అనుష్కకు విడాకులు ఇచ్చెయ్.. కొహ్లీకి బీజేపీ ఎమ్మెల్యే విజ్ఞప్తి

వెబ్‌ సిరీస్‌ను నిషేధించాలని కేంద్ర సమాచార, ప్రసార మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌కు లేఖ రాశారు. అనుష్క మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరించారని.. జాతీయ భద్రతా చట్టం కింద కేసు నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

news18-telugu
Updated: May 27, 2020, 6:22 PM IST
అనుష్కకు విడాకులు ఇచ్చెయ్.. కొహ్లీకి బీజేపీ ఎమ్మెల్యే విజ్ఞప్తి
విరాట్ కోహ్లీ- అనుష్క శర్మ ( Virat kohli / Twitter )
  • Share this:
బాలీవుడ్ హీరోయిన్, విరాట్ కొహ్లీ భార్య అనుష్క శర్మపై యూపీకి చెందిన బీజేపీ ఎమ్మెల్యే నంద కిశోర్ గుర్జర్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పటికే అనుష్కపై కేసు నమోదుచేసిన ఆయన.. ఆమె దేశద్రోహి అంటూ మండిపడ్డారు. అంతేకాదు అనుష్క శర్మకు విడాకులు ఇవ్వాలని విరాట్ కొహ్లీకి విజ్ఞప్తి చేశారు. అసలేం జరిగిదంటే. అనుష్క నిర్మించిన వెబ్‌ సిరీస్‌ ‘పాతాళ్‌లోక్‌’ ఇటీవలే అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదలైంది. ఐతే ఇందులోని ఓ సన్నివేశంలో ఎమ్మెల్యే నందకిశోర్‌ ఫొటోను ఉపయోగించారు. తన అనుమతి లేకుండా ఫొటో ఎలా వాడాతారంటూ ఆయన మండిపడ్డారు. అంతేకాదు ఆ వెబ్‌ సిరీస్‌ను నిషేధించాలని కేంద్ర సమాచార, ప్రసార మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌కు లేఖ రాశారు. అనుష్క మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరించారని.. జాతీయ భద్రతా చట్టం కింద కేసు నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

విరాట్‌ కోహ్లీకి దేశభక్తి ఉంది. ఆయన భారత్‌ తరఫున క్రికెట్ ఆడుతున్నారు. ఆయన అనుష్కకు విడాకులు ఇవ్వాలి. నందకిశోర్ గుర్జర్, బీజేపీ ఎమ్మెల్యే



కాగా, పాతాళ్ లోక్ వెబ్ సిరీస్ పలు వివాదాల్లో చిక్కుకుంది. ఈ చిత్రంపై గోర్ఖా సంఘాలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓ సన్నివేశంలో గోర్ఖా వర్గాన్ని కించపరిచేలా సంభాషణలు ఉన్నాయని.. ఆల్ అరుణాచల్ ప్రదేశ్ గోర్ఖా యూత్ అసోసియేన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ సంఘం అధ్యక్షుడు కూడా ఇప్పటికే అనుష్క శర్మపై మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.
First published: May 27, 2020, 6:20 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading