హోమ్ /వార్తలు /క్రీడలు /

Viral Video : ఇదేమీ బౌలింగ్ యాక్షన్ రా నాయనా.. నా బెటర్ వర్షన్ లా ఉన్నావ్ : భజ్జీ

Viral Video : ఇదేమీ బౌలింగ్ యాక్షన్ రా నాయనా.. నా బెటర్ వర్షన్ లా ఉన్నావ్ : భజ్జీ

Photo Credit /Instagram

Photo Credit /Instagram

Viral Video : అప్పుడప్పుడూ క్రికెట్‌లో సూపర్ మూమెంట్స్ జరుగుతుంటాయి. ఫీల్డర్స్ మెరుపు విన్యాసాలు కావొచ్చు. వికెట్ కీపర్ల నైపుణ్యాలు కావచ్చు.. బ్యాట్స్‌మెన్ల అద్భుతమైన షాట్స్ కావొచ్చు.. ఇలా ఎన్నో జరుగుతాయి. అలాగే క్రికెటర్ల వింత షాట్లు, బౌలింగ్ యాక్షన్ లు గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇక క్రికెట్‌లో డిఫరెంట్ బౌలింగ్ యాక్షన్ కలిగిన బౌలర్లు ఎందరో ఉన్నారు.

ఇంకా చదవండి ...

అప్పుడప్పుడూ క్రికెట్‌లో సూపర్ మూమెంట్స్ జరుగుతుంటాయి. ఫీల్డర్స్ మెరుపు విన్యాసాలు కావొచ్చు. వికెట్ కీపర్ల నైపుణ్యాలు కావచ్చు.. బ్యాట్స్‌మెన్ల అద్భుతమైన షాట్స్ కావొచ్చు.. ఇలా ఎన్నో జరుగుతాయి. అలాగే క్రికెటర్ల వింత షాట్లు, బౌలింగ్ యాక్షన్ లు గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇక క్రికెట్‌లో డిఫరెంట్ బౌలింగ్ యాక్షన్ కలిగిన బౌలర్లు ఎందరో ఉన్నారు. వీరిలో చాలా మంది తమ విభిన్నమైన శైలితో‌ సక్సెస్ అయ్యారు. శ్రీలంక స్టార్ పేసర్ లసిత్ మలింగా, భారత్ యార్కర్ల కింగ్ జస్‌ప్రీత్ బుమ్రా, అఫ్టానిస్థాన్ సెన్సేషన్ రషీద్ ఖాన్ ఇదే జాబితాలోకి వస్తారు. ఇక, వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కూడా డిఫరెంట్ స్టైల్ లో బౌలింగ్ చేస్తాడు. వినూత్నమైన యాక్షన్ తో ప్రత్యర్థి బ్యాట్స్ మెన్ ని బోల్తా కొట్టించేవాడు. అయితే వీరందరి కంటే విలక్షణమైన బౌలింగ్ యాక్షన్‌ చేయాలనుకున్నాడు ఓ ఆటగాడు. ఆ వీడియో కాస్తా హర్భజన్ సింగ్ కు దొరికింది. ఇంకేముంది..ఆ వీడియో భజ్జీ పా కు నవ్వులు తెప్పించింది. ఈ వీడియోను ఇన్ స్టా వేదికగా షేర్ చేశాడు భజ్జీ.

ఆ వీడియోలో ఓ లోకల్ బౌలర్ హర్భజన్ సింగ్ ను పోలి ఉన్న యాక్షన్ తో బౌలింగ్ వేశాడు. ఇందులో ట్విస్ట్ ఏముంది అనుకుంటున్నారా. వీడియో చూస్తే మీకే అర్ధమవుతోంది. ఒకే యాక్షన్ తో ఐదు సార్లు రిపీట్ చేశాడు ఆ బౌలర్. పాపం, ఆ బ్యాట్స్ మన్ కు ఆ బౌలింగ్ యాక్షన్ అర్ధం కానుంటోంది. దీంతో వెంటనే, బ్యాటింగ్ చేయకుండా తప్పుకున్నాడు. భజ్జీ షేర్ చేసిన వీడియో ఇప్పుడు తెగ వైరలవుతోంది.


ఇక, హర్బజన్ సింగ్ త్వరలోనే ఫ్రెండ్ షిప్ మూవీ ద్వారా తెరంగేట్రం చేయనున్నాడు. ఈ సినిమాలో ఓ మాస్ స్టూడెంట్ గా భజ్జీ కన్పించున్నాడు. ఈ సినిమాలో భజ్జీ డ్యాన్స్ లు, ఫైట్లు ఇరగదీశాడన్న టాక్ కూడా విన్పిస్తోంది.

First published:

Tags: Cricket, Harbhajan singh, Viral Video

ఉత్తమ కథలు