Home /News /sports /

BCCI WILL GROOM THE YOUNG PLAYER BY MAKING THE ROHIT SHARMA AS CARETAKER CAPTAIN THE 14 YEAR OLD STORY WILL BE REPEATED SRD

Rohit Sharma Role : బీసీసీఐ మాస్టర్ ప్లాన్.. 14 ఏళ్ల కథ మళ్లీ రిపీట్ కానుందా..? కేర్‌టేకర్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ..!

Rohit Sharma

Rohit Sharma

Rohit Sharma Role : భారత క్రికెట్ జట్టులో ప్రస్తుతం ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. కొందరు ప్లేయర్స్, బీసీసీఐ సెలెక్టర్లు ఎవరికివారే యమునాతీరులా వ్యవహరిస్తున్నారు. దీనికి చెక్ పెట్టడానికి బీసీసీఐ పెద్దలు 14 ఏళ్ల క్రితం ఏదైదో జరిగిందో అది ఇప్పుడు అమలు చేయాలని భావిస్తోంది.

ఇంకా చదవండి ...
    టెస్టు జట్టు కెప్టెన్సీ నుంచి అకస్మాత్తుగా వైదొలిగిన విరాట్ కోహ్లీ బీసీసీఐని ఇబ్బందుల్లోకి నెట్టాడు. భారత క్రికెట్ జట్టులో ప్రస్తుతం ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. కొందరు ప్లేయర్స్, బీసీసీఐ సెలెక్టర్లు ఎవరికివారే యమునాతీరులా వ్యవహరిస్తున్నారు. బీసీసీఐ (BCCI) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) కూడా ఎలాంటి వివరణ ఇచ్చుకోలేని పరిస్థితి వచ్చింది. ఇందుకు కారణం బీసీసీఐ సెలెక్టర్లు తీసుకున్న నిర్ణయమే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్వయంగా టీ20 ఫార్మాట్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న విరాట్ కోహ్లీ (Virat Kohli)ని ఎలాంటి సమాచారం లేకుండా వన్డే కెప్టెన్‌గా కూడా తొలగించి.. రోహిత్ శర్మ (Rohit Sharma)కు ఆ బాధ్యతలు అప్పగించింది. దీంతో.. కలత చెందిన విరాట్ కోహ్లీ.. ఇప్పుడు టెస్టులకు అనుహ్యంగా గుడ్ బై చెప్పాడు.దీంతో.. టీమిండియా నెక్ట్స్ టెస్ట్ కెప్టెన్ ఎవరన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ,

    ప్రస్తుత భారత జట్టులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రూపంలో ఇద్దరు సూపర్ స్టార్లు ఉన్నారు. జస్ప్రిత్ బుమ్రా, రవీంద్ర జడేజా, రిషబ్ పంత్ వంటి క్రికెటర్లకు ఫాలోయింగ్ ఉన్నా... విరాట్, రోహిత్ ఫాలోయింగ్, క్రేజ్, అనుభవం వేరు. దీంతో.. టెస్ట్ కెప్టెన్ గా చేయడం ఇప్పుడు బీసీసీఐ కఠిన సవాల్ గా మారనుంది.

    టీమిండియా త‌దుప‌రి టెస్టు కెప్టెన్‌కు క‌ఠిన స‌వాల్ త‌ప్ప‌ద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఎందుకంటే టెస్టు క్రికెట్‌లో భార‌త జ‌ట్టును విరాట్ ఆ రేంజులో త‌యారు చేశాడ‌ని అంటున్నారు. బ్యాటర్‌గా ముందుండి న‌డిపించ‌డ‌మే కాకుండా కోహ్లీ జ‌ట్టును బ‌లంగా తీర్చిదిద్దాడు. అంతే కాకుండా కోహ్లీ కెప్టెన్సీలోనే టీమిండియాఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో 42 నెల‌ల‌పాటు అగ్ర స్థానంలో ఉంది.

    14 ఏళ్ల కథ మళ్లీ రిపీట్..

    దీంతో... కోహ్లీ తయారు చేసిన ఈ టాప్ టీమ్ కు కెప్టెన్ ను ఎంపిక చేసేందుకు 2007 లో అనుసరించిన పద్దతినే అమలు చేయాలని బీసీసీఐ ప్లాన్ చేస్తోంది. 2007 లో ఇంగ్లండ్ పర్యటన తర్వాత టెస్ట్ కెప్టెన్సీకి రాహుల్ ద్రావిడ్ గుడ్ బై చెప్పేశాడు.

    ఇది కూడా చదవండి :  వామ్మో.. శ్రేయస్ అయ్యర్ కోసం ఇంత పోటీనా..? ఎంత ధరైనా సరే సై అంటున్న ఫ్రాంచైజీలు..

    దీంతో.. అప్పడు టీమిండియాకు అనిల్ కుంబ్లేని కెప్టెన్ గా చేసింది బీసీసీఐ. అనిల్ కుంబ్లేకి డిప్యూటీగా మహేంద్రసింగ్ ధోనీని నియమించింది. 37 ఏళ్ల వయస్సున్న అనిల్ కుంబ్లే 11 నెలల పాటు 14 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఆ తర్వాత రిటైర్ అయ్యాడు. దీంతో.. ధోనికి సారథ్య బాధ్యతలు అప్పగించింది బీసీసీఐ.

    కేర్‌టేకర్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ..

    ఇప్పుడు అదే పద్దతిని అమలు చేయాలని బీసీసీఐ భావిస్తోంది. రోహిత్ శర్మ లాంటి అనుభవమున్న ప్లేయర్ ని సారథి గా కొంత కాలం పాటు నియమించి.. అతనికి డిప్యూటీ భవిష్యత్తు కెప్టెన్ ను నియమించాలని భావిస్తోంది.

    ప్ర‌స్తుతం వ‌న్డే, టీ20 ల‌కు కెప్టెన్‌గా ఉన్న రోహిత్ శ‌ర్మ‌నే టెస్టుల‌కు కూడా కెప్టెన్ అయ్యే అవ‌కాశాలు ఉన్న‌ప్ప‌టికీ మాజీల నుంచి కేఎల్ రాహుల్, రిష‌బ్ పంత్, జస్ప్రీత్ బుమ్రా వంటి యువ ప్లేయ‌ర్ల పేర్లు కూడా వినిపిస్తుండ‌డంతో కొత్త కెప్టెన్ ఎంపిక‌పై ఆస‌క్తి నెలకొంది. అయితే.. ప్రస్తుతానికి కొంత కాలం పాటు రోహిత్ శర్మని సారథి గా నియమించి.. ఈ ముగ్గురిలో ఒకరిని భవిష్యత్తు కెప్టెన్ చేసే ఛాన్సుంది.

    ఇది కూడా చదవండి : మెగాటోర్నీ కోసం ఏడు వేదికలు ఖరారు.. ఈ నెల 21న కీలక అప్ డేట్..

    కొంతకాలం మాత్రమే కెప్టెన్ గా రోహిత్..

    యంగ్ ప్లేయర్ సెట్ అయ్యే దాకా రోహిత్ శర్మను కేర్ టేకర్ కెప్టెన్ గా నియమించాలన్నది బీసీసీఐ గేమ్ ప్లాన్. వైస్ కెప్టెన్ గా నియమించే ప్లేయర్ అనుభవం తెచ్చుకునేదాకా ఓ ఏడాది లేదా రెండేళ్లు మాత్రమే రోహిత్ శర్మను కెప్టెన్ గా చేసి.. ఆ తర్వాత పూర్తి స్థాయి బాధ్యతలు యంగ్ క్రికెటర్ కు అప్పగించనున్నారు. రోహిత్ శర్మ ప్రస్తుత వయస్సు 34 ఏళ్లు. ఈ వయస్సులో మరో రెండు మూడేళ్లకు మించి రోహిత్ శర్మ ఆడే ఛాన్సులు తక్కువ. అందుకే.. అనుభవం గల రోహిత్ శర్మనే కేర్‌టేకర్ కెప్టెన్‌గా పనికొస్తాడన్నది బీసీసీఐ ఆలోచన. బీసీసీఐ తన గేమ్ ప్లాన్ ని ఎలా అమలు చేస్తోందో మరి చూడాలి.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Bcci, Jasprit Bumrah, KL Rahul, MS Dhoni, Rishabh Pant, Rohit sharma, Team India, Virat kohli

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు