రిపోర్టర్: బాలకృష్ణ
లొకేషన్: హైదరాబాద్
అంతర్జాతీయ స్టార్ గా ఎదగాలనేది తన చిరకాల కల. అది ఎంత కష్టమో తెలుసు... అందుకు ఎంత శ్రమ పడాలో తెలుసు... అయితే లక్ష్యాన్ని చూసి భయపడలేదు. వెనుకడుగు వేయలేదు. లక్ష్యసాధన కోసం శ్రమించాడు. చివరికి టార్గెట్ రీచ్ అయ్యాడు. స్టార్ క్రికెటర్ గా ఎదిగాడు... చివరికి ఐపీఎల్ 2023 (IPL 2023) వేలంలో అందరి దృష్టి తనపైన పడేందుకు... బడా ఫ్రాంచైజీలు తన కోసం పోటీ పడేలా చేసుకున్నాడు.
టీమిండియా జీరోస్.. ఐపీఎల్ హీరోస్.. ధనాధన్ లీగ్ అంటే చాలు ఈ ప్లేయర్స్ రెచ్చిపోతారు
భగత్ వర్మ (Bhagath Varma)... హైదరాబాద్ (Hyderabad)కు చెందిన ఈ యంగ్ ప్లేయర్.. స్టార్ క్రికెటర్ల సరసన ఆడాలని ఎన్నో కలలు కన్నాడు. అందుకు తీవ్రంగా శ్రమించాడు. దేశవాళి క్రికెట్ లో మెరుగైన గణాంకాలతో అందరి దృష్టి ఆకర్షించాడు. చివరికి ఐపీఎల్ వేలం పాటలో ధోనీ (MS Dhoni) సారధ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో స్థానం సంపాదించాడు భగత్ వర్మ.
కుమారుడు సాధించిన విజయంతో భగత్ తల్లిదండ్రులు ఉబ్బితబ్బిబవుతున్నారు. తన కుమారుడి కష్టానికి తగిన ఫలితం లభించింది అంటూ భగత్ తల్లి ఉమాదేవి సంతోషం వ్యక్తం చేశారు. తన కుమారుడి ఎదుగుదలకు ఎంతో సహకరించిన కోచ్‌కు కృతజ్ఞతలు తెలిపారు ఉమాదేవి. చిన్నప్పటి నుంచే పిల్లలకు సరైన తర్ఫీదు ఇస్తే... వారు ఎంచుకున్న రంగంలో తప్పకుండా లక్ష్యాన్ని చేరుతారన్నారు.
సీఎస్కేతో మ్యాచ్.. గుజరాత్ టైటాన్స్ కు బిగ్ షాక్.. ఆ ప్లేయర్ ఆడటం లేదు
చిన్నతనం నుంచి క్రికెట్ అంటే భగత్ కు ఇష్టమంటున్న ఉమాదేవి... మూడో తరగతిలోనే క్రికెట్ మ్యాచ్ ఆడటం ప్రారంభించాడంటున్నారు. 3వ తరగతిలోనే వన్డే లీగ్ ట్రోఫీలు భగత్ ఆడేవాడన్నారు. భగత్ ఎదుగుదలతో కోచ్ జాన్ మనోజ్ పాత్ర కీలకమన్నారు. తాను చదివిన స్కూల్ జట్టుకు కెప్టెన్సీ బాధ్యతలు కూడా చేపట్టాడని... రెండేళ్ల పాటు కెప్టెన్ గా వ్యవహరించినట్లు వెల్లడించారు. వాస్తవానికి తొలి నుంచి ధోనీ ఆటకు భగత్ బిగ్ ఫ్యాన్. చివరికి కేవలం బాల్ బాయ్ గా అయినా సరే... ధోనీని దగ్గరగా చూసే అవకాశం వస్తే చాలు అని అనుకున్నాడు. కానీ అలాంటి ధోనీతో కలిసి ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరఫున భగత్ వర్మ ఆడటం చూస్తుంటే... ఇది కదా లక్ష్యాన్ని చేరుకోవడం అనే మాట గుర్తుకు వస్తోంది.
విజయ్ హజారే రంజీ ట్రోఫీలో మ్యాచ్ ఆడుతున్న సమయంలో... చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఎంపిక కావడం పట్ల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్లతో తమ కుమారుడు ఆడుతున్నాడనే మాట... ఇప్పటికీ నమ్మలేక పోతున్నామంటున్నారు భగత్ వర్మ తల్లి ఉమాదేవి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bhagath Varma, Hyderabad, IPL 2023, Local News