IPL 2021: ఇదేం హెయిర్‌ స్టయిల్‌రా నాయనా.. షిమ్రోన్ హెట్‌మెయర్ జుట్టు రంగుపై నెటిజన్ల సెటైర్లు

హెట్‌మెయర్ హెయిర్‌స్టైల్‌పై జోకులు (PC: DC)

  • Share this:
    ఐపీఎల్ (IPL 2021) అంటేనే ఆటతో పాటు వినోదం కూడా మస్తుగా ఉంటుంది. చాలా మంది మ్యాచ్‌ల కంటే అక్కడ జరిగే ఫన్నీ ఇన్సిడెంట్స్ చూడటానికి ఇష్టపడుతుంటారు. ఇక కాంట్రవర్సీలు అనేవి ప్రతీ సీజన్‌లనూ జరుగుతూనే ఉన్నాయి. వికెట్లు తీసినప్పుడు బౌలర్లు జరిపే సంబరాలు.. హాఫ్ సెంచరీ, సెంచరీ బాదినపుడు బ్యాట్స్‌మాన్ చేసే అభినందనలు ఒక్కోసారి సరదా పుట్టిస్తుంటాయి. ఇవన్నీ పక్కన పెడితే ఐపీఎల్‌లో ఆడే క్రికెటర్లు అనేక మంది తమ స్టైలింగ్‌తో ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుంటారు. ఎంఎస్ ధోనీ (MS Dhoni) ప్రతీ సీజన్‌లో వెరైటీ హెయిర్ కట్‌తో అభిమానులను అలరించడం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) ఆటగాడు షిమ్రోన్ హెట్‌మెయర్ (Shimron Hetmyer) హెయిర్ స్టైల్ చూసి అందరూ తెగ నవ్వుతున్నారు. జుట్టుకు రంగులేయడం సర్వసాధారణంగా జరిగేదే. వెస్టిండీస్ ఆటగాళ్ల హెయిర్ స్టయిల్ చాలా వెరైటీగా ఉంటుంది. వాళ్లు జుట్టుకు పలు రకాల రంగులు వేసి ఫంకీ స్టైల్ గుర్తుకు తెస్తుంటారు.

    బుధవారం సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు షిమ్రోన్ హెట్‌మెయర్ బ్లూ రంగు జుట్టుతో కనిపించాడు. టాప్‌లో గుండ్రగా బ్లూ రంగు వేసిన హెట్‌మెయర్ చుట్టూ నల్ల జుట్టును అలాగే ఉంచేశాడు. అతడి హెయిర్ స్టైల్ చూసిన క్రికెట్ ఫ్యాన్ తెగ ఆశ్చర్యపోయారు. హెట్‌మెయర్ ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేశాయి. ఆ ఫొటోలతో నవ్వు తెప్పించే మీమ్స్ చేశారు. అంతే కాకుండా అభిమానులు హెట్‌మెయర్‌పై జోకులు కూడా వేసుకుంటున్నారు. ఢిల్లీ జెర్సీ రంగునే జట్టుకు వేసుకొని జట్టుతో తనకు ఉన్న అనుబంధాన్ని చూపించాడు అని కొంత మంది కామెంట్లు పెడుతున్నారు.

    Cricket Law: క్రికెట్ నుంచి 'బ్యాట్స్‌మాన్' అనే పదం తొలగింపు.. సంచలన నిర్ణయం తీసుకున్న ఎంసీసీ


     
























    ఇక హెట్‌మెయర్ టీవీ స్క్రీన్‌పై కనపడగానే కామెంట్రీ బాక్సులో ఉన్న సునిల్ గవాస్కర్ మాజీ వెస్టిండీస్ ప్లేయర్ ఇయాన్ బిషప్‌తో సరదా చాట్ చేశాడు. ఇలా చేయాలని ఎప్పుడైనా అనుకున్నావా అని అడిగాడు. అయితే మా కాలంలో ఇలా చేసే వాళ్లం కాదు. ఇప్పటి కుర్రాళ్లలో టాలెంట్‌తో పాటు ఇలాంటి వినూత్న ఐడియాలను ఫాలో అయ్యే ధైర్యం కూడా ఉంటుందని బిషప్ జవాబిచ్చాడు. కాగా. హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో హెట్‌మెయర్‌కు బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. టాపార్డర్ బ్యాట్స్‌మాన్ జట్టును గెలిపించడంతో హెట్‌మెయర్ డగౌట్‌కు పరిమితం అయ్యాడు. అయితే ఫీల్డింగ్ చేసే సమయంలో మాత్రం చురుకుగా కనిపించాడు.
    Published by:John Naveen Kora
    First published: