Home /News /sports /

BIG NEWS BCCI IN A HUGE FIX WILL IPL 2022 BE A 9 TEAM AFFAIR NO CLEARANCE TO AHMADABAD TEAM JNK

IPL 2022: బీసీసీఐ షాకింగ్ నిర్ణయం.. ఐపీఎల్ 2022లో తొమ్మది జట్లేనా? అహ్మదాబాద్‌కు ఇంకా క్లియర్ కాని లైన్

ఐపీఎల్ 2022 సీజన్‌ను 9 జట్లతోనే నిర్వహించనున్నారా? (PC: BCCI)

ఐపీఎల్ 2022 సీజన్‌ను 9 జట్లతోనే నిర్వహించనున్నారా? (PC: BCCI)

IPL 2022: ఐపీఎల్ 2022 సీజన్‌లో బీసీసీఐ 9 జట్లతోనే నిర్వహించాలని భావిస్తున్నదా? రెండు కొత్త జట్లలో ఒకటైన అహ్మదాబాద్ టీమ్ ‌ను ఈ సారి లీగ్‌లో చేర్చడం లేదా అంటే అవుననే సమాధానం వస్తున్నది. బీసీసీఐ ఇంకా ఈ కొత్త జట్టుకు క్లియరెన్స్ ఇవ్వకపోవడమే ఇందుకు కారణం.

ఇంకా చదవండి ...
  ఐపీఎల్ సీజన్ 2022 (IPL 2022) కోసం అన్ని జట్లు ప్లేయర్ రిటెన్షన్ (Player Retention Policy) పనిలో బిజీగా ఉన్నాయి. నలుగురు ఆటగాళ్లను అట్టిపెట్టుకోవడానికి మరి కొన్ని గంటలే సమయం ఉండటంతో ఆయా ఫ్రాంచైజీలు తీవ్ర కసర్తత్తు చేస్తున్నాయి. రాబోయే సీజన్‌కు ఎవరిని తీసుకోవాలో అనే విషయంలో నిర్ణయానికి వచ్చిన జట్లు.. ఆయా ఆటగాళ్లతో బేరసారాలు కూడా సాగిస్తున్నాయి. పాత జట్లన్నీ రిటెన్షన్ పాలసీపై కుస్తీ పడుతుంటే.. కొత్త జట్లలో లక్నో టీమ్ (Lucknow Team) ఇప్పటికే స్టార్ ప్లేయర్లతో మంతనాలు సాగిస్తున్నది. కేఎల్ రాహుల్ (KL Rahul), హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్ వంటి క్రికెటర్లతో చర్చలు జరుపుతూ బిజీగా ఉన్నది. కోచ్‌గా రవిశాస్త్రిని తీసుకోవడానికి కూడా అతడితో భారీ డీల్ కుదుర్చుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇలా 9 జట్లు ఐపీఎల్ 2022 కోసం బిజీగా ఉంటుండగా.. అహ్మదాబాద్ జట్టు (Ahmedabad Team) మాత్రం అసలు ఊసే లేకుండా పోయింది. ఆ జట్టుకు ఇప్పటి వరకు బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ కూడా ఇవ్వకపోవడంతో డైలమాలో పడింది.

  బీసీసీఐ రెండు కొత్త జట్ల కోసం టెండర్లు పిలవగా లక్నో ఫ్రాంచైజీని రూ. 7090 కోట్లకు ఆర్పీ సంజీవ్ గోయెంకా గ్రూప్ బిడ్ దక్కించుకున్నది. ఇక అహ్మదాబాద్ జట్టు కోసం సీవీసీ క్యాపిటల్ అనే సంస్థ ఇరీలియా కంపెనీ లిమిటెడ్ పేరుతో రూ. 5625 కోట్లకు టెండర్ వేసి గెలుచుకున్నది. టెండర్లు ముగిసి ఇప్పటికి నెల రోజులు గడిచిపోయినా ఇప్పటి వరకు అహ్మదాబాద్ జట్టుకు బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. సీవీసీ క్యాపిటల్స్‌కు నిరభ్యంతర పత్రం ఇవ్వకపోవడంతో ఆ జట్టు ఇంత వరకు ఎలాంటి ఒప్పందాలు చేసుకోవడం లేదు.

  IND vs NZ: అతనొక ఐపీఎస్.. కాన్పూర్ పోలీస్ కమిషనర్.. కానీ స్టేడియంలో ప్రతీ రోజు ఆయన చేసే పనికి అందరూ ఆశ్చర్యం


  అహ్మదాబాద్ జట్టును దక్కించుకున్న సీవీసీ క్యాపిటల్స్ గతంలో బెట్టింగ్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టింది. దీనిపై కొన్ని పిర్యాదులు అందడంతో బీసీసీఐ అహ్మదాబాద్ జట్టును హోల్డింగ్‌లో పెట్టినట్లు తెలుస్తున్నది. ఈ విషయంలో 'ఇన్‌సైడ్ స్పోర్ట్' ప్రతినిధి బీసీసీఐ అధికారిని సంప్రదించగా ఎలాంటి సమాచారం అందలేదు. 'ఈ వ్యవహారంలో నన్ను ఏమీ ప్రశ్నించకండి. వెళ్లి బీసీసీఐ కార్యదర్శిని అడగండి. మాకు అసలు అహ్మదాబాద్ టీమ్ గురించి ఏమీ తెలియదు. అసలు సమస్య ఏంటో కూడా తెలియదు' అని సదరు అధికారి సమాధానం చెప్పాడు.

  IND vs NZ: మూడో రోజు న్యూజీలాండ్‌ భరతం పట్టిన స్పిన్నర్లు.. 296 ఆలౌట్.. అక్షర్‌కు 5 వికెట్లు.. మళ్లీ దెబ్బేసిన జేమిసన్


  మరోవైపు నవంబర్ 30తో ప్లేయర్ రిటెన్షన్ గడువు పూర్తవుతుండగా.. ఆ తర్వాత డిసెంబర్ 1 నుంచి కొత్త జట్లకు ఫ్రీ పికప్ ఆప్షన్ లభించనున్నది. కొత్త జట్లైన లక్నో, అహ్మదాబాద్ పూల్ నుంచి ముగ్గురు ఆటగాళ్లను ఎంచుకునే అవకాశం ఉన్నది. డిసెంబర్ 25లోగా ఈ జట్లకు ఫ్రీ పికప్ అవకాశం ముగుస్తుంది. ఇప్పటికే లక్నో ఫ్రాంచైజీ యాజమాన్యం ఫ్రీ పికప్‌పై పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్నది. కొంత మంది స్టార్ ప్లేయర్లతో ఒప్పందాలు కూడా చేసుకున్నది.

  Gutka Man: 'బాబూ స్టార్ స్పోర్ట్స్ కెమేరామాన్.. ఎంత పని చేశావ్ భయ్యా'.. ఒక్క రోజులో ఫేమస్ అయిన గుట్కా మ్యాన్
  కానీ అహ్మదాబాద్ పరిస్థితే అగమ్యగోచరంగా మారింది. అసలు బీసీసీఐ 10వ జట్టుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా లేదా అనేది అనుమానంగా మారింది. వీలైతే 9 జట్లతోనే ఐపీఎల్ 2022 నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తున్నది. ఎలాగూ ఐపీఎల్ 2023 నుంచి కొత్త బ్రాడ్‌కాస్టర్ వస్తాడు. అదే సమయంలో మరో జట్టును యాడ్ చేస్తే ఎలా ఉంటుందనే విషయంపై చర్చోపచర్చలు చేస్తున్నది. మరో రెండు రోజుల్లో అహ్మదాబాద్ విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నది.
  Published by:John Kora
  First published:

  Tags: Bcci, IPL 2022

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు