మీ నగరాన్ని ఎంచుకోండి

    Telugu Titans vs Bengaluru Bulls : ప్చ్.. మళ్లీ నిరాశే.. తెలుగు టైటాన్స్ - బుల్స్ మ్యాచ్ టై..

    Telugu Titans vs Bengaluru Bulls : ప్చ్.. మళ్లీ నిరాశే. గెలుపు కోసం శతవిధాలా ప్రయత్నిస్తోన్న తెలుగు టైటాన్స్ కు మరోసారి నిరాశ ఎదురైంది. గెలవాల్సిన మ్యాచ్ లో అనవసరపు తప్పిదాలతో 34-34 స్కోరుతో మ్యాచ్ ను టై చేసుకుంది. తెలుగు యంగ్ రైడర్ అంకిత్ బెన్వాల్ సూపర్ షో తో చేసినా తెలుగు టైటాన్స్ కు గెలుపు దక్కలేదు. అంకిత్ బెన్వాల్ 10 పాయింట్లు సాధించాడు.

  • News18 Telugu
  • | January 01, 2022, 21:43 IST
    facebookTwitterLinkedin
    LAST UPDATED A YEAR AGO

    AUTO-REFRESH

    Highlights

    21:43 (IST)
    21:40 (IST)

    Telugu Titans vs Bengaluru Bulls :  ప్చ్.. మళ్లీ నిరాశే. గెలుపు కోసం శతవిధాలా ప్రయత్నిస్తోన్న తెలుగు టైటాన్స్ కు మరోసారి నిరాశ ఎదురైంది. గెలవాల్సిన మ్యాచ్ లో అనవసరపు తప్పిదాలతో 34-34 స్కోరుతో మ్యాచ్ ను టై చేసుకుంది. తెలుగు యంగ్ రైడర్ అంకిత్ బెన్వాల్ సూపర్ షో తో చేసినా తెలుగు టైటాన్స్ కు గెలుపు దక్కలేదు. అంకిత్ బెన్వాల్ 10 పాయింట్లు సాధించాడు.

    21:14 (IST)
    21:13 (IST)

    తెలుగు టైటాన్స్ లో యంగ్ రైడర్ అంకిత్ బెన్వాల్ దుమ్మురేపుతున్నాడు. 9 పాయింట్లతో తెలుగు టైటాన్స్ ను ఆధిక్యంలో నిలిపాడు. ప్రస్తుతం 21-19 తో తెలుగు టైటాన్స్ ఆధిక్యంలో ఉంది. 

    21:7 (IST)

    ఈ మ్యాచ్ లో బెంగళూరు బుల్స్ ఫస్ట్ ఆలౌట్ అయింది. దీంతో, తెలుగు టైటాన్స్ లీడ్ లోకి వచ్చింది. ప్రస్తుతం 18-16తో తెలుగు టైటాన్స్ ఆధిక్యంలోకి వెళ్లింది. 

    21:4 (IST)
    20:58 (IST)

    ఫస్టాఫ్ ముగిసే సమయానికి బెంగళూరు బుల్స్ లీడింగ్ లో ఉంది. కెప్టెన్ రోహిత్ కుమార్ ఫామ్ లోకి లేకపోవడం తెలుగు టైటాన్స్ కు మైనస్ గా మారింది. మరోవైపు, బాహుబలి రైడర్ సిద్ధార్ధ్ దేశాయ్ కూడా మ్యాచ్ లో లేకపోవడం తెలుగు టైటాన్స్ కు నష్టం కలిగించింది. ప్రస్తుతం 14-12 ఆధిక్యంలో ఉంది బెంగళూరు బుల్స్. 

    20:52 (IST)

    సూపర్ ట్యాకిల్ తో మళ్లీ ఆధిక్యంలోకి వచ్చింది బెంగళూరు బుల్స్. ప్రస్తుతం 10-9 స్కోరుతో ఆధిక్యంలో ఉంది బుల్స్.

    20:49 (IST)

    తెలుగు టైటాన్స్ లో రాకేశ్ గౌడ అద్భుతంగా రైడింగ్ చేస్తున్నాడు. కూతకు వెళ్లి పాయింట్లు సాధిస్తున్నాడు. ప్రస్తుతం 5-8 స్కోరుతో తెలుగు టైటాన్స్ ఆధిక్యంలో ఉంది. 

    20:45 (IST)

    ప్రతి పాయింట్ కోసం రెండు జట్లు హోరాహోరీగా తలపడుతున్నాయ్. ప్రస్తుతం స్కోరు 4-4 

    ప్రొ క‌బ‌డ్డీ లీగ్ (PKL 8 Season) ఆరంభంలోనే ర‌స‌వ‌త్త‌రంగా సాగుతుంది. క‌రోనా కార‌ణంగా దాదాపు రెండేళ్ల‌పాటు దూర‌మైన లీగ్.. ఆ లోటును భ‌ర్తీ చేస్తూ అభిమానుల‌కు ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందిస్తోంది. కబడ్డీ ప్రేమికులను ఎంతగానో ఆకట్టుకున్న ప్రో కబడ్డీ లీగ్ ఎనిమిదో సీజన్ బెంగళూరు వేదికగా జరుగుతోంది. కరోనా నిబంధనల నడుమ జరుగుతున్న ఈ లీగ్ లో ప్రతి జట్టు విజయం కోసం ఆఖరి వరకు పోరాడుతున్నాయ్. గెలుపు దక్కించుకోవడం కోసం తగ్గేదే లే అన్నట్టుగా తాడో పేడో తేల్చుకుంటున్నాయ్. 8వ సీజన్ లో టైటిల్‌ను కైవసం చేసుకునేందుకు 12 జట్లు తలపడనున్నాయి. ఇక, తెలుగు టైటాన్స్ పరిస్థితి దారుణంగా ఉంది. టై తో ఈ సీజన్ మొదలు పెట్టిన తెలుగు టైటాన్స్ ఆ తర్వాత రెండు మ్యాచులు వరుసగా ఓటమి పాలైంది. దీంతో, తెలుగు టైటాన్స్ కు బోణీ కొట్టడం ఎంతో కీలకం. ఈ నేపథ్యంలో ఇవాళ బెంగళూరు బుల్స్ తో అమీతుమీ (Telugu Titans Vs Bengaluru Bulls) తేల్చుకోనుంది తెలుగు టైటాన్స్.

    2018 (ఆరో సీజన్)లో బెంగళూరు బుల్స్‌ని విజేతగా నిలిపిన రోహిత్ కుమార్‌ని జట్టులోకి తీసుకోవడం ద్వారా వ్యూహాత్మకంగా వ్యవహరించిన తెలుగు టైటాన్స్.. అతనికి కెప్టెన్సీ బాధ్యతలూ అప్పగించింది. అలానే మెరుగైన డిఫెండర్లుగా కితాబులు అందుకున్న సందీప్, సురీందర్, అరుణ్‌ని జట్టులో కీ ప్లేయర్లు. ఇక ప్రొ కబడ్డీ లీగ్ బాహుబలిగా పేరొందిన సిద్ధార్థ్ దేశాయ్‌ జట్టులో ఎలానూ ఉన్నాడు. అయితే, సిద్ధార్ధ్ దేశాయ్ ఒక్కడే తెలుగు టైటాన్స్ లో రాణిస్తున్నాడు. కెప్టెన్ రోహిత్ కుమార్ ఫామ్ అందుకోవాల్సిన సమయం వచ్చింది. కీలక సమయాల్లో డిఫెన్స్ లో తప్పిదాలు చేసి మ్యాచ్ ను చేజార్చుకుంటోంది తెలుగు టైటాన్స్. ఈ తప్పులు సరిచేసుకుంటే.. తొలి విజయాన్ని నమోదు చేసే అవకాశం ఉంది.

    మరోవైపు, బెంగళూరు బుల్స్ తో ఈ సీజన్ ను ఘనంగా ప్రారంభించింది. ఆడిన నాలుగు మ్యాచుల్లో మూడు గెలిచి.. ఒకటి ఓడింది. దీంతో, పాయింట్ల టేబుల్ లో మూడో స్ధానంలో నిలిచింది. గత మ్యాచ్ హర్యానా స్టీలర్స్ ను 42-28 తేడాతో చిత్తు చేసి సూపర్ ఫామ్ లో ఉంది బెంగళూరు బుల్స్. పవన్ షెహరావత్ .. బెంగళూరు టీమ్ లో సూపర్ ఫామ్ లో ఉన్నాడు. గత మ్యాచులో ఏకంగా 22 పాయింట్లు సాధించాడు ఈ బుల్. మయూర్ జగన్నాథ్, చంద్రన్ రంజిత్, సౌరబ్ నందాల్ వంటి స్ట్రాంగ్ ప్లేయర్లు బెంగళూరు సొంతం.

    హెడ్ టు హెడ్ రికార్డులు :

    హెడ్ టు హెడ్ రికార్డుల్లో బెంగళూరు బుల్స్.. తెలుగు టైటాన్స్ కు అందనంత ఎత్తులో ఉంది. ఇరు జట్లు 17 సార్లు తలపడగా.. 11 సార్లు బెంగళూరు గెలవగా.. మూడు మ్యాచుల్లో మాత్రమే తెలుగు టైటాన్స్ నెగ్గింది. మరో మూడు మ్యాచులు టైగా ముగిశాయ్.

    ఆడే ఏడుగురి ప్లేయర్ల అంచనా:

    తెలుగు టైటాన్స్ : సిద్ధార్ధ్ దేశాయ్, రోహిత్ కుమార్/ అంకిత్ బెనివాల్, రాకేశ్ గౌడ, సురీందర్ సింగ్ / ఆదర్శ్ టి, సి అరుణ్, రుతురాజ్ కొరవై, సందీప్ కొండల,

    బెంగళూరు బుల్స్ : పవన్ షెహరావత్, మయూర్ జగన్నాథ్, మహేందర్ సింగ్, చంద్రన్ రంజిత్, సౌరభ్ నందల్, అమన్, భరత్/ మోర్ జి

    పూర్తి స్క్వాడ్స్ :

    తెలుగు టైటాన్స్ జట్టు:

    రైడర్స్: అమిత్ చౌహాన్, అంకిత్ బేనివాల్, గల్లా రాజు, హ్యున్సూ పార్క్, రజినీశ్, రాకేశ్ గౌడ, రోహిత్ కుమార్, సిద్దార్థ్ దేశాయ్

    డిఫెండర్స్: ఆకాశ్ దత్తు అర్సుల్, ఆకాశ్ చౌదరి, మనీశ్, ఆదర్శ్ టి, సి. అరుణ్, ప్రిన్స్ డి, రుతురాజ్ కొరవి, సురీందర్ సింగ్, ఎస్తురో అబే, సందీప్ కండోలా

    బెంగళూరు బుల్స్ జట్టు:

    రైడర్స్: అబుల్ ఫజల్ మగ్సోదుల్ మహాలి, బాంటీ, చంద్రన్ రంజిత్, దీపక్ నర్వాల్, డోంగ్ జియోన్ లీ, మోర్ జీబీ, పవన్ సెహరావత్

    డిఫెండర్స్: మయూర్ కదమ్, మోహిత్ సెహరావత్, మహేందర్ సింగ్, జియావుర్ రెహ్మాన్, సౌరభ్ నందల్, అమిత్ షెరోన్, అంకిత్, వికాస్