BEFORE SHAMSI LEFT THE RAJASTHAN ROYALS CAMP HE GOT A MESSAGE FROM THE MANAGEMENT JNK
IPL 2021: బాయ్ బాయ్ షంసీ.. వరల్డ్ కప్ మంచిగా ఆడు.. కానీ గెలవకు.. రాజస్థాన్ టీమ్ సర్ప్రైజ్ మెసేజ్
తబ్రెజ్ షంసీకి స్పెషల్ మెసేజ్ పంపిన రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం (PC: CSA)
IPL 2021: ఐపీఎల్ 2021లో ఒక అంకం ముగియడంతో పలు ఫ్రాంచైజీలకు చెందిన ఆటగాళ్లు తమ క్యాంపులను వదిలి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో రాజస్థాన్ రాయల్స్‌కు చెందిన విదేశీ క్రికెటర్లు టీ20 వరల్డ్ కప్ కోసం తమ జట్లతో కలవడానికి వెళ్లారు.
ఐపీఎల్ 2021లో (IPL 2021) లీగ్ దశ ముగియడంతో కేలవం నాలుగు జట్లు మాత్రమే ప్లే ఆఫ్స్ (Play Offs) కోసం అర్హత సాధించిన విషయం తెలిసిందే. మిగిలిన ఫ్రాంచైజీలు తమ ఆటగాళ్లను తీసుకొని ఇండియాకు తిరిగి వచ్చేశాయి. అదే సమయంలో పలు ఫ్రాంచైజీల్లో ఉన్న విదేశీ క్రికెటర్లు కొందరు తమ దేశం తరపున టీ20 వరల్డ్ కప్ (T20 World Cup) కోసం యూఏఈలో ఉండిపోయారు. కానీ తమ ఐపీఎల్ ఫ్రాంచైజీ కేటాయించిన హోటల్ నుంచి తమ జాతీయ జట్టుతో కలవడానికి వెళ్లిపోయారు. ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించలేక పోయిన రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) జట్టు ఆటగాళ్లు శుక్రవారం వీడ్కోలు తీసుకున్నారు. ఆ జట్టులో ఉన్న విదేశీ ఆటగాళ్లు క్యాంపును వీడి తమ దేశానికి చెందిన జట్లతో చేరడానికి వెళ్లిపోయారు. దక్షిణాఫ్రికాకు చెందిన డేవిడ్ మిల్లర్, షంసీ (Tabraiz Shamsi), బంగ్లాదేశ్‌కు చెందిన ముస్తఫిజుర్ రెహ్మాన్ సొంత టీమ్స్ దగ్గరకు వెళ్లిపోయారు. ఈ సందర్భంగా రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం వారికి ఘనంగా వీడ్కోలు పలికింది.
వీడ్కోలు సందర్భంగా షంసీని ఉద్దేశించి మేనేజ్మెంట్లోని ఒక మహిళ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. 'షంసీ.. నువ్వు వరల్డ్ కప్ బాగా ఆడు. కానీ గెలవ కూడదు ఓకేనా.. ఎందుకంటే ఇండియా కప్ గెలవాలి' అని సరదాగా వ్యాఖ్యానించింది. దీనికి షంసీ కూడా వెంటనే బదులు ఇచ్చాడు. 'అసలు చాన్సే లేదు' అంటూ అక్కడి నుంచి నవ్వుకుంటూ వెళ్లిపోయాడు. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్‌గా మారింది. రాజస్థాన్ రాయల్స్ జట్టలో ఎప్పుడూ సరదాగా ఉంటుంది. వాళ్ల సోషల్ మీడియా హ్యాండిల్స్ చూసినా ఆ విషయం స్పష్టంగా అర్దం అవుతూ ఉంటుంది.
ఇక దక్షిణాఫ్రికాకు చెందిన లెఫ్టార్మ్ స్పిన్నర్ తబ్రేజ్ షంసి రెండో దశలో జట్టుతో పాటు కలసిశాడు. ఆండ్రూ టై స్థానంలో జట్టులోకి వచ్చినా.. కేవలం ఒకే మ్యాచ్ ఆడాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఒకే మ్యాచ్ ఆడిన షంసీ వికెట్లేమీ తీయలేదు. ఇక రాజస్థాన్ రాయల్స్ కూడా కేవలం 5 మ్యాచ్‌లే గెలిచి 7వ స్థానంతో సరిపెట్టుకున్నది. కాగా, తబ్రేజ్ షంసీ.. ఐసీసీ టీ20 బౌలర్ల ర్యాంకింగ్‌లో ప్రస్తుతం అగ్రస్థానంలో ఉన్నాడు. అతను దక్షిణాఫ్రికా టీ20 జట్టులో సభ్యుడు కావడంతోనే అలా వ్యాఖ్యానించారు.
Published by:John Naveen Kora
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.