Glenn Maxwell : ఆస్ట్రేలియా (Australia) స్టార్ బ్యాటర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ (Glenn Maxwell) తన స్టామినా ఏంటో చూపించాడు. తాను నిలబడితే ఎలాంటి విధ్వంసం సృష్టిస్తాడో పరిచయం చేశాడు.
ఆస్ట్రేలియా (Australia) స్టార్ బ్యాటర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ (Glenn Maxwell) తన స్టామినా ఏంటో చూపించాడు. తాను నిలబడితే ఎలాంటి విధ్వంసం సృష్టిస్తాడో పరిచయం చేశాడు. ఈ బీభత్సానికి ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న బిగ్‌బాష్ లీగ్ (BBL) వేదికైంది. బౌండరీల వరద పారించి హోబర్ట్ హరికేన్స్ బౌలర్లకు పట్ట పగలే చుక్కలు చూపించాడు. ఈ క్రమంలో బిగ్‌బాష్ లీగ్ చరిత్రలోనే అత్యధిక వ్యక్తిగత స్కోర్ నమోదు చేశాడు. హరికేన్స్ బౌలర్లను ఊచకోత కోస్తూ మ్యాక్స్‌వెల్ సృష్టించిన విధ్వంసానికి బిగ్‌బాష్ చరిత్రలోనే మెల్బోర్న్ స్టార్స్ జట్టు అత్యధిక స్కోర్‌ను నమోదు చేసింది. ‘మ్యాడ్’ మ్యాక్స్ బాదుడికి మెల్బోర్న్ స్టార్స్ జట్టు, టీ20 చరిత్రలోనే మూడో అత్యధిక టీమ్ స్కోరు నమోదు చేసింది. టాస్ గెలిచిన హోబర్ట్ హరికేన్స్ కెప్టెన్ మాథ్యూ వేడ్, ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన మెల్బోర్న్ స్టార్స్, నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 273 పరుగుల భారీ స్కోరు చేసింది.
బిగ్‌బాష్ లీగ్‌లో మెల్బోర్న్ స్టార్స్, హోబర్ట్ హరికేన్స్ మధ్య నేడు మెల్బోర్న్ వేదిక మ్యాచ్ జరిగింది. టోర్నీలో ఇది 56వ మ్యాచ్. టాస్ ఓడిన మెల్బోర్న్ బ్యాటింగ్‌కు దిగింది. ఆ జట్టు కెప్టెన్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఓపెనర్‌గా వచ్చాడు. ఆరంభం నుంచే ధాటిగా ఆడిన మ్యాక్స్‌వెల్ హరికేన్స్ బౌలర్లపై ముప్పేట దాడి చేశాడు. .
వరుసగా బౌండరీలు బాదుతూ హరికేన్స్ బౌలర్లను ముప్ప తిప్పలు పెట్టాడు. ఈ క్రమంలో 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. హాఫ సెంచరీ అనంతరం మరింత చెలరేగిన మ్యాక్స్‌వెల్ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలో 41 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ బిగ్‌బాష్ సీజన్లో ఇది రెండో సెంచరీ.
సెంచరీ తర్వాత మరింత రెచ్చిపోయిన మ్యాక్స్‌వెల్ పరుగుల సునామీ సృష్టించాడు. మ్యాక్స్‌వెల్ విశ్వరూపంతో బంతులు ఎక్కడ వేయాలో అర్థం కాక హరికేన్స్ బౌలర్లు ముప్ప తిప్పలు పడుతూ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. మొత్తం 64 బంతులు ఎదుర్కొన్న మ్యాక్స్‌వెల్ 154 పరుగులతో అజేయంగా నిలిచాడు. మ్యాక్స్‌వెల్ ఇన్నింగ్స్‌లో ఏకంగా 22 ఫోర్లు, 4 సిక్స్‌లు ఉన్నాయి.
154 పరుగులు చేయడం ద్వారా బిగ్‌బాష్ లీగ్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ నమోదు చేసిన ఆటగాడిగా రికార్డు నమోదు చేశాడు. అంతేకాకుండా ఈ టోర్నీలో 150 పరుగులు చేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు. అలాగే ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక బౌండరీలు బాదిన ఆటగాడిగా రికార్డుల పుట్టల్లోకి ఎక్కాడు. ఈ మ్యాచ్‌లో మ్యాక్స్‌వెల్ ఏకంగా 240 స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్ చేయడం విశేషం.
మ్యాక్స్వెల్విశ్వరూపానికి తోడు స్టోయినిస్ కూడా విధ్వంసం సృష్టించాడు. మ్యాచ్‌లో మొత్తంగా 31 బంతులు ఎదుర్కొన్న స్టోయినీస్ 6 సిక్స్‌లు, 4 ఫోర్లతో 75 పరుగులతో అజేయంగా నిలిచాడు.మ్యాక్స్‌వెల్, స్టోయినిస్ కలిసి మూడో వికెట్‌కు అజేయంగా 54 బంతుల్లోనే 132 పరుగులు జోడించారు. అంతకు ముందు మరో ఓపెనర్ క్లార్క్ 3 ఫోర్లు, ఒక సిక్స్‌తో 18 బంతుల్లోనే 35 పరుగులు చేశాడు.
ఇలా మ్యాక్స్‌వెల్, స్టోయినిస్, క్లార్క్ విధ్వంసంతో నిర్ణీత 20 ఓవర్లలో మెల్బోర్న్ స్టార్స్ 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 273 పరుగుల భారీ స్కోర్ సాధించింది. బిగ్‌బాష్ లీగ్ చరిత్రలో ఇదే అత్యధిక స్కోర్. మొత్తంగా టీ20 చరిత్రలో ఇది మూడో అత్యధిక స్కోర్. ఈ మ్యాచ్‌లో మెల్బోర్న్ బ్యాటర్లను కట్టడి చేయడానికి హరికేన్స్ జట్టు 8 మందితో బౌలింగ్ చేయించిన ఏ మాత్రం ఫలితం లేకపోయింది.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.