Home /News /sports /

BIG SHOCK TO PAKISTAN CRICKET BOARD SECURITY STAFF BIRYANI BILL WAS 27 LAKH RUPEES NGS

Shocking Biryani Bill: వామ్మో షాకిచ్చిన బిర్యానీ బిల్లు.. 7 రోజుల్లో 27లక్షల ఖర్చు

బిర్యానీ బిల్లు 27 లక్షల రూపాయలు

బిర్యానీ బిల్లు 27 లక్షల రూపాయలు

Biryani bill: బిర్యానీ అంటే ఇష్టంగా లాగించేసేవాళ్లు చాలామందే ఉంటారు. వేరే వాళ్లు బిల్లు కడతారు.. మనం ఫ్రీగా తినవచ్చు అనుకున్నా ఎంత తినగలం.. వారం రోజుల బిర్యానీ బిల్లు అంటే మహా అయితే వేలల్లో వస్తుంది ఏమో.. కానీ వారం రోజులకు బిర్యానీ బిల్లు 27 లక్షలు రావడంతో.. అంతా షాక్ గురవుతున్నారు. ఇది ఎక్కడ తెలుసా..?

ఇంకా చదవండి ...
  Pakistan Police Binary Bill: పాకిస్తాన్‌ క్రికెట్ (Pakistan Cricket)  బోర్డుకు వరుస షాక్ లు తగులుతున్నాయి. అసలే న్యూజీలాండ్ క్రికెట్ (Newzealand cricket team) చివరి నిమిషంలో పర్యటన రద్దు చేసుకుని వెళ్లిపోయింది. ఇక ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB)  కూడా షాక్ ఇచ్చింది. ఈ బాధలో ఉన్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు మరో షాక్ తగిలింది. మ్యాచ్ ల నిర్వహణకు సంబంధించి భద్రతా సిబ్బంది తిన్న బిర్యానీ బిల్లు చూసి దిమ్మతిరిగిపోయింది. అసలే ఆర్థిక నష్టాల్లో ఉన్న పాక్ క్రికెట్ బోర్డుకు బిర్యానీ బిల్లు మరో తలనొప్పి తెచ్చిపెట్టింది. మరోవైపు బిల్లులు పెండింగ్ లో ఉండటంతో హోటల్ వర్గాలు లబోదిబోమంటున్నాయి. పాకిస్తాన్ పర్యటనకు వచ్చిన సందర్భంగా న్యూజిలాండ్ జట్టు ఇస్లామాబాద్ లోని ఓ హోటల్ లో బస చేసింది. కివీస్ ఆటగాళ్ల భద్రత కోసం పాక్ ప్రభుత్వం 500 మంది పోలీసులను రంగంలోకి దించింది. అయితే, న్యూజిలాండ్ జట్టు పర్యటన రద్దయిన నేపథ్యంలో ఆసక్తికర అంశం వెల్లడైంది. కేవలం భద్రతా సిబ్బంది బిర్యానీ బిల్లు 27 లక్షల రూపాయలు అయిందట. న్యూజిలాండ్ జట్టు స్వదేశానికి వెళ్లిపోవడంతో, పాక్ ప్రభుత్వం ఆ బిల్లులను పెండింగ్ లో ఉంచింది. హోటల్ నిర్వాహకులు మాత్రం లబోదిబోమంటున్నారు. భద్రతా సిబ్బందికి రోజుకు రెండు సార్లు బిర్యానీ పెట్టామని వారు వెల్లడించారు. ఈ బిర్యానీ బిల్లు ప్రస్తుతం పాక్ ఆర్థికశాఖ దగ్గర ఉందట. కమాండోలకు తోడు సరిహద్దు భద్రతాదళం పోలీసులను కూడా న్యూజిలాండ్ ఆటగాళ్ల భద్రతా ఏర్పాట్ల కోసం పిలిపించారు. వారి భోజన బిల్లులు అదనం అని హోటల్ వర్గాలు తెలిపాయి.

  భారీగా వచ్చిన ఈ బిల్లుపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఏం చేస్తుందో చూడాలి. అసలే ఆర్థికంగా నష్టాలను ఎదుర్కొంటోంది. ఇప్పటికే విదేశీ జట్లన్నీ పాక్ బోర్డుకు షాక్ ఇస్తున్నాయి. భవిష్యత్తులోనూ మ్యాచ్ లు జరిగే అవకాశం కనిపించడం లేదు. దీంతో పాక్ క్రికెట్ బోర్డు దీనిపై ఏం చేస్తుందో చూడాలి. నష్ట పరిహారం రూపంలో న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు నుంచి కొంత మొత్తం కోరే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.

  ఇదీ చదవండి: ఈ నెల 24వ తేదీన మోదీ-బైడెన్ భేటీ.. ఇద్దరి మధ్య చర్చకు వచ్చే అంశాలు ఇవే..

  పాక్ లో అంతర్జాతీయ క్రికెట్ పోటీల నిర్వహణ ఇప్పుడిప్పుడే ఊపందుకుంటోంది అనుకునేంతలో న్యూజిలాండ్, ఇంగ్లండ్ జట్లు తమ పర్యటనలు రద్దు చేసుకోవడంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చినట్టయింది. 2009లో శ్రీలంక జట్టుపై పాక్ లో ఉగ్రదాడి జరిగినప్పటి నుంచి చాన్నాళ్లపాటు విదేశీ జట్లు పాక్ లో పర్యటించ లేదు. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ జట్టు సుదీర్ఘ విరామం తర్వాత పాక్ పర్యటనకు వచ్చినా, వన్డే సిరీస్ ప్రారంభానికి కొన్ని నిమిషాల ముందు ఆ పర్యటన రద్దయింది.

  ఇదీ చదవండి : జెట్ వేగంతో దూసుకొస్తున్న మహమ్మారి.. ఎయిర్ బార్న్ డిసీజ్ గా మారే ప్రమాదం

  పాకిస్తాన్ టూర్ లో భాగంగా మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. రావల్పిండిలో తొలి వన్డే మ్యాచ్ జరగాల్సి ఉంది. ఇంతలోనే న్యూజిలాండ్ జట్టు పర్యటనను రద్దు చేసుకుని వెళ్లిపోయింది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి ఇది పెద్ద ఎదురుదెబ్బ అని తెలుసు. కానీ, తమ ప్లేయర్ల భద్రత అన్నింటికన్నా ముఖ్యం అని న్యూజిలాండ్ క్రికెట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ వైట్ అన్నారు. న్యూజిలాండ్ జట్టుకు పూర్తి భద్రత కల్పించాము, మ్యాచులు జరగాలని ఇప్పటికీ ఆశిస్తున్నాము అని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చెప్పింది.

  ఇదీ చదవండి : టీడీపీ అధినేత చంద్రబాబుకు కొత్త తలనొప్పి.. కుప్పంలో వైసీపీ గాలి దేనికి సంకేతం

  న్యూజిలాండ్ తీసుకున్న నిర్ణయం పాకిస్తాన్ బాగా నిరాశపరిచింది. పాకిస్తాన్ క్రికెట్ ఫ్యాన్స్ కూడా న్యూజిలాండ్ జట్టు నిర్ణయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. వారం రోజుల పాటు పాకిస్తాన్ లో ఉండి, చివరి నిమిషంలో టూర్ రద్దు చేసుకోవడాన్ని తప్పుపడుతున్నారు. న్యూజిలాండ్ జట్టు అనూహ్య నిర్ణయంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆర్థికంగా భారీగా నష్టపోయింది. అయితే ఇంగ్లండ్ బోర్డు మాత్రం ఇలాంటి పొరపాటుకు తావివ్వకుండా ముందే తమ నిర్ణయాన్ని స్పష్టం చేసింది.
  Published by:Nagesh Paina
  First published:

  Tags: Cricket, England, Newzealand, Pakistan, World news

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు