BIG SHOCK TO PAKISTAN WOMENS CRICKET TEAMS AND SIX WOMEN CRICKETERS TEST POSITIVE FOR COVID 19 BEFORE WEST INDIES SERIES SRD
Pakistan : పాకిస్తాన్ క్రికెట్ జట్టులో ఆరుగురికి కరోనా.. షాక్ లో ఆ దేశ అభిమానులు..
Cricket ( ప్రతీకాత్మక చిత్రం)
Pakistan : గత ఏడాది స్తంభించిపోయిన క్రీడలు.. ఇప్పుడు బయోబబుల్ (Bio Bubble) ఏర్పాటు చేసి నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది టీ -20 వరల్డ్ కప్ కూడా బయోబబుల్ లోనే నిర్వహిస్తున్నారు. ఒకసారి బయోబబుల్లోకి అడుగుపెట్టే వారికి బయటి ప్రపంచంతో నేరుగా సంబంధాలు తెగిపోతాయి.
ప్రపంచాన్ని కరోనా వైరస్ (Corona Virus) అతలాకుతలం చేసేసింది. ప్రతీ దేశంలో కోవిడ్ నిబంధనలు (Covid Restrictions) విధించారు. ఇక గత ఏడాది స్తంభించిపోయిన క్రీడలు.. ఇప్పుడు బయోబబుల్ (Bio Bubble) ఏర్పాటు చేసి నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది టీ -20 వరల్డ్ కప్ కూడా బయోబబుల్ లోనే నిర్వహిస్తున్నారు. ఒకసారి బయోబబుల్లోకి అడుగుపెట్టే వారికి బయటి ప్రపంచంతో నేరుగా సంబంధాలు తెగిపోతాయి. ఈ కఠిన రూల్స్ మధ్యఆటగాళ్లకి కరోనా సోకడం కష్టం. కానీ, ఈ ఏడాది ఐపీఎల్, మరి కొన్ని సిరీస్ ల్లో బయోబబుల్ ను కూడా చేధించి తన ప్రతాపాన్ని చూపిస్తోంది కరోనా వైరస్. లేటెస్ట్ గా బయోబబుల్ పై మరోసారి ప్రశ్నలు మొదలయ్యాయ్. విషయంలోకి వెళ్తే.. టీ-20 వరల్డ్ కప్ (T20 World Cup 2021) లో అదరగొడుతున్న పాకిస్థాన్ క్రికెట్ జట్టు ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్ ఆ జట్టుకు చెందిన ఆరుగురు క్రికెటర్లు కరోనా (Corona) భారీన పడ్డారు. రోజూవారీ పరీక్షలలో భాగంగా క్రికెటర్లకు పరీక్షలు నిర్వహించగా.. అందులో ఆరుగురికి కరోనా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ-PCB) కూడా ధ్రువీకరించింది. దీంతో పాకిస్థాన్ అభిమానులకు షాక్ తగిలినట్టైంది.
పాకిస్థాన్ మహిళా జట్టు (Pakistan Womens cricket team) లోని ఆరుగురు మహిళా క్రికెటర్లకు కరోనా నిర్ధారణ అయిందని పీసీబీ తెలిపింది. శుక్రవారం అందుకు సంబంధించి పీసీబీ అధికారిక ప్రకటన కూడా చేసింది. అయితే కరోనా భారీన పడ్డ క్రికెటర్ల పేర్లను మాత్రం పీసీబీ వెల్లడించలేదు. అయితే వైరస్ సోకినవాళ్లు మాత్రం పది రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాలని పీసీబీ ఆదేశించింది. వారితో పాటు మిగతా క్రికెటర్లు వేరుగా ఉండాలని, వాళ్లు రోజూవారీ కరోనా పరీక్షలు చేయించుకోవాలని.. అందరూ ఐసోలేషన్ లోనేఉండాలని సూచించింది.
పాకిస్థాన్ మహిళల క్రికెట్ జట్టు.. త్వరలోనే వెస్టిండీస్ (west Indies) తో మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. స్వదేశంలో జరుగనున్న వన్డే సిరీస్ కోసం ఏర్పాటుచేసిన సన్నాహక శిబిరంలో జట్టు సభ్యులకు రొటీన్ చెకప్ చేయగా.. పరీక్షల్లో ఈ విషయం వెలుగుచూసింది.
పాకిస్థాన్ మహిళా క్రికెట్ జట్టు
వచ్చే నెల 8, 11, 14 తేదీలలో పాకిస్థాన్ జట్టు.. వెస్టిండీస్ తో వన్డే సిరీస్ ఆడాల్సి ఉంది. అయితే ప్రస్తుతం పాక్ జట్టులో కరోనా కలకలం రేగడంతో ఈ సిరీస్ జరుగుతుందా..? లేదా..? అన్నదానిపై నీలినీడలు కమ్ముకున్నాయి. మరోవైపు, ఇప్పటికే స్టెఫానీ టేలర్ నేతృత్వంలోని విండీస్ టీమ్ కరాచీకి చేరింది. వాళ్లు మూడు రోజుల పాటు ఐసోలేషన్ లో ఉండనున్నారు.
మరోవైపు, మెగాటోర్నీలో అద్భుత ప్రదర్శనలతో పాకిస్థాన్ పురుషుల జట్టు అదరగొడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచుల్లోనూ అదిరిపోయే ఆటతీరుతో ఆ జట్టు గ్రూప్-2లో టాపర్ గా ఉంది. చిరకాల ప్రత్యర్థి భారత్ (India) తో పాటు కొత్త ప్రత్యర్థి న్యూజీలాండ్ (Newzealand) పై కూడా పాక్ ప్రతీకారం తీర్చుకుంది.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.