హోమ్ /వార్తలు /క్రీడలు /

Team India: టీమ్ ఇండియా నుంచి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఔట్.. కొత్త కుర్రాళ్లకు చాన్స్ ఇవ్వనున్న బీసీసీఐ

Team India: టీమ్ ఇండియా నుంచి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఔట్.. కొత్త కుర్రాళ్లకు చాన్స్ ఇవ్వనున్న బీసీసీఐ

Virat Kohli and Rohit Sharma

Virat Kohli and Rohit Sharma

Team India: టీమ్ ఇండియాలో కీలక ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ షమిలకు విశ్రాంతి కల్పించాలని బీసీసీఐ నిర్ణయించింది. న్యూజీలాండ్ సిరీస్‌లో వారికి విశ్రాంతిని ఇచ్చి కొత్త కుర్రాళ్లకు చాన్స్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.

ఇంకా చదవండి ...

  టీమ్ ఇండియా (Team India) కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli), వైస్ కెప్టెన్ రోహిత్ శర్మను (Rohit Sharma) పరిమిత ఓవర్ల జట్టు నుంచి తప్పించేందుకు బీసీసీఐ (BCCI) నిర్ణయించింది. అదేంటి టీ20 వరల్డ్ కప్ (T20 World Cup) జట్టు నుంచి వారిని ఎలా తప్పిస్తారని సందేహిస్తున్నారా? అవును జట్టు నుంచి వారికి విశ్రాంతి కల్పిస్తున్నారు. కానీ అది వరల్డ్ కప్ తర్వాత జరగబోయే న్యూజీలాండ్ (New Zealand) సిరీస్ నుంచి అని సమాచారం. టీ20 వరల్డ్ కప్ ముగిసిన వెంటనే మూడు రోజులకు న్యూజీలాండ్ - ఇండియా మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరుగనున్నది. నవంబర్ 17, 19, 21 తేదీల్లో జరుగనున్న ఈ సిరీస్‌కు సీనియర్ క్రికెటర్లు అయిన కోహ్లీ, రోహిత్ శర్మతో పాటు జస్ప్రిత్ బుమ్రా (Jasprit Bumrah), మహ్మద్ షమిలకు (Mohammad Shami) విశ్రాంతి ఇవ్వడానికి బీసీసీఐ నిర్ణయించింది. సుదీర్ఘ కాలంగా వీళ్లు క్రికెట్ ఆడుతున్నారు. జూన్‌లో ఇంగ్లాండ్ పర్యటన, ఆ తర్వాత ఐపీఎల్ ఆడుతూ ఇంటికి దూరంగా ఉన్నారు. అందుకే వీళ్లకు విశ్రాంతి కల్పించి ఐపీఎల్‌లో రాణించిన కుర్రాళ్లకు చాన్స్ ఇవ్వాలని బీసీసీఐ భావిస్తున్నది.

  ఐపీఎల్ స్టార్స్ వెంకటేశ్ అయ్యర్, హర్షల్ పటేల్, రుతురాజ్ గైక్వాడ్, అవేశ్ ఖాన్‌లకు జట్టులో స్థానం దక్కే అవకాశాలు ఉన్నట్లు బోర్డు అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. డిసెంబర్‌లో దక్షిణాఫ్రికాతో సిరీస్ ఉన్నది. అప్పటికి కోహ్లీ, రోహిత్ అందుబాటులోకి వస్తారని బీసీసీఐ వర్గాలు అంటున్నాయి. అయితే గతంలో శ్రీలంక పర్యటనకు బీసీసీఐ వేరే జట్టును పంపించింది. దానికి శిఖర్ ధావన్‌ను కెప్టెన్‌గా నియమించారు. అయితే ఈ సారి మాత్రం కేఎల్ రాహుల్‌కు బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నాయి. టీ20 వరల్డ్ కప్ జట్టులో ధావన్ లేడు. మరి అతడిని న్యూజీలాండ్‌తో సిరీస్‌కు ఎంపిక చేస్తారా లేదా అని తెలియాల్సి ఉన్నది.

  T20 World Cup: ఒక్క ఫొటోలో ఇన్ని అర్థాలున్నాయా? రోహిత్ శర్మ అంత ఆలోచించాడా? కేఎల్ రాహుల్ ఎందుకలా జెర్సీ లాక్కుంటుండు?  టీ20 వరల్డ్ కప్ తర్వాత హెడ్‌ కోచ్ రవిశాస్త్రి పదవి నుంచి తప్పుకుంటున్నాడు. సహాయక సిబ్బంది విక్రమ్ రాథోడ్, భరత్ అరుణ్, ఆర్.శ్రీదర్‌ల పదవీ కాలం కూడా ముగియనున్నది. మరి బీసీసీఐ ఈ లోపు కొత్త కోచ్, సహాయక సిబ్బందిని నియమిస్తుందా అనేది ప్రశ్నార్థకమే. అయితే రాహుల్ ద్రవిడ్‌ను తాత్కాలిక కోచ్‌గా నియమించేందుకు బీసీసీఐ అతడిని సంప్రదించినట్లు తెలుస్తున్నది. గతంలో శ్రీలంక పర్యటన సమయంలో కూడా ద్రవిడ్.. టీమ్ ఇండియాకు తాత్కాలిక కోచ్‌గా పనిచేశాడు. పూర్తి స్థాయి కోచ్‌గా పని చేయడానికి ద్రవిడ్ విముఖత చూపిస్తున్నాడు. అయితే కొత్త కోచ్ వచ్చే వరకు అయినా తాత్కాలిక కోచ్‌గా బాధ్యతలు చేపట్టాలని బీసీసీఐ కోరినట్లు తెలుస్తున్నది.

  Published by:John Kora
  First published:

  Tags: Rohit sharma, Team India, Virat kohli

  ఉత్తమ కథలు