Home /News /sports /

BILLGATES SUPPORTS EGYPT ATHLETE NAYEL NASSIR WHY HE IS SUPPORTING HIM CHECK THE REASON HERE JNK GH

Bill Gates: ఈజిప్ట్ అథ్లెట్‌కు మద్దతు ఇస్తున్న బిల్‌గేట్స్... ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోతారు

బిల్ గేట్స్ సపోర్ట్ చేస్తున్న ఈ ఈజిప్షియన్ క్రీడాకారుడు ఎవరు? (Olympics)

బిల్ గేట్స్ సపోర్ట్ చేస్తున్న ఈ ఈజిప్షియన్ క్రీడాకారుడు ఎవరు? (Olympics)

నాయెల్ నాజర్.. బిల్ గేట్స్‌కు కాబోయే అల్లుడు. తన కూతురు జెన్నిఫర్ గేట్స్‌కు అతడితో నిశ్చితార్థమైంది. దీంతో ఈజిప్టుకు చెందిన అల్లుడికి సపోర్ట్ చేస్తున్నారు.

ఒలింపిక్స్ విశ్వక్రీడల (Tokyo Olympics) జోరు కొనసాగుతోంది. ప్రపంచ దేశాల ప్రజలందరూ తమ క్రీడాకారులే (Athletes) గెలవాలని కోరుకుంటున్నారు. అయితే ప్రపంచ ధనవంతుల్లో (Billionaire)  ఒకరైన బిల్ గేట్స్ (Bill Gates) ఎవర్ని సపోర్ట్ చేస్తారు? కచ్చితంగా అమెరికన్ క్రీడాకారులకే మద్దతు ఇస్తారు.. ఇందులో వింతేముంది అనుకోవచ్చు. కానీ బిల్ గేట్స్ మాత్రం ఈజిప్టుకు చెందిన ఈక్వెస్ట్రియన్ (గుర్రాల జంపింగ్) క్రీడాకారుడు నాయెల్ నాజర్‌ను (Nayel Nassir) సపోర్ట్ చేస్తున్నారు. స్వయంగా ఆయనే ఈ విషయాన్ని తెలిపారు. ఇందుకు కారణం లేకపోలేదు. నాయెల్ నాజర్.. బిల్ గేట్స్‌కు కాబోయే అల్లుడు. తన కూతురు జెన్నిఫర్ గేట్స్‌కు అతడితో నిశ్చితార్థమైంది. దీంతో అల్లుడికి సపోర్ట్ చేస్తూ ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు బిల్ గేట్స్.

"టోక్యో ఒలింపిక్స్‌లో నేను చాలా మందికి మద్దతు ఇస్తున్నా. కానీ నా అల్లుడి కంటే ఎక్కువగా మరే ఇతర అథ్లెట్‌కు సపోర్ట్ చేయను. గుడ్ లక్ నాయెల్" అని ఇన్ స్టాలో బిల్ గేట్స్ పోస్ట్ చేశారు. బిల్ గేట్స్ మాజీ భార్య మెలిందా కూడా తన మద్దతు తన అల్లుడికేనని ప్రకటించింది. "నాకు ఒలింపిక్స్ చూడటమంటే ఎప్పుడూ ఇష్టమే. ముఖ్యంగా టోక్యో ఒలింపిక్స్ ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే నాకు కాబోయే అల్లుడు నాయెల్ నాజర్ పాల్గొంటున్నాడు. మేము ఎంతో గర్వపడుతున్నాం" అని మెలిందా పోస్ట్ చేశారు.

ఈజిప్టుకు చెందిన నాయెల్ నాజర్ ఈక్వెస్ట్రియన్ క్రీడ విభాగంలో ఒలింపిక్స్‌కు ఎంపికయ్యాడు. అతడు వ్యక్తిగత జంపింగ్ విభాగంలో సులభంగా ఒలింపిక్ ఫైనల్‌కు అర్హత సాధించాడు. తన అత్త, మామలతో పాటు చాలా మంది ప్రజలు అతడికి సోషల్ మీడియాలో అభినందనలు తెలుపుతున్నారు. దీంతో అతడు అందరికీ కృతజ్ఞతలు తెలిపాడు. చేపట్టిన పనిలో కొంత భాగం పూర్తయిందని, ఆఖరి పోరాటానికి సిద్ధంగా ఉన్నానని, ఇందుకోసం ఉత్సాహంగా ఎదురు చూస్తున్నానని నాయెల్ తెలిపాడు.

మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులైన బిల్‌గేట్స్, మెలిందా గేట్స్ ఇటీవల విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని వారీ మే నెలలో ప్రకటించారు. 27 ఏళ్ల బంధాన్ని ముగుస్తున్నట్లు స్పషం చేశారు. ఈ సోమవారం కింగ్ కౌంటీ సుపీరియర్ కోర్టు న్యాయమూర్తి వీరి విడాకులను ఖరారు చేశారు. అయితే కోర్టు పత్రాల్లో వీరి ఆస్తిని ఎలా విభజిస్తారనే వివరాలు మాత్రం లేవు.
Published by:John Naveen Kora
First published:

Tags: Bill Gates, Olympics, Tokyo Olympics

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు