• HOME
  • »
  • NEWS
  • »
  • SPORTS
  • »
  • BIG SHOCKS TO SUNRISES HYDERABAD NEW ZEALAND SKIPPER KANE WILLIAMSON LIKELY MISS TO IPL 2021 SA

సన్‌రైజర్స్‌కు భారీ షాక్‌.. టొర్నీకి ముందే కీలక ఆటగాడు దూరం..!

సన్‌రైజర్స్‌కు భారీ షాక్‌.. టొర్నీకి ముందే కీలక ఆటగాడు దూరం..!

SunRisers Hyderabad

టోర్నీ ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు కీలక ఆటగాడు న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ మోచేతి గాయంతో బాధపడుతున్నారు.

  • Share this:


    టోర్నీ ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు కీలక ఆటగాడు న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ మోచేతి గాయంతో బాధపడుతున్నారు. ఈ కారణంగా బంగ్లాదేశ్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు దూరం అయ్యాడు. ప్రస్తుతం విలియమ్సన్ గాయంతో భాదపడుతున్నారని న్యూజిలాండ్‌ క్రికెట్‌ బోర్డు కూడా అధికారికంగా ప్రకటించింది. దీంతో సన్‌రైజర్స్ యాజమాన్యంలో ఆందోళన మెుదలైంది. ఎస్‌ఆర్‌హెచ్ మిడిల్ అర్డర్ భారాన్ని మోస్తున్న విలియమ్స్ జట్టులో కీలక ఆటగాడిగా ఉన్నారు. మరో నెల రోజుల్లో టోర్నీ ప్రారంభం కానున్నది ఈ సమయంలో అతను జట్టులో లేకపోతే విజయావకాశాలపై ప్రభావం చూపుతుందని యాజమాన్యం భావిస్తోంది.

    త్వరలో ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్, టీ20 ప్రపంచకప్‌ రిత్యా కేన్ విలియమ్సన్ జట్టులో ఉండడం ముఖ్యం కాబట్టి అతన్ని ఫిట్‌గా ఉంచడంపై న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు జాగ్రత్తలు తీసుకుంటుంది. గాయం తీవ్రత ఎంత అని తెలియకపోయికనప్పటికి అప్రాధన్యత టోర్నీలైన బంగ్లాదేశ్,ఐపీఎల్ టోర్నీలకు అతన్ని దూరంగా ఉంచాలని బోర్డు ఆలోచిస్తోంది. ఇదే విషయాన్ని న్యూజిలాండ్ హెడ్ కోచ్ గ్యారీ స్టెడ్ స్పష్టం చేశారు. దీంతో విలియమ్సన్ ఐపీఎల్ 2021 సీజన్ ఆడటంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ పరిణామం సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌ను తీవ్ర నిరాశకు గురి చేస్తోంది.
    Published by:Rekulapally Saichand
    First published: