క్రికెటర్లకి బీసీసీఐ షాక్.. కలలోనైనా ఊహించని ఆటగాళ్ళు

భారత క్రికెటర్లు కలలోనైనా ఊహించని షాక్ తగిలింది. పది నెలలుగా ఆటగాళ్ళుకు బీసీసీఐ జీతాలివ్వట్లేదు. ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్‌ బోర్డు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్లేయర్స్‌కు కనీసం జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉందంటే ఇది అందరిని ఆశ్చర్యపరిచే విషయం.

Rekulapally Saichand
Updated: August 3, 2020, 2:01 PM IST
క్రికెటర్లకి బీసీసీఐ షాక్.. కలలోనైనా ఊహించని ఆటగాళ్ళు
ధోనీ,విరాట్ ఫైల్ ఫోటోస్ (BCCI / Twitter)
  • Share this:
ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్‌ బోర్డు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అన్న విషయం తెలిసిందే. దేశంలో క్రికెట్ ‌పరంగా వచ్చే ఆదాయంతో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)ని సైతం శాసిస్తోంది. అలాంటి బీసీసీఐ గత పది నెలలుగా తమ ఆటగాళ్లకు జీతాలివ్వట్లేదు. వినడానికి ఇది ఆశ్చర్యంగా ఉన్నా.. ఇదే అసలు నిజం. బీసీసీఐ బ్యాలెన్స్ షీట్ చూస్తే ఈ విషయం అర్థమవుతోందని ఓ ప్రముఖ వార్తా సంస్థ ప్రచురించింది.

"భారత క్రికెటర్లు కలలోనైనా ఊహించని షాక్ తగిలింది. పది నెలలుగా ఆటగాళ్ళుకు బీసీసీఐ జీతాలివ్వట్లేదు. ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్‌ బోర్డు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్లేయర్స్‌కు కనీసం జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉందంటే ఇది అందరిని ఆశ్చర్యపరిచే విషయం. ఓ ప్రముఖ వార్తా సంస్థ కథనం ప్రకారం.. బీసీసీఐ బ్యాలెన్స్ షీట్ చూస్తే ఆటగాళ్ళకు 10 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదనే విషయం సృష్టంగా అర్థమవుతోంది. ప్రపంచంలోనే సుసంపన్నమైన క్రికెట్ బోర్డు ఇలాంటి పరాణామాన్ని ఎదుర్కొ్ంటుందని ఎవరూ ఊహించలేదు.

2019 అక్టోబరు నుంచి ఆటగాళ్లకి జీతాలతో పాటు మ్యాచ్ ఫీజుల్ని కూడా చెల్లించకపోవడం కొంచం ఆశ్చర్యపరుచే అంశం.

దాదాపు 27 మంది ఆటగాళ్లకు గత అక్టోబర్‌ నుంచి ఇప్పటివరకూ బీసీసీఐ డబ్బులు ఇవ్వలేదు. గతే ఏడాది నుంచి టీమిండియా ఆడిన రెండు టెస్టులు, తొమ్మిది వన్డేలు, ఎనిమిది టీ20ల మ్యాచ్‌ ఫీజులు కూడా ఆటగాళ్లకు ఇంకా అందలేదు. బీసీసీఐ ప్లేయర్స్‌కు ఏడాదికి రూ.99 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఈ పరిణామాలన్నింటిని చూస్తే బోర్డు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులలో ఉన్నట్లు అర్ధమవుతోంది. కరోనా కారణంగా ఆ కష్టాలు మరింతగా పెరిగాయి. టోర్నీలు లేక బోర్డుకు ఆదాయం తగ్గినట్లు ఆ సంస్థ" పేర్కొంది.
Published by: Rekulapally Saichand
First published: August 3, 2020, 1:55 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading