Home /News /sports /

IND vs NZ: సబ్‌స్టిట్యూట్‌గా వచ్చాడు.. ఇండియాకు వికెట్ అందించాడు.. లంచ్‌ సమయానికి కివీస్ 197/2

IND vs NZ: సబ్‌స్టిట్యూట్‌గా వచ్చాడు.. ఇండియాకు వికెట్ అందించాడు.. లంచ్‌ సమయానికి కివీస్ 197/2

అద్భుతం చేసిన కేఎస్ భరత్.. న్యూజీలాండ్ 197/2 (PC: BCCI)

అద్భుతం చేసిన కేఎస్ భరత్.. న్యూజీలాండ్ 197/2 (PC: BCCI)

IND vs NZ: కాన్పూర్ టెస్టులో మూడో రోజు భారత జట్టు కాస్త పుంజుకున్నది. తొలి సెషన్‌లో భారత జట్టు రెండు వికెట్లు తీసింది. విల్ యంగ్ వికెట్‌ను అశ్విన్ తీశాడు. తెలుగు కుర్రాడు కేఎస్ భరత్ అద్భుతంగా క్యాచ్ చేయడమే కాకుండా డీఆర్ఎస్ కోసం జట్టును ఒప్పించి బ్రేక్ ఇవ్వగలిగాడు.

ఇంకా చదవండి ...
  పేటీఎం (PayTm) సిరీస్‌లో భాగంగా కాన్పూర్ వేదికగా న్యూజీలాండ్ - ఇండియా (India vs New Zealand) తొలి టెస్టు జరుగుతున్నది. భారత జట్టు (Team India) తొలి ఇన్నింగ్స్‌లో 345కి ఆలౌట్ అయ్యింది. ఆ తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన కివీస్ జట్టు (New Zealand) చాలా నిలకడగా ఆడుతున్నది. రెండో రోజు న్యూజీలాండ్ ఓపెనర్లు అసలు వికెట్లు పడేసుకోకుండా చాలా ఆత్మ విశ్వాసంతో టీమ్ ఇండియా బౌలర్లను ఎదుర్కున్నారు. విల్ యంగ్, టామ్ లాథమ్ కివీస్ జట్టుకు మంచి భాగస్వామ్యాన్ని అందించారు. దీంతో రెండో రోజు ఆటముగిసే సమయానికి కివీస్ 129/0తో నిలిచింది. ఇక మూడో రోజు కూడా కివీస్ నిలకడగా ఆటను ప్రారంభించింది. గత రోజు ఫామ్‌ను కొనసాగిస్తూ నిలకడగా బ్యాటింగ్ చేశారు. విల్ యంగ్, టామ్ లాథమ్ మంచి స్టాండ్ ఇచ్చినట్లే కనిపించారు.

  అయితే ఓవర్ నైట్ స్కోర్‌కు కేవలం 32 పరగులు జోడించిన తర్వాత న్యూజీలాండ్ జట్టు తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ విల్ యంగ్ (89) రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో సబ్‌స్టిట్యూట్ కేఎస్ భరత్‌కు (KS Bharat) క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. అశ్విన్ వేసిన అద్భుతమైన బంతి యంగ్ బ్యాటును తాకుతూ చాలా కిందిగా ప్రయాణిస్తూ వెళ్లగా.. కేఎస్ భరత్ అద్భుతంగా క్యాచ్ చేశాడు. అయితే అంపైర్ నితిన్ మీన్ అవుట్ ఇవ్వలేదు. కానీ కేఎస్ భరత్ చాలా ఆత్మవిశ్వాసంతో డీఆర్ఎస్‌కు వెళ్లాలని కెప్టెన్ అజింక్య రహానే, బౌలర్ అశ్విన్‌ను కోరాడు. క్యాచ్ చేసిన దగ్గర నుంచి భరత్ చాలా కాన్ఫిడెంట్‌గా డీఆర్ఎస్ కోరాడు. భరత్ కోరడం భారత జట్టుకు వికెట్ తెచ్చి పెట్టింది. అల్ట్రా ఎడ్జ్‌లో బ్యాటుకు బంతి తగిలినట్లు క్లియర్‌గా తెలిసింది. దీంతో అంపైర్ నితిన్ మీనన్ తన నిర్ణయాన్ని మార్చుకోక తప్పలేదు.

  Rashid Khan: 'మన దగ్గర బేరాల్లేవమ్మా..!'.. సర్‌రైజర్స్‌తో తేల్చి చెప్పిన రషీద్ ఖాన్.. యాజమాన్యానికి షాక్..!

  భారత జట్టు కీపర్ వృద్దిమాన్ సాహ మెడ పట్టేయడంతో ఈ రోజు మైదానంలోకి రాలేదు. దీంతో అతడి స్థానంలో తెలుగు కుర్రాడు కేఎస్ భరత్‌ను సబ్‌స్టిట్యూట్ కీపర్‌గా ఆడిస్తున్నారు. తుది జట్టులో లేకున్నా అత్యద్భుతంగా కీపింగ్ చేస్తూ ఒక వికెట్ రావడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక కివీస్ జట్టు మూడో రోజు కూడా నిలకడగా ఆడుతున్నది. విల్ వికెట్ కోల్పోయిన తర్వాత కూడా న్యూజీలాండ్ అదే ఆట తీరును కొనసాగింది. టామ్ లాథమ్ ఎలాంటి అవకాశాలు ఇవ్వకుండా భారత బౌలర్లను ధీటుగా ఎదుర్కుంటున్నాడు.

  Cristiano Ronaldo Body Gaurds: క్రిస్టియానో రొనాల్డో బాడీగార్డ్స్ ట్విన్స్ అనే విషయం తెలుసా? వారి వివరాలు ఇక్కడ చూడండి


  అశ్విన్ బౌలింగ్‌లో ఒకసారి ఎల్బీడబ్ల్యూ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. అశ్విన్ వేసిన బంతి లాథమ్ ప్యాడ్లకు తాకింది. అయితే అంపైర్ నితిన్ మీనన్ అవుట్ ఇవ్వలేదు. అదే సమయంలో కెప్టెన్ అజింక్య రహానే డీఆర్ఎస్ తీసుకోవడానికి ఇష్టపడలేదు. అయితే రీప్లేలో అది క్లియర్ ఎల్బీగా కనపడింది. ఇలా భారత జట్టు మంచి అవకాశాన్ని కోల్పోయింది. లాథమ్ (81), విలియమ్‌సన్ కలసి రెండో వికెట్‌కు 46 పరుగులు జోడించారు. అయితే సరిగ్గా లంచ్ విరామానికి ముందు కేన్ విలియమ్‌సన్ (18) ఉమేష్ యాదవ్ బౌలింగ్‌లో ఎల్బీగా అవుటయ్యాడు. దీంతో లంచ్ సమయానికి న్యూజీలాండ్ 197/2 స్కోరుతో ఉన్నది.

  (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
  Published by:John Kora
  First published:

  Tags: India vs newzealand, Kane Williamson, Ravichandran Ashwin, Team india, Test Cricket

  తదుపరి వార్తలు