Cricket: సన్ రైజర్స్‌లో ఆడడం వల్లే నాలో మార్పు వచ్చింది...పేసర్ భువీ...

ఐపీఎల్ ప్రదర్శనే తనలో ఆత్మవిశ్వాసం పెంచిందని, తీవ్ర ఒత్తిడి సమయంలో ఎలా బౌలింగ్‌ చేయాలో కూడా నేర్చుకున్నానని భువనేశ్వర్‌ వ్యాఖ్యానించాడు.

news18-telugu
Updated: June 30, 2020, 11:08 PM IST
Cricket: సన్ రైజర్స్‌లో ఆడడం వల్లే నాలో మార్పు వచ్చింది...పేసర్ భువీ...
రివ్యూ కోల్పోయిన భారత్
  • Share this:
సన్‌రైజర్స్‌తో జత కట్టిన తర్వాతే తనలో మార్పు వచ్చిందని టీమిండియా పేస్ బౌలర్ భువనేశ్వర్‌ కుమార్‌ పేర్కొన్నాడు. ఐపీఎల్ ప్రదర్శనే తనలో ఆత్మవిశ్వాసం పెంచిందని, తీవ్ర ఒత్తిడి సమయంలో ఎలా బౌలింగ్‌ చేయాలో కూడా నేర్చుకున్నానని భువనేశ్వర్‌ వ్యాఖ్యానించాడు. ‘మొదటి నుంచి కూడా యార్కర్లు నా బలం. వాటిని బాగానే ఉపయోగించినా ఆ తర్వాత పట్టు చేజార్చుకునేవాడిని. ప్రారంభ ఓవర్లలో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయాల్సినప్పుడు, డెత్‌ ఓవర్లలో పరుగులు నిరోధించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు నేనే ఎక్కువగా బౌలింగ్‌ చేశాను. దాని వల్ల నాకు ఎంతో మేలు జరిగింది. తీవ్రమైన ఒత్తిడిలోనూ మెరుగ్గా బౌలింగ్‌ ఎలా చేయాలో నేర్చుకోగలిగాను’ అని భువనేశ్వర్‌ చెప్పాడు.

ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తరుపున ఆడిన పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ అనేక విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. ఇన్నింగ్స్‌ ఆరంభంలో, చివర్లో కీలక వికెట్లు తీసి జట్టుకు విజయాలు అందించాడు. 2014 నుంచి సన్‌రైజర్స్‌ జట్టు తరఫున ఆడుతున్న భువనేశ్వర్ 6 సీజన్లలో 86 మ్యాచ్‌లు ఆడి 109 వికెట్లు పడగొట్టాడు.
First published: June 30, 2020, 11:08 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading