US Open 2019 : సెరెనాకు షాక్... ఫైనల్‌లో గెలిచిన బియాంకా ఆండ్రీస్కూ...

US Open 2019 : అమెరికా టెన్నిస్ దిగ్గజం సెరెనా విలియమ్స్ ఫైనల్‌లో గెలుస్తుందని అంతా అంచనా వేశారు. ఐతే... అద్భుత ఆటతీరుతో... బియాంకా ఆండ్రీస్కూ టైటిల్ సాధించింది.

Krishna Kumar N | news18-telugu
Updated: September 8, 2019, 6:29 AM IST
US Open 2019 : సెరెనాకు షాక్... ఫైనల్‌లో గెలిచిన బియాంకా ఆండ్రీస్కూ...
US Open 2019 : అమెరికా టెన్నిస్ దిగ్గజం సెరెనా విలియమ్స్ ఫైనల్‌లో గెలుస్తుందని అంతా అంచనా వేశారు. ఐతే... అద్భుత ఆటతీరుతో... బియాంకా ఆండ్రీస్కూ టైటిల్ సాధించింది.
  • Share this:
US Open 2019 : యూఎస్ ఓపెన్ ఫైనల్‌లో కెనడా అమ్మాయి బియాంకా ఆండ్రీస్కూ విజయం సాధించినా... ప్రపంచం మొత్తం... ఫైనల్‌లో అమెరికా టెన్నిస్ దిగ్గజం సెరెనా ఓడిపోయిందన్న అంశాన్నే హైలెట్ చేస్తున్నాయి. అదీ విలియమ్స్ సిస్టర్స్‌లో ఒకరైన సెరెనా విలియమ్స్‌ ప్రత్యేకత. 2017లో ఆస్ట్రేలియా ఓపెన్ గెలిచి... కెరీర్‌లో 23వ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ సాధించిన సెరెనా... అప్పటి నుంచీ మూడుసార్లు గ్రాండ్ స్లామ్ టోర్నీల్లో ఫైనల్ చేరినా... ఓటమినే చూసింది. ఇప్పుడు సొంతగడ్డపై మరోసారి అదే ఫలితం కనిపించింది. సెరెనా గెలిచివుంటే... 24 టైటిల్స్‌తో మార్గరెట్‌ కోర్ట్‌ సరసన నిలిచేది. అలాంటిది కెనడా టీనేజర్‌ బియాంకా ఆండ్రీస్కూ షాక్ ఇచ్చినట్లైంది. ఆటలోనూ, అనుభవంలోనూ సెరెనాతో పోలికే లేని ఆండ్రీస్కూ టైటిల్ సాధించడం సంచలనం అనే చెప్పుకోవాలి. సెమీ ఫైనల్స్‌లో స్వితోలినాను అలవోకగా చిత్తుచేసిన సెరెనా... 15వ సీడ్ బియాంక విషయంలో మాత్రం పోరాడి ఓడిపోయింది.

తొలిసారి యూఎస్ ఓపెన్ ఆడిన బియాంక... 8వ సీడ్ సెరెనాను... 6-3, 7-5తో వరుస సెట్లలో విజయం సాధించి... గ్రాండ్ స్లామ్ సాధించిన తొలి కెనడా అమ్మాయిగా చరిత్ర సృష్టించింది. ఇదివరకు ఆడిన రెండు గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలలో రెండో రౌండ్‌ కూడా దాటని ఆండ్రీస్కూ తొలిసారి గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్‌‌లో గెలిచి... ఛాంపియన్‌గా నిలిచింది.


ఈ విజయం ద్వారా ఆండ్రీస్కూ... రూ.27 కోట్ల ప్రైజ్ మనీ సొంతం చేసుకుంది. ఇప్పటివరకూ తన కెరీర్‌ మొత్తం చూసుకున్నా ఆమె ఇంత మనీ సంపాదించలేదు. ఈ ఒక్క విజయం ఆమె జీవితాన్నే మార్చేస్తోంది. 2017లో తల్లి అయిన సెరెనాకి... ఇటీవలే 38 ఏళ్లు నిండాయి. 24వ గ్రాండ్ స్లామ్ కోసం మళ్లీ ఆమె పోరాడక తప్పని పరిస్థితి ఏర్పడింది.
First published: September 8, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading