర్భజన్ సింగ్ కు కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ గ్లెన్ మ్యాక్స్ వెల్ కూడా కరోనా బారిన పడి ఇప్పుడు కోలుకున్నాడు. ఇక, లేటెస్ట్ గా గంభీర్ సైతం వైరస్ బారిన పడ్డాడు.
అయితే.. గంభీర్ కు కరోనా సోకడంతో ఐపీఎల్ ఫ్రాంచైజీ లక్నో సూపర్ జెయింట్స్ లో టెన్షన్ మొదలైంది. ఐపీఎల్ వేలానికి సమయం దగ్గర పడుతున్న సమయంలో గౌతీకి వైరస్ సోకడం ఆ జట్టుకు నష్టం కలిగించేదే. ఆ జట్టు ప్రణాళికలకు నష్టం కలిగే ఛాన్సుందని క్రీడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
కాగా.. గంభీర్ త్వరగా కోలుకోవాలని అతడి అభిమానులు కోరుతున్నారు. గంభీర్ ట్వీట్ కు పలువురు నెటిజన్లు స్పందిస్తూ.. ‘గెట్ వెల్ సూన్ సర్..’ అని కామెంట్లు పెడుతున్నారు. ఇక ఐపీఎల్ వేలానికి సమయం దగ్గర పడుతున్న సమయంలో గంభీర్ కు కరోనా సోకడం ఆయన మెంటార్ గా ఉన్న లక్నో జట్టుకు నష్టం కలిగించేదే.
గౌతమ్ గంభీర్ 2018లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైరయ్యాడు. గంభీర్ భారత్ తరఫున 54 టెస్టులు, 147 వన్డేలు, 37 టీ20లు ఆడాడు. 2007, 2011 ప్రపంచ కప్‌లను గెలుచుకున్న జట్టులో సభ్యుడిగా ఉన్నాడు.గంభీర్ 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ టిక్కెట్‌పై పోటీ చేసి విజయం సాధించారు. ఆయన తూర్పు ఢిల్లీ నుంచి ఎంపీగా విజయం సాధించాడు. ఐపీఎల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. అతని కెప్టెన్సీలో, KKR 2012, 2014లో ఛాంపియన్‌గా నిలిచింది.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.