టీమిండియా (Team India) సెంట్రల్ కాంట్రాక్ట్ ప్లేయర్లకు బీసీసీఐ (BCCI) పరోక్ష హెచ్చరికలు పంపింది. త్వరలో నిర్వహించనున్న ఫిట్‌నెస్ క్యాంప్‌కు పదిరోజుల పాటు ఎన్‌సీఏకు అందుబాటులో ఉండాలంటూ తెలిపింది. ఐపీఎల్ 2022 సీజన్‌కి ముందు ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై పూర్తి శ్రద్ధ పెడుతోంది భారత క్రికెట్ బోర్డు. ఐపీఎల్ 2022 (IPL 2022) సీజన్‌కి ముందు భారత సెంట్రల్ కాంట్రాక్ట్ ఉన్న ప్లేయర్లు అందరూ ఎన్‌సీఏలో ఫిట్‌నెస్ క్యాంపులో పాల్గొనాలని ఆదేశించింది బీసీసీఐ. సెంట్రల్ కాంట్రాక్ట్ ప్లేయర్లు అందరూ ఈ క్యాంపులో పాల్గొని, ఫిట్‌నెస్ నిరూపించుకోవాలి. వాస్తవానికి ఐపీఎల్ ఆరంభానికి ముందు ప్లేయర్లు అంతా కలిసి ఫ్రాంఛైజీలు ఏర్పాటు చేసే క్యాంపుల్లో పాల్గొంటూ యమా బీజీగా ఉంటారు. అయితే ఈసారి మాత్రం బీసీసీఐ రూటు మార్చింది. 74 రోజుల పాటు సాగే సుదీర్ఘ లీగ్ కావడం, ఆ తర్వాత టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ కూడా ఉండడంతో ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై పూర్తి శ్రద్ధ పెట్టింది బీసీసీఐ.
" ద్వైపాక్షిక సిరీస్‌లు, అంతర్జాతీయ మ్యాచులకు ముందు ఆటగాళ్లు ఫిట్‌గా ఉండేలా చూడడం మా కర్తవ్యం. ఈసారి ఐపీఎల్ విషయంలోనూ ఫిట్‌నెస్ క్యాంపు నిర్వహిస్తున్నాంబెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో సెంట్రల్ కాంట్రాక్ట్ ప్లేయర్లు అందరూ ఈ క్యాంపులో పాల్గొని, ఫిట్‌నెస్ నిరూపించుకోవాలి.హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ 10 నెలల పాటు భారత జట్టుకు అందుబాటులో ఉంటారు, కేవలం రెండు నెలలు మాత్రమే ఐపీఎల్ జరుగుతుంది. అందుకే ఎన్‌సీఏపై పూర్తి నమ్మకంతో ఫిట్‌నెస్ పరీక్షలు నిర్వహించాల్సిందిగా సూచించారు.
కొంతమంది ప్లేయర్లు, ఐపీఎల్ ముందు ఎన్‌సీఏలో ఉండాలంటే ఫ్రాంఛైజీలు, ఫిజియోలు ఒప్పుకోరని కామెంట్ చేశారు. అయితే టీమిండియాకి ఆడడం కంటే ఏదీ పెద్దది కాదని చెప్పేశాం. ఫిట్‌గా లేకపోతే ఐపీఎల్‌లో ఆడడానికి కూడా అవకాశం ఉండదు. ఆటగాళ్ల ఫిట్‌నెస్, గాయాలపై సమగ్ర అవగాహన అధికారులకు ఉంటుంది." అంటూ వార్నింగ్ ఇచ్చాడు. బీసీసీఐ సెక్రటరీ జై షా.
ఇది కూడా చదవండి : కేఎల్ రాహుల్ జట్టుకు భారీ షాక్.. 7.5 కోట్ల రూపాయలు వృధా అయినట్టేనా..!
శ్రీలంకతో సిరీస్ ముగిసిన తర్వాత టీమిండియా ఆటగాళ్లు ఐపీఎల్‌లో బిజీ కానున్నారు. మరోవైపు హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ మాత్రం టీమిండియా తర్వాత ఆడబోయే మ్యాచ్‌లపై దృష్టి పెట్టనున్నాడు. అందులో టి20 ప్రపంచకప్ 2022 కూడా ఉంది. దీనికి ఇప్పటినుంచే సన్నాహాకాలు ప్రారంభించాలని.. జట్టు కాంబినేషన్ ఎలా ఉండాలి.. ఆటగాళ్లంతా ఫిట్‌నెస్‌తో ఉన్నారా లేదా అనేది చూసుకోనున్నారు.
ఈ విషయాలపై ద్రవిడ్, రోహిత్‌లు ఇప్పటికే చర్చించారని.. ఎవరు టి20 ప్రపంచకప్ వరకు అందుబాటులో ఉండాలనేది నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అందుకే ఐపీఎల్ ప్రారంభానికి ముందే పదిరోజులు ఫిట్‌నెస్ క్యాంప్ ఏర్పాటు చేయనున్నారు. ఈ క్యాంప్‌కు మొత్తం 25 క్రికెటర్లు హాజరు కానున్నారు. ఎన్‌సీఏ అకాడమీ హెడ్ వివిఎస్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఈ ఫిట్‌నెస్ క్యాంప్ జరగనుంది.
ఫిట్‌నెస్ క్యాంప్‌కు హాజరుకానున్న 25 మంది ఆటగాళ్లు.
రుతురాజ్ గైక్వాడ్, శార్దూల్ ఠాకూర్, శిఖర్ ధావన్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, రాహుల్ చాహర్, సంజు శాంసన్, వెంకటేష్ అయ్యర్, అవేశ్ ఖాన్, హర్షల్ పటేల్, దీపక్ హుడా, యుజ్వేంద్ర చాహల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, హార్దిక్ పాండ్యా.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bcci, Hardik Pandya, IPL 2022, Rahul dravid, Shikhar Dhawan