Home /News /sports /

winter Olympics boycott: చైనాకు డబుల్​ షాక్​.. వింటర్​ ఒలింపిక్స్​ దౌత్య బహిష్కరణలో అమెరికాతో చేతులు కలిపిన ఆస్ట్రేలియా

winter Olympics boycott: చైనాకు డబుల్​ షాక్​.. వింటర్​ ఒలింపిక్స్​ దౌత్య బహిష్కరణలో అమెరికాతో చేతులు కలిపిన ఆస్ట్రేలియా

చైనాలో వింటర్​ ఒలింపిక్స్​

చైనాలో వింటర్​ ఒలింపిక్స్​

చైనాలో జరగబోయే వింటర్ ఒలింపిక్స్ (Winter Olympics)​లో దౌత్య సంబంధమైన బహిష్కరణ (diplomatic boycott)  నిర్ణయం తీసుకుంది అమెరికా. అయితే తాజాగా ఈ లిస్టులో ఆస్ట్రేలియా కూడా చేరింది. ఈ మేరకు ఆ దేశ ప్రధాని ఓ ప్రకటన విడుదల చేసినట్లు ఏఎన్​ఐ వార్తా సంస్థ తెలిపింది. 

ఇంకా చదవండి ...
    వాయువ్య జిన్‌జియాంగ్ (Northwest Xinjiang) ప్రాంతంలో ఉయ్‌ఘర్ ముస్లిం (Uighur Muslim)లపై చైనా మారణకాండకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో వచ్చే ఏడాది (next year) ఫిబ్రవరిలో చైనా (China)లో నిర్వహించే వింటర్‌ ఒలింపిక్స్‌ క్రీడలపై ఎటువంటి నిర్ణయం తీసకువాలని వాషింగ్టన్ నెలల తరబడి తర్జనభర్జనలు పడిన తర్వాత అమెరికా చైనాకు షాక్​ (winter Olympics boycott) ఇచ్చిన సంగతి తెలిసిందే. వింటర్ ఒలింపిక్స్ (Winter Olympics)​లో దౌత్య సంబంధమైన బహిష్కరణ (diplomatic boycott)  నిర్ణయం తీసుకుంది. అయితే తాజాగా ఈ లిస్టులో ఆస్ట్రేలియా కూడా చేరింది. ఈ మేరకు ఆ దేశ ప్రధాని ఓ ప్రకటన (winter Olympics boycott) విడుదల చేసినట్లు ఏఎన్​ఐ వార్తా సంస్థ తెలిపింది. 2022 బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ లో యూఎస్​ లేవనెత్తిన దౌత్యపరమైన బహిష్కరణ (diplomatic boycott)లో తమ దేశం కూడా ఉండనున్నట్లు ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి స్కాట్ మోరిసన్ (Australian Prime Minister Scott Morrison) చెప్పారని అసోసియేటెడ్ ప్రెస్ కథనం పేర్కొంది.

    భారత్​పై ఒత్తిడి..

    కాగా, అటు అమెరికా, ఆస్ట్రేలియాలు దౌత్య పరమైన బహిష్కరణ విధించడంతో పొరుగు దేశమైన భారత్​పై కూడా ఒత్తిడి పెరిగింది. దీనిపై ఇప్పటివరకు భారత్​ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే ప్రస్తుత పరిస్థితులు, సరిహద్దుల్లో చైనా కవ్వింపుల దృష్ట్యా భారత్​ కూడా అమెరికా దారిలో నడిచే అవకాశం ఉంది.

    అమెరికా 2022 బీజింగ్ వింటర్ ఒలింపిక్స్‌ను దౌత్య సంబంధమైన బహిష్కరణ  (diplomatic boycott)  నిర్ణయాన్ని తాము గౌరవిస్తున్నట్లు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (International Olympic Committee) పేర్కొంది. ఈ మేరకు దౌత్యవేత్తలు అయిన ప్రభుత్వ అధికారుల ఉనికి ప్రతి దేశ ప్రభుత్వానికి పూర్తిగా రాజకీయ నిర్ణయం అని అందువల్ల ఆయా దేశాల రాజకీయ తటస్థ వైఖరిని పూర్తిగా గౌరవిస్తాం అని ఐఓసీ (International Olympic Committee) ప్రతినిధి అన్నారు.

    మందలింపు చర్యగా

    అయితే ఈ దౌత్యపరమైన బహిష్కరణ (diplomatic boycott) అనేది యూఎస్‌ అథ్లెట్లు (US athletes) పోటీ పడకుండా నిరోధించే చైనా మానవ హక్కుల రికార్డుకు క్రమాంకనం చేసిన మందలింపు చర్యగా యూఎస్‌ (US) అభివర్ణించింది. అంతేకాదు దౌత్యపరమైన బహిష్కరణ అంటే ఈ ఒలింపిక్‌​ క్రీడలు ప్రారంభ, ముగింపు కార్యక్రమాల్లో అమెరికా దౌత్య అధికారులను పంపకుండా ఒలింపిక్‌ ప్రాధాన్యతను తగ్గించేలా చైనాతో నేరుగా ఢీ కొనే పరంపరలో అమెరికా తీసుకున్న తొలి నిర్ణయం ఇది.



    నిశ్చయమైన ప్రతిఘటన ఉంటుందంటూ..

    ఐఓసీ కూడా అమెరికా ప్రభుత్వ ప్రకటన మేరకు ఒలింపిక్ క్రీడలు, అథ్లెట్ల భాగస్వామ్య రాజకీయాలకు అతీతమైనదని, పైగా దీనిని తాము స్వాగతిస్తున్నాం అని తెలపడం విశేషం. అంతేకాదు యూఎన్‌ జనరల్ అసెంబ్లీలో దాదాపు 193 సభ్య దేశాల ఏకాభిప్రాయంతో 173 సభ్య దేశాలు సహకారంతో ఈ తీర్మానాన్ని ఆమోదించినట్లు ఐఓసీ తెలిపింది. అయితే  అటువంటి బహిష్కరణ అమలు చేస్తే "నిశ్చయమైన ప్రతిఘటన" ఉంటుందంటూ చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ (Ministry of Foreign Affairs of China) ముందుగానే బెదిరించింది.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: America, Australia, China, Olympics, WINTER

    తదుపరి వార్తలు