Home /News /sports /

BEFORE SREESANTH THERE WAS TINU YOHANNAN FROM KERALA CHECK DETAILS AND HIS STORY JNK GH

Tinu Yohannan: శ్రీశాంత్ కంటే ముందు టీం ఇండియాకు ప్రాతినిధ్యం వహించిన తొలి కేరళ క్రికెటర్ ఎవరో తెలుసా? అతడి గురించి ఆసక్తికర విషయాలు ఇవే

టీమ్ ఇండియాకు ఆడిన తొలి కేరళ క్రికెటర్ ఎవరో తెలుసా?

టీమ్ ఇండియాకు ఆడిన తొలి కేరళ క్రికెటర్ ఎవరో తెలుసా?

Tinu Yohannan: కేరళ రాష్ట్రం నుంచి చాలా మంది ఆటగాళ్లు ఇండియన్ క్రికెట్ టీంలో స్థానం దక్కించుకోగలిగారు. అయితే కేరళ నుంచి తొలిసారిగా ఇండియన్ క్రికెట్ టీంలో చేరింది శ్రీశాంత్‌‌యే అని చాలా మంది అనుకుంటుంటారు. కానీ అతడి కంటే ముందే ఒక కేరళ ప్లేయర్ టీమిండియా తరఫున ఆడాడు. అతడే టిను యోహన్నన్.

ఇంకా చదవండి ...
కేరళ రాష్ట్రం నుంచి చాలా మంది ఆటగాళ్లు టీమ్ ఇండియాలో (Team India)  స్థానం దక్కించుకోగలిగారు. అయితే కేరళ నుంచి తొలిసారిగా ఇండియన్ క్రికెట్ టీంలో చేరింది శ్రీశాంత్‌‌యే (Sreeshanth) అని చాలా మంది అనుకుంటుంటారు. కానీ అతడి కంటే ముందే ఒక కేరళ ప్లేయర్ టీమిండియా తరఫున ఆడాడు. అతడే టిను యోహన్నన్(Tinu Yohannan). డిసెంబర్ 3, 2001న టిను యోహన్నన్ కేరళ (Kerala) నుంచి భారత క్రికెట్ జట్టుకు ఆడిన మొదటి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. అప్పట్లో మొహాలిలోని పీసీఏ స్టేడియంలో ఇంగ్లండ్‌తో టీమిండియా పోటీ పడింది. ఈ సిరీస్‌లోని మొదటి టెస్ట్‌లో తొలిసారిగా బౌలింగ్ చేశాడు టిను. అతడు తన నాల్గవ బంతికే తన మొదటి వికెట్‌ను దొరకబుచ్చుకున్నాడు. కుడిచేతి వాటం గల టిను ఫాస్ట్ మీడియం బౌలింగ్‌లో మార్క్ బుట్చర్ క్యాచ్ ఔట్ అయ్యాడు. అయితే ఈ మ్యాచ్ జరిగి తాజాగా 20 ఏళ్లు పూర్తయింది. ఈ తరుణంలో అతను మీడియాకి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.

ప్రస్తుతం కేరళ సీనియర్ పురుషుల క్రికెట్ జట్టు కోచ్‌గా యోహన్నన్ వ్యవహరిస్తున్నాడు. “నేను ఫస్ట్‌క్లాస్ క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత కూడా కోచింగ్‌తో పాటు గేమ్‌లో ఎప్పుడూ నిమగ్నమై ఉన్నాను. అందుకే క్రికెట్ ఆటకు రాజీనామా చేసి రెండు దశాబ్దాలు గడిచిపోయాయని అనిపించడం లేదు,” అని యోహన్నన్ చెప్పారు. ఎస్.శ్రీశాంత్ పాపులర్ కేరళ ప్లేయర్ అయి ఉండవచ్చు. కానీ యోహన్నన్ మాత్రం కేరళకు ట్రయిల్‌బ్లేజర్‌గా మిగిలిపోయాడు. అప్పట్లో కేరళ నుంచి టీమ్ఇండియాలో చేరే వారి సంఖ్య దాదాపు శూన్యంగానే ఉండేది. ఆ సమయంలో టిను క్రికెట్‌లో అరంగేట్రం చేసి ఆశ్చర్యపరిచాడు. ఇంకో విశేషం ఏంటంటే, మూడు దశాబ్దాలుగా లాంగ్ జంప్‌లో జాతీయ రికార్డును కలిగి ఉన్న లెజెండరీ ఒలింపియన్ టీసీ యోహన్నన్ కుమారుడే ఈ టిను యోహన్నన్.

Azaz Patel : అజాజ్ పటేల్ కన్నా ముందే 10 వికెట్లు తీసిన మొనగాళ్లు వీళ్లే..!


కేరళ నుంచి భారత జట్టులో చోటు దక్కించుకున్న తొలి ఆటగాడు..

“నా కంటే ముందు చాలా మంది ఆటగాళ్లు కేరళ నుంచి భారత్‌ టీంలో ఆడాలని ప్రయత్నించారు. కానీ ఆ అవకాశం నాకు దక్కింది. దీంతోకేరళ నుంచి భారత జట్టలో చోటు దక్కించుకున్నతొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాను. కెఎన్ అనంతపద్మనాభన్ వంటివారు వారు కొద్దిలో అదృష్టాన్ని చేజార్చుకున్నారు. కానీ నాకు చివరిగా భారతదేశం తరఫున ఆడే అవకాశం దక్కింది. అందుకు నేను దేవుడికి ఎల్లప్పుడూ కృతజ్ఞుడనై ఉంటాను” అని మూడు టెస్టులు (5 వికెట్లు), మూడు వన్డేలలో (5 వికెట్లు) భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన టిను చెప్పాడు.

MS Dhoni - Raai Laxmi : " నా జీవితంలో చెరిగిపోని మచ్చ " .. ధోనీతో బ్రేకప్ పై రాయ్ లక్ష్మీ సంచలన నిజాలు..


ఇంగ్లండ్‌, టీమిండియా సిరీస్‌కి ముందు టిను రంజీ ట్రోఫీలో కూడా ఆడాడు. రెండు సీజన్లలో 20, 25 వికెట్లతో అతడు అదరగొట్టాడు. దులీప్ ట్రోఫీ, ఇరానీ ట్రోఫీలో కూడా తన సత్తా చాటాడు. మరోపక్క దక్షిణాఫ్రికాతో విదేశాల్లో జరిగిన సిరీస్‌లో భారత్ ఓడిపోయింది. తర్వాత ఇండియా ఆటగాళ్లలో మార్పులు చేయాలని సెలెక్టర్లు భావించారు. అప్పుడే టిను పేరు తెరమీదకు వచ్చింది. అతని ట్రాక్ రికార్డ్ చూసి మొహాలీ టెస్టులో భారత్‌ తరఫున సెలక్ట్ చేశారు సెలెక్టర్లు. అదే టెస్టులో ఇక్బాల్ సిద్ధిఖీ, సంజయ్ బగర్‌లు కూడా అరంగేట్రం చేశారు. సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్, అనిల్ కుంబ్లే, ఇతరులతో కూడిన డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లాలంటే కొత్త క్రికెటర్లు కాస్త భయపడేవారట. కానీ ఆ తర్వాత భయపడాల్సిన అవసరం లేదని టినుకు తెలియవచ్చింది. ఆ దిగ్గజ ఆటగాళ్లంతా తమతో వెంటనే కలిసిపోయారని టిను చెప్పాడు. జాన్ రైట్ (కోచ్) తమని జట్టుకు పరిచయం చేశారని వెల్లడించాడు. సౌరవ్ (కెప్టెన్), ఇతర సీనియర్లు తాము ఆదరంగా ఆహ్వానించాలని చెప్పుకొచ్చాడు.

BCCI AGM festival Match: గంగూలీ టీమ్‌పై ఒక్క పరుగు తేడాతో గెలిచిన జై షా టీమ్.. ఈడెన్ గార్డెన్‌లో మ్యాచ్
టిను తన తొలి మ్యాచ్ అనుభవం గురించి కూడా వివరించాడు. భారత్ టాస్ గెలిచి బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుందని తెలిపాడు. లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్ మన్లను తాను సులభంగా ఔట్ చేయగలనని.. అందుకే తన నాల్గవ బంతికే మార్క్ బుట్చర్ ను ఔట్ చేశానన్నాడు. లక్ష్మణ్ క్యాచ్ పట్టాడని గుర్తు చేసుకున్నాడు. విధ్వంసకర బ్యాట్స్ మన్ గా దూసుకెళ్తున్న మార్కస్ ట్రెస్కోథిక్ ను కూడా టిను ఔట్ చేశాడు. దాంతో ఇంగ్లాండ్ జట్టు ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ మ్యాచ్ లో టీమిండియా పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టిను రెండో ఇన్నింగ్స్‌లో కూడా ఇంగ్లండ్ ఓపెనర్లిద్దరినీ మళ్లీ ఔట్ చేసి తన ప్రతిభను చాటుకున్నాడు.

IND vs NZ: మయాంక్ అగర్వాల్ సెంచరీ వెనుక ఉన్న స్టోరీ తెలుసా? మ్యాచ్‌కు ముందు పలుమార్లు ఆ వీడియో చూశాడంటా..!
ఎంఆర్ఎఫ్(MRF) పేస్ ఫౌండేషన్‌కు క్రెడిట్

ఎంఆర్ఎఫ్ పేస్ ఫౌండేషన్‌లో చేరినప్పుడు టినుకు జిల్లా స్థాయిలో క్రికెట్ ఆడిన అనుభవం కూడా లేదు. 1997లో ఎంఆర్ఎఫ్ ఫౌండేషన్‌లో చేరిన టిను 2001లో ఇండియా జెర్సీని ధరించే స్థాయికి ఎదిగాడు. కేవలం నాలుగేళ్లలోనే ఇండియా తరపున ఆడే అవకాశం దక్కించుకోవడం నిజంగా విశేషమే!

Pro kabaddi League: డాష్, బ్లాక్.. కబడ్డీలో ఉన్న ఐదు ఫన్నీ డిఫెన్స్ స్ట్రాటజీలు మీకు తెలుసా?


టిను టీం నుంచి ఎలా వైదొలిగాడు?

భారతదేశం 2002 వెస్టిండీస్ పర్యటనలో టిను బార్బడోస్‌లో తొలి వన్డేలో ఆడాడు. ఈ అరంగేట్ర మ్యాచ్ లో ఎడమచేతి వాటం ఆటగాళ్లు అయిన వేవెల్ హిండ్స్, క్రిస్ గేల్, రిడ్లీ జాకబ్స్ లను ఔట్ చేసి (3/33) విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆ తరువాత జవగల్ శ్రీనాథ్, ఆశిష్ నెహ్రా, అజిత్ అగార్కర్ వంటి సీనియర్ బౌలర్లు ఫామ్‌లోకి రావడంతో టిను తన స్థానం కోల్పోయాడు. టిను యోహన్నన్ 59 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల ఆడి 145 వికెట్లు, 45 లిస్ట్-ఎ మ్యాచ్‌ల్లో 63 వికెట్లు పడగొట్టాడు. 2014 నుంచి అతను బౌలింగ్ కోచ్, కేర్‌టేకర్ కోచ్ గా పనిచేసాడు. ఇప్పుడు పురుషుల జట్టు ప్రధాన కోచ్ గా కొనసాగుతున్నాడు. ఇలా కేరళ క్రికెట్‌లో అనేక పదవిలో కొనసాగుతూ టిను బిజీగా ఉన్నాడు.

(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
Published by:John Kora
First published:

Tags: Kerala, Sreesanth, Team india

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు