హోమ్ /వార్తలు /క్రీడలు /

Hockey World Cup 2018: హాకీ వరల్డ్ కప్ విజేత బెల్జియం

Hockey World Cup 2018: హాకీ వరల్డ్ కప్ విజేత బెల్జియం

హాకీ వరల్డ్ కప్ విజేత బెల్జియం. ఫైనల్లో నెదర్లాండ్స్‌పై విజయం(Photo: Hockey India/Twitter)

హాకీ వరల్డ్ కప్ విజేత బెల్జియం. ఫైనల్లో నెదర్లాండ్స్‌పై విజయం(Photo: Hockey India/Twitter)

Hockey World Cup 2018 | భారత్ ఆతిథ్యమిచ్చిన హాకీ వరల్డ్ కప్ 2018 విజేతగా బెల్జియం నిలిచింది. ఫైనల్లో నెదర్లాండ్స్ జట్టును ఓడించి టైటిల్ గెలుచుకుంది బెల్జియం.

  హాకీ వరల్డ్ కప్‌- 2018 టైటిల్‌ను బెల్జియం కైవసం చేసుకుంది. భువనేశ్వర్‌లోని కలింగ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో నెదర్లాండ్‌ను ఓడించి కప్‌ను బెల్జియం సొంతం చేసుకుంది. ఆటలో ఒక్క గోల్‌ కూడా నమోదు కాకుండా డ్రాగా ముగియడంతో...విజేతను తేల్చేందుకు పెనాల్టీ షూటౌట్‌ అనివార్యమైంది. ఉత్కంఠభరితంగా సాగిన షూటౌట్‌లో బెల్జియం 3-2 తేడాతో విజయం సాధించి విశ్వ విజేతగా నిలిచింది.

  షూటౌట్‌లో మొదట బెల్జియం ఆటగాడు వాన్‌ అబెల్‌ ఫ్లోరెంట్‌ గోల్‌ చేశాడు. నెదర్లాండ్స్‌ నుంచి జెరోన్‌ గోల్‌ చేశాడు. స్కోరు 1-1తో సమమైంది. రెండో దఫాలో రెండు జట్లు విఫలమయ్యాయి. అయితే మూడు, నాలుగు అవకాశాల్లో బెల్జియం తన అవకాశాలను సద్వినియోగం చేసుకుంది. చివరిది మిస్‌ చేసింది. కాగా నెదర్లాండ్స్‌ నాలుగో అవకాశంలో తప్ప అన్నింటా విఫలమైంది. దీంతో 3-2తో బెల్జియంను స్వర్ణ పతకం వరించింది.

  పురుషుల హాకీ వరల్డ్ కప్ టైటిల్‌ను బెల్జియం గెలుచుకోవడం ఇదే తొలిసారి. రియోడీ జెనీరోలో 2016 జరిగిన ఒలంపిక్స్‌లో బెల్జియం పురుషుల హాకీ జట్టు రజత పతకాన్ని కైవసం చేసుకుంది. ఒలంపిక్స్‌లో రజత పతకం తర్వాత హాకీలో బెల్జియం జట్టు సాధించిన రెండో అతిపెద్ద పతకం ఇదే కావడం విశేషం. నెదర్లాండ్స్‌లోని హేగ్‌లో జరిగిన గత హాకీ వరల్డ్ కప్ పోటీల్లో బెల్లియం ఐదో స్థానంలో నిలిచింది.

  రన్నరప్‌గా నిలిచిన నెదర్లాండ్స్ రజత పతకంతో సంతృప్తి చెందింది. అటు కాంస్య పతకం కోసం జరిగిన మరో మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను 8-1 తేడాతో ఆస్ట్రేలియా చిత్తు చేసింది.

  Pics: హాకీ వరల్డ్ కప్ విజేత బెల్జియం- గ్యాలరీ

  Published by:Janardhan V
  First published:

  Tags: Hockey World Cup 2018

  ఉత్తమ కథలు