Home /News /sports /

BIGGEST DREAM CAME TRUE HIMA DAS SAYS ON BEING APPOINTED DSP SA

డీఎస్పీగా భారత్ చిరుత హిమా దాస్‌.. పదవితో గౌవరించిన అస్సాం ప్రభుత్వం

himadas dsp

himadas dsp

భారత స్టార్‌ అథ్లెట్‌ హిమా దాస్‌ను అస్సాం ప్రభుత్వం డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ (డీఎస్పీ) ఉన్నతోద్యోగంతో గౌరవించింది.



    భారత స్టార్‌ అథ్లెట్‌ హిమా దాస్‌ను అస్సాం ప్రభుత్వం డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ (డీఎస్పీ) ఉన్నతోద్యోగంతో గౌరవించింది. ఈ మేరకు అస్సాం ముఖ్యమంత్రి శర్బానంద సోనోవాల్‌ నియామక పత్రాలు అందజేశారు. 21 ఏళ్ల హిమా దాస్‌ 2018లో ప్రపంచ జూనియర్‌ చాంపియన్‌షిప్‌లో ప్రపంచ చాంపియన్‌గా నిలిచింది. ఇక ఆసియా క్రీడల్లో స్వర్ణం, రజతం సాధించి భారత కీర్తి పతాకాన్ని ఎగరెసింది.









    అస్సాం ప్రభుత్వం ఇచ్చిన గౌరవ పదివిపై హిమదాస్ మాట్లాడుతూ... తన చిన్ననాటి కల ఈ రోజుతో నెరవేరిందన్నారు. పోలీస్ అధికారి కావాలన్న తన కోరికను క్రీడాపై ఉండే మక్కువతో నేరవేరిందన్నారు. క్రీడా రంగంలో దేశంలోనే అత్యుత్తమ స్థానంలో నిలబెట్టేందుకు కృషి చేస్తాను.' అని హిమదాస్ తెలిపారు. హిమ ఈ పదవి దక్కడంపై బాలీవుడ్ తారా సోనాక్షి సిన్హా ఆనందం వ్యక్తం చేశారు. "నిన్ను ఇలా చూడడం చాలా గర్వంగా ఉంది" అంటూ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్‌ను షేర్ చేశారు.
    Published by:Rekulapally Saichand
    First published:

    Tags: Hima Das

    తదుపరి వార్తలు