పాపం బెన్ కట్టింగ్...క్యాచ్ మిస్ అయింది...ఫేస్ పగిలింది

క్యాచ్‌లు ఎలా పట్టాలో ఇంటర్నేషనల్ క్రికెట్‌లో ఒక బెంచ్ మార్క్ సెట్ చేసిన దేశం ఆస్ట్రేలియా. ఆ దేశానికి చెందిన క్రికెటర్లు క్యాచ్‌లు మిస్ చేయడం చాలా అరుదు.

news18-telugu
Updated: January 10, 2019, 7:54 PM IST
పాపం బెన్ కట్టింగ్...క్యాచ్ మిస్ అయింది...ఫేస్ పగిలింది
ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ బెన్ కట్టింగ్ ( FOX cricket/twitter )
news18-telugu
Updated: January 10, 2019, 7:54 PM IST
ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ బెన్ కట్టింగ్‌ క్యాచ్ పట్టబోయి ముఖం పగలగొట్టుకున్నాడు. ఎన్నో కళ్లు చెదిరే క్యాచ్‌లు, డైవ్ క్యాచ్‌లు పట్టిన బెన్‌...ఓ సునాయాస క్యాచ్ పట్టలేకపోయాడు. ప్రస్తుతం బిగ్ బాగ్‌ లీగ్‌ 8వ సీజన్‌లో బ్రిస్బేన్ హీట్ జట్టుకు ఆడుతున్న బెన్...మెల్‌బోర్న్ రెనెగేడ్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో గాయపడ్డాడు. మెల్‌బోర్న్ టీమ్ బ్యాటింగ్ చేస్తోన్న సమయంలో ఓ సింపుల్ క్యాచ్ పట్టుకోవడంలో కట్టింగ్ విఫలమయ్యాడు. మెల్‌బోర్న్ ఇన్నింగ్స్ తొలి ఓవర్‌‌లో ప్యాటిన్‌సన్ వేసిన నాలుగో బంతిని రెనెగేడ్స్ బ్యాట్స్‌మన్ మార్కస్ హారిస్ గాల్లోకి షాట్ కొట్టాడు. గాల్లో ఉన్న బంతిని బెన్ కట్టింగ్ అంచనా వేయడంలో విఫలమవ్వడంతో...ఆ బాల్ నేరుగా ముఖాన్ని తాకింది. నుదురు,ముక్కు మీద బలంగా తాకడంతో రక్తం కారింది. వెంటనే ప్రధమ చికిత్స చేయించుకుని తిరిగి మ్యాచ్ ఆడాడు బెన్. గాయమైనా కానీ ఆటలో కొనసాగి తన క్రీడా స్పూర్తిని చాటుకున్నాడు.

ఈ సిక్స్ ఫీట్ ఆల్‌రౌండర్ భారత క్రికెట్ అభిమానులకు సుపరిచితుడే. 2016లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇండియన్ ప్రీమియర్ లీగ్ చాంపియన్‌గా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఫైనల్‌లో మెరుపు హాఫ్ సెంచరీతో ఉర్రూతలూగించి...మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. ప్రస్తుతం ముంబై ఇండియన్స్‌కు జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇప్పటికే వన్డే,టీ20ల్లో ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం వహించాడు. హార్డ్ హిట్టింగ్, పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌ అయిన బెన్ ఫీల్డింగ్‌లోనూ అద్భుతాలు చేస్తుంటాడు.క్యాచ్‌లు ఎలా పట్టాలో.. ఇంటర్నేషనల్ క్రికెట్‌లో ఒక బెంచ్ మార్క్ సెట్ చేసిన దేశం ఆస్ట్రేలియా. కళ్లు చెదిరే క్యాచ్‌లు పట్టడంలో ఫేమస్ అయిన కంగారూ క్రికెటర్లు ట్రెండ్ క్రియేట్ చేయడంలో ముందుంటారు. ఆ దేశానికి చెందిన క్రికెటర్లు క్యాచ్‌లు మిస్ చేయడం చాలా అరుదు.
First published: January 10, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...